Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.7 (1925).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుఁగొనిపోఁగలిగిన మహాత్ములయందీయన యోకరు. ఈకారణము చేతనే మహాయన బౌద్ధసిద్ధాంతములను గూర్చిన ప్రాచీన సంస్కృత గ్రంధము లనేకములు జన్మస్థలమగు భారతవర్షమునందు లభ్యము గాకున్నను, వాని భాషాంతరీకరణములు మాత్రము చీనా, జపాను దేశముల యందుగల దేవాలయ గ్రంథ భాండాగారముల యందు సురక్షితముగా నున్నవి.

“నలంద విశ్వవిద్యాలయము యొక్క ప్రాముఖ్యత క్షీణిఁచుటకు ప్రాణః భించినప్పుడు డీ మగధరాజ్యము నేలంచుండిని "పల" రాజులు యాదరణ క్రింద “ఉదంత పురి” యందును “విక్రమశిల” యందును రెండు విశ్వవిద్యాలయములు బయలు దేరును. ఈరెండు విశ్వ విద్యాలయములకును ననుబంధముగ మిక్కిలి ప్రాముక్యత జెందిన రెండు గొప్పగ్రంథాలయుములు గలవు. నలంద, ఉదంతపురి, విక్రమశిల గ్రంధాగారంములనుండియే అసంఖ్యకములగ గ్రంధరాజములను దీసుకొనిపోయి తమ భాషను టిబెత్తు దేశీయులు ఐశ్వర్య వంతముగా జేసి కొనిరి. గ్రంథాగార ముంపబడిన ఉదంతపురి విహారము "నలంద" "బుద్ధగయల" యందున్న విహారముల కంటే మహోత్తరమైనదని చెప్పదరు. ఈ ఉదంతపురి గ్రంథాగారము నందు బౌద్ధ సంబంధములను సనాతన మతసంబంధములును నగు గ్రంధములు అసంఖ్యాకముగా నుండెను. ౧౨౧౨ క్రీ.శ. సంవత్సరమునందు బీహారు దేశమును భక్తియారు ఖిల్జి జయించినప్పుడు జానీ సేనయగు "మహమ్మరు బిన్ సి వి” చే నీ గొప్ప గ్రంథాగారము తగలబెట్టబడెను.

ఉత్తర హిందూస్థాన మందున్న విహారములలో చాల భాగము ప్రధమమున మనదేశమునకు వచ్చిన మహమ్మదీయుల వలననే నిర్మూలము గావింపఁ బడినది. అందుచేత భిక్షులు తాము మోయ గలిగినన్ని మత గ్రంధములను దీసికొని “నేపాలు” దేశమునకు పారిపోయిరి. టిబెత్తు దేశమునను హిందూదేశమన కంతకును నేపాలు దేశమునందును మాత్రమే బౌద్ధమతమునకు సంబంధించిన సంస్కృత గ్రంథములలో కొన్నియైన దొరకినవి. ఈ భాగములను మిక్కిలి శ్రద్ధతో పరిశీలించిన బౌద్ధమశమును గూర్చిన అమూల్య ములగు విషయములను బోధింపగల అపూర్వ గ్రంధము లింకను బయలు వెడల వచ్చును. నేపాలు దేశమునకు భిక్షులచేఁ గొనిపోఁబడిన అమూల్యములగు గ్రంథరాజములను గొన్నిటిని మన ప్రభుత్వము వారిచే నియోజితులగు మంత్రులు సంపాదించి ఇంగ్లాండునకు గొనిపోయిరి. ఇదిచాలక ఆదేశమునకు మంత్రియగు మహారాజు - చంద్రపఁషీ రుజంగు బహద్దరు గారు ౧౯౦౯ సంవత్సరమున ఆక్సఫోర్డ్ నగరమునందలి బొడ్డలి బోడియను గ్రంథాలయమునకు ౬౩౩౦ సంస్కృత లిఖిత గ్రంథములను ఉచితముగా నొసంగి మన దేశమునకు యథార్థమగు దార్ఢ్యమును దెచ్చెను. మన దేశమునకు ఐశ్వర్యమే సారస్వతైశ్వర్యము. ఎంత వెండిపోయినను బంగార మెంత పోయినను దిగులు పడవలసిన పనిలేదు. కాని యీ విజ్ఞానైశ్వర్య నష్టముయొక్క పరిమితి యందు కొంతభాగమునైనను గూడదీయగల వారెవ్వరును లేరు. ఖిలమయి పోవుచున్న యధర్వణ వేదము యొక్క వాతప్రతి నొక దానిని ఆస్ట్రియా దేశమునకు దీకికొనిపోయి దాని పుట లన్నింటికీ ఫోటో గ్రాపులను తీసియుంచిరి. ఆ ఫోటోగ్రాఫులను మైసూర్ నందున్న గ్రంధాలయాలయము నందు మనమిప్పుడు చూడగలము.

౭ జైన గ్రంథాలయములు

బౌద్ధ గ్రంధాలయములు నశించినప్పటికిని వానిస్టానమును జైనగ్రంథాలయము లాక్రమించుకొనినవి. బౌద్ధమతమువలెనే జైన మతమును భారతవర్షముందికను జీవించియే యున్నది. రాజపుత్రస్థానము, గుజరాతు, పఠాను, జపల్ మీూరు, సూరతు, కాంబే, అహమ్మదాబాదు మున్నగుపటణములయం దనేక జైన ఉపాశ్రయములున్నవి. వీనియన్నింటికిని గూడ జైనుల యొక్క మతము చరిత్రములను తెలియజేయు నట్టి ముఖ్య గ్రంధములు గలిగినా గ్రంథాగారములు కలవు. వీనికి " భారతీభాండారము” లని పేరు. జైను భండాగారములయందు ప్రాముఖ్యములగున వన్నియు దక్షిణహిఁదూస్థానమునందే గలవు. వీనిలో పతాను * అహమ్మదాబాదు, వద్వాను, సూరతు,

1 * ఇది బరోడా రాజ్యము నందు ఉన్నది. ఈ గ్రంథ భాండాగారముల నుండి