Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.7 (1925).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైర్య శాలురు, కాని వారు ధైర్యమును గుణించి యుపన్యాసము నియ్యజాలరు. వ్యాసమును వ్రాయలేరు. కావున జ్ఞానము కలిగియుండుట వేఱు; దాని ననుసరించి ప్రవర్తించుట వేఱు. దేశీయుల యొక్క శీలమును జాతీయతాభావమును పెంపొందవలయునన్న జ్ఞానము ననుసరించి ప్రవర్తించ వలయునను ధైర్యమును, సత్య సంకల్పము నుండవలయును. ఇతర దేశములలో నీ లైబ్రరీ లెంత పని చేయునో చెప్పెదను.

జ్ఞానమునకు ఉత్పత్తి, వ్యాపకము నను రెండు దశలు కలవు. మహనీయులచే గొప్ప సంగతులకు వినినప్పుడు జ్ఞానము ఉత్పత్తియగును. కవులును మహనీయులఁను Bమ ప్రతిభచే జ్ఞానమును సంపాదింతురు. సాధారణులమగు మనము అట్టివారిచే సంగతులను విని వానిని వ్యాపింపజేయఁనగు, ఇప్పుడున్న విషయములకు వ్యాపకము బాగుగ జరిగిన గాని కొత్తసంగతు లదయింపవు. మన ఆయుర్వేద వైద్యులవలె నున్నది. మూసిపెట్టినచో జ్ఞానము వృద్ధిచెందక నశించును. ఎప్పుడు దాచి పెట్టబడినదో అప్పుడే జ్ఞానముయొక్క నూతన వికాసము చచ్చిపోయినది. నూతన సృష్టి ఇప్పుడున్న వానిపైననే యాధారపడియుండును. కావున మనకు తెలిసిన సంగతులెంత త్వరిగా దేశమున హ్యాపించిన నంత మేలు. మన దేశపు పరిచయముగల అమెరికను డొకడిట్లు చెప్పిను "హిందూ దేశములో నేదైన యొక క్రొత్తసంగతి వ్యాపించుటకు 75 సంవత్సరములు పట్టును అమెరికాలో నద్దానికి 6 నెలలు చాలును. వేడినీరు త్రాగుట మంచిదని యొకరు 'నేడు సిద్ధాంతీకరించి రనుకొనుడు. ఆ సంగతి మన దేశీయుల కందలుకును తెలియటకు 75 యేండ్లు గావలయునట! ఏమందురా? అమెరికాలో ప్రతి గ్రామమున నొక లైబ్రరి యున్నది. కాని లైబ్రరీలలో నెన్ని పుస్తకము లున్నను వాక్కమూలమున గాని జ్ఞానము వ్యాపింపదు. అందుకొఱకై అమెరికను లైబ్రరీలలో వారమున కొకటి రెండుపన్యాసములు జరుగు తండును, మన వారింకను ప్రాచీనములైన భక్తి, భగవద్గీత, రామాయణముల గుఱించిన యుపన్యాసముల పెట్టుకొనుచుందురు. ఇట్టి విప్పు డనవసరములని చెప్పక తప్పదు. ఏమందురా? మనమొక్క జాతివారము కనుక ఇంచుమించుగ నందఱిలోను ఇట్టి భావములు ప్రసరించి యుఁడును, వానినే పదిచోట్ల పదిమారులు వర్ణించినచో లాభములేదు. భారత భాగవత రామాయణములు మన జాతీయతా వృక్షమునకు మొదలు వంటివి. ఎల్లకాలము వానికే ప్రదక్షిణము చేయుచుండుటలో నుపయోగములేదు, కాని ఆవృక్షమునను కొమ్మలు, చిగుళ్లు,ఆకులు పుష్పములు, పండ్లు నుదయింపజేయవలెను. 10 వేల యుపన్యాసములైనను యిప్పుడున్న మీ భక్తి కెచ్చుగాదు. చదులేనివారి కుడయింపదు. చెప్పవచ్చిన దేవన, కోత్త సంగతులను జనసామాన్యమునకు వ్యాపింపజేయుటే లైబ్రరీలకు ప్రధాన కర్తవ్యమని, భక్తి, బాల గంగాధరతిలకులను మాటిమాటికి ప్రదర్శించుటకంటె ఆధునిక దేశ చరిత్రలవిషయము చర్చించుట లాభకరముగా నుండును. ఇతర దేశముల పరిపాలనమును గురించియు వారి సంఘనిర్మాణమును గుఱించియు నప్పుడప్పుడుపన్యాసముల నుంచుకొన్నచో జనులకు నిజమగు ప్రబోధ ముదయించును. గ్రామపురోభివృద్ధిని గుఱించి నే నెక్కువ ప్రచారమును జరుపదలచినాను. అందఱును ధర్మవరమువంటి పట్టణములకు వచ్చి యుపన్యాసములను వినిపోవుట సాధ్యముగాదు, మనదేశములో గ్రామముల సంఖ్య హెచ్చు. ఇంకను మనవారికి శ్రుతి ప్రమాణము. కంటిలోకంటే చెవితోడనే వారు జ్ఞానమును సంపాదింతురు. కావుని విద్యావంతులు వర్తమానమునకు సంబంధించిన రెండుపన్యాసములైనను నెలనెలకు నేదో యొక గ్రామమునకు పోయి యిచ్చునట్లు శపథము చేసికొని పనిచేయవలెను. కడచిన సంగీతులే పలుమారు పారాయణము చేయుట వృథా ప్రయాస. భూతము మనల పట్టియేయున్నది. ఆభూతమునే మరల మరల నాహ్వానించుట పనికిమాలిన పని. వర్తమానమును గలిపి భవిష్యత్తునకు దారి చూపవలయును. నానాటికి నభివృద్ధి జెందుటయే మన యాదర్శముగా నుండవలయును. మనముగూడ కాలప్రవాహముతో పోవలయును గాని స్తంభించి యొకచో కూర్చున్నచో ఇతర పరిహాసమునకు పాత్రులగుదుము. దేశీయులు లైబ్రరీలలో గ్రంధము లైనను వర్తమాన శాస్త్రములను గుఱించి హెచ్చుగా నుండవలెను. లైబ్రరీల యుద్దేశ్యము జ్ఞానవ్యాపకముగాని పాండిత్యప్రకటనము గాదని తొలుతనే మనవిచేసికొంటిని. విద్యావ్యాపకశాఖ లితర దేశములలో గలవు. గ్రామ గ్రామములోను సభలు చేసి వారు బోధింతురు. ఇందునకు పాండిత్య మనవసరము. అందరకు నుపయోగపడునది పాండిత్యముగాదు. పై సంఘముల వారు నూరారు మంది యుపన్యాసకులను తయారు చేసి గా గ్రామములకు పంపెదరు. వారికి కావలసినది సామాన్యజ్ఞానము. అట్లే లైబ్రరీ