కేర్పాట్లు చేయబడుచున్నవి. పల్లెటూళ్లలో జరుగు సంగీత సభలకును నాట్యరంగములకును ఈనిధినుండి సహాయము చేయబడు కుచున్నది. ఆంధ్రుల విద్యాభివృద్ధి కొరకు వీరు పాటుపడుచున్నారు. శిశుసంరక్షణ కొరకు కూడ మిక్కిలి కృషి చేయుచున్నారు. ఈడు ముదిరిన వారి విద్యాభివృద్ధికొరకు ఈనిధి పరిపాలకులు ప్రత్యేక ప్రయత్నములు చేయుచున్నాడు. ఈ పనులన్నియు తాలూకాల యందును జిల్లాలయందును ప్రజాసేవ చేయుట కొరకై ఏర్పడియుండు ఐచ్ఛిక సంఘములు చేయు సూచనల నను సరించి జరుగుచుండును. విద్యార్థుల గ్రంథాలయములకును, పట్టణగ్రంథాలయములకును, పల్లెటూరుగ్రంథాలయములకును కూడ ఈసిధినుండి విరివిగా సహాయము చేయబడుచుండును. సంగీత నాట్య శాస్త్రములను గూర్చిన గ్రంధములను వీరు ప్రచురించెదరు. ఈ అన్ని యుద్యమములకొరకును కార్నేజీ ధర్మనిధినుండి ధర్మముగా ఖర్చు చేయబడుచున్న సొమ్ము ఇంతయని చెప్పుటకు నలవికాదు. బెల్జియము అను చిన్ని దేశమున అర్ధణా పోస్టుఖర్చుపంపినచో ఆదేశమందలి ఏ యుత్తమ గ్రంథాలయమునుండి యైనను ఎట్టి యుద్ధంధమునైనను ఏ కుగ్రామమునకైనను తెప్పించుకొనవచ్చాను. ఇంతవరకును మన దేశమునందును ఇతర దేశములయందును గ్రంథాలయము పక్షమున జరుగుచున్న కృషిని గూర్చి వివరించబడినది. ఈ యుద్యమమును గూర్చి సామాన్యవిషయములను కొన్నిటిని గమనించి వెంటనే యవలంబించవలసిన కార్యవిధానము నిరూపించవలసి యున్నది. ధర్మ గ్రంథాలయోద్యమ మన యేమి? దీని పరిమి ప్రాప్యమెద్ది? దీని వ్యాప్తి ఎంతవరకు? గ్రంథాలయమన పుస్తకములు భద్రపర్చు స్థానమనియు, గ్రంథభాండా గారియన పుస్తకముల కాపరియనియు పూర్వపు అభిప్రాయములు ఆధునిక కాలమున సంపూర్ణముగా మారినవి. పురాతన గ్రంథాలయములును దొరతనము వారిచే నిర్వహింపబడుచున్న పెద్ద గ్రంథాలయములు ఈ మర్యాద నేఇప్పటికిని యను సరించుచున్నవి. పాశ్చాత్య గ్రంథాలయము లును బరోడా సంస్థానపు గ్రంథాలయములను ఇట్టివికావు. గ్రంథాలయము నిజముగా ప్రజాసామాన్యపు విశ్వవిద్యాలయము, జాతిమత వృత్తి వయోవిద్యావిషయిక భేదము లేకుండ ప్రతివ్యక్తి యందును నిగూఢమైయున్న అనంత శక్తులను ప్రవృద్ధిపరచు పరమసాధన మీ ప్రతిష్టాపనమై వెలయుచున్నది. కావున ఈ నిర్మాణము మూలమున అభివృద్ధి బొందవలసినవారు వేరు వేరు అభిరుచులు కలవారును, వేరు వేరు అంతరముకలవారును యైయుండుటచే ఎవరికి తగిన సాధనము వారల కనుపగు నట్లవలంబించి కార్యసాఫల్యము చెంద వలసియున్నది. ఇతర దేశములందు ఈ యుద్యమము ఎట్లు కృషి చేయుచున్నదియు ఇదివరకు వివరింపబడినది. మన దేశమున కనుపగు కార్యవిధానమేదియో ఇదివర కనేక మార్లు ఉపన్యాసముల మూలమునను వార్తాపత్రికల మూలమునను విశదీకరించబడినది. ఈయుద్యమ కార్యవిధానము మన దేశమందును, ఇతర దేశములందును ఎట్లు జరుగుచున్నదియు కూడ వివరింపబడింది. ఈ పుదుక్కోట గ్రంథాలయ వార్షిక సభలో సమావేశమైన ప్రతినిధులు సంసాంనపరిస్థితులకనుకూలమగు కార్యవిధానమును ఈ సభలో నిర్ణయించ సమకట్టియున్నారు. కావున అందును గూర్చి ముందుగా చర్చించుట యుచితము కాదు. “మనసుండవలెనుగాని, మాగ౯ము దొరకక పోదు” అని ఆంగ్లసామెత యొకటి కలదు. కావున మనము ముఖ్యముగా కోరవలసినది కార్యదీక్ష, అట్టి కార్యదీక్ష సంపాదించినచో కార్యవిధానము దానంతటది వ్యక్తమగును. కావున మనయుద్యమ ప్రచారణ చేయు దీక్షాపరులను గూర్చి వివరించుట ముఖ్యావశ్యకము.
ఈ విషయమును గూర్చి చర్చించునపుడు ముఖ్యముగా మనము గమనించవలసిన విషయమేదియన, ప్రభుత్వము వారు ఈ యుద్యమమును గూర్చి ఎంత శ్రమతీసుకొని ఎంత ధనము వ్రయము చేసినను ఐచ్ఛికసంఘములే ఇందునుగూర్చి కృషి చేయవలసినవై యున్నవి. ప్రజాస్వామిక తత్వము ప్రతినర మందును రక్తనాళమందును కూడ నిండిని బిడీకృతమైయున్న పాశ్చాత్య దేశములయందు కూడ ఈ తత్వ మాచారణలో యున్నది. ప్రభుత్వము ఇట్టి యుద్యమమును చేపట్టి నడిపినయెడల అది నిర్జీవమగును. ప్రతి వ్యక్తిని ప్రతిప్రతిష్ఠాపనకును విలక్షణమగు వ్యక్తిత్వమున కనురూపమగు భేదభావముండిన గాని ఏవ్యక్తి గాని ఏప్రతిష్ఠాపనగాని సంపూర్ణ వికాసము చెంద నేరవు. ప్రభుత్వమువారు నడుపు యుద్యమములలో ఈ భేద భావమునకు తావుండును. వారమలు లోకి తెచ్చు శాసనములు వుత్తరవులు అన్ని ప్రతిష్ఠాపనలను ఐక్యభావముకు తెచ్చి అభివృద్ది సాధనములను నశింపచేయును. సనాతనమగు భారతీయ ప్రతిష్టాపనల చరిత్రము మనము పరిశీలించినచో ఈ తత్వము బోధపడగలదు. ప్రజల జీవిత మాకాలమున అనోన్యసంబంధ మంతగా లేని రెండు భాగములుగా విభజింపబడియున్నది. ఒకటి ప్రభుత్వము వారి