Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయము మూలమున ఉద్యమము వ్యాప్తినొందు చున్నది. ప్రభుత్వమువారు అచ్చట చిన్ని చిన్ని గ్రంథాలయములకు ధన సహాయము చేయుచున్నారు. మహారాష్ట్రదేశమున అచ్చటచ్చట స్థానికులు స్థాపించిన గ్రంథాలయములు పెక్కులుగలవు. వీని నన్నిటిని ఏకముఖమునకు తెచ్చి అనౌన్య సహాయకములుగా చేయుటకై పూనా నగరమున కేంద్ర సంఘము స్థాపింపబడి చక్కగా ఆప్రాంతమున ఉద్యమము అభివృద్ధి నొందుచున్నది. మైసూరు ఇందూరు సంస్థానాధీశులు కూడ తమ రాష్ట్రములయందు ఉద్యమమును చేపట్టి శ్రద్ధతో అభివృద్ధికి తెచ్చుచున్నారు. ఆంధ్ర రాష్ట్రమున 1880 సంవత్సరము ఆప్రాంతమున ఈ యుద్యమమునకు విత్తునాటబడి తదాది ఈ యుద్యమము కొలదిగమో గొప్పగనో కృషి సేయుచు ఇప్పటికి కొంతవరకు దృపికరమగు యభివృద్ధిని గాంచినదని చెప్పవచ్చును. అప్పుడప్పుడు జరిగెడి మండల తాలూకా రాష్ట్రీయసభల మూలమున ఉద్యమమన కృషి చేయువారు ఏకత్రి సమావేశమై ఉద్యమాభివృద్ధి దూర్గముల నిశ్వేషించి కార్యాచరణకు తెచ్చుచున్నారు. ఇతర దేశములలో ఈ యుద్యమును గూర్చి జరుగుచున్న కృషినిగూర్చి ముచ్చటించవలసినప్పుడు ఇందగ్రస్థానము వహించిన అమెరికా ఖండమున జరుగు పనినిగూర్చి మందు ప్రశంసించవలసియున్నది. ఈ యుద్యమమున కృషిచేయు వారిచ్చటచ్చట తఱుచు సభలను జరిపి ఉద్యమ నిర్వహణవిధానమును నిర్ణయించి కార్యాచరణకు తెచ్చిచుందురు. ఈ ఉద్యమ నిర్వహణమందు పాండిత్యము వహించిన విద్వాంసులు ఇందును గూర్చి సర్వతోమఖమగు వ్యాసములను వార్తాపత్రికలయందు ప్రచురింతురు, విద్యార్థుల విలాసము కొరకు సెలవుదినములలో ప్రయాణములకు వెళ్లినపుడు వారలతో గ్రంథాలయములనుండి విద్యాధికులు పంపబడుదురు. వీరు విద్యార్థులు విశ్రాంతిని పొందు కాలమున వారల వద్దకు పోయి విద్యార్థులు గ్రహించెడి విషయములను గూర్చి వారలకు ఉపన్యసించి ఉపన్యాసాంతమన తానుపన్యసించిన విషయమును గూర్చి విపులముగా వివరింపబడిన గ్రంధనామములను పేర్కొని అగ్రంథములను తమకు పంపిన గ్రంథాలయమున దొరకునని చెప్పుదురు. గ్రంథాలయము లకు విరివిగా ప్రజల నాకర్షించుటకు ఎక్కువ సభ్యులు గల 'క్లబ్బు' లు ఉపయోగించుకొనుటకు గ్రంథాలయమందలి ప్రత్యేకపు గదులు ఆ క్లబ్బుల యధీనముచేసి అచ్చట ఆ సభ్యులను సమావేశపర్చుచుందురు. కర్మాగారములయందు పనిచేయు పాటకపు జనుల యుపయోగముకొరకు వారు పనిచేయుచోట్ల పెద్ద బల్లలమీద వారి కుపయోగించు గ్రంథనామములును అవి దొరకు గ్రంథాలయముల పేరును లిఖించి ప్రచురింపబడును. పల్లెటూరు ప్రజల యుపయోగము కొరకు మోటారుబండిలో గ్రంథముల పెట్టెలనుంచి దేశమంతటను పంపబడి ప్రజలకు పంచి పెట్టి వారలా గ్రందములు చదివినపిదప తిరిగి వానిని స్వీకరించి తెచ్చుట కేర్పాట్లు చేయ బడును. విద్యార్థులకును ఉపాధ్యాయులకును యుపకరించు గ్రంధముల నొకపెట్టెలో పెట్టి గ్రంథాలయమలనుండి యుద్యోగులు పాఠశాలలకు తీసుకొనిపోయి నచ్చట ముఖ్యమగు ఉపాధ్యాయుల పరము చేయుదురు. అచ్చటి విద్యార్థులును ఉపాధ్యాయులును ఆగ్రంథముల నుండి పొందతగిన లాభమును పొందిన పిడప తిరిగి వానిని తెచ్చెదరు. పాటకిపు జనులు నివసించు కుటీరములకు గ్రంథాలయోద్యోగులు గ్రంథములను పెట్టెలలో పెట్టి తీసుకొని వెళ్ళి అచ్చట చదువగలవారలకు గ్రంథములను పంచి పెట్టెదరు. నిరక్షరపక్షుల యుపయోగముకొరకు వారు గ్రంధములను అప్పుడప్పుడు చదువుచుకూడ యుందురు.

గ్రంథాలయముల కృషినిగూర్చి తెలిసిన వారిలో అమెరికా ఖండవాసియు మిక్కిలి ధనసంపన్నుడు నగు కార్నేజీ మహాశయునిగూర్చి తెలియనివారుండరు. ఈ శ్రీమంతుడు తన యపారమగు ధనమును తనతోడి మనుజుల జ్ఞానాభి వృద్ధికొరకై యసంఖ్యాకములగు గ్రంథాలయములను స్థాపించి కీర్తివహించెను. ఈమహనీయుడు ఆంగ్లేయ ద్వీపములయందు ఈమహయుద్యమమును వ్యాపి నొందించుటకు ఎక్కుప ద్రవ్యమును నిధిగా నేర్పర్చి దాని పరిపాలనకొరకు ధర్మకర్తల సంఘము నిర్మాణము చేసి వారల మూలమున గ్రంథాలయ ప్రతిష్టాపనాస్థాపనకు పూనకమున్ను ఆ దేశమందీ యుద్యమము అంతవ్యాప్తికి రాలేదనియే చెప్పవలసియున్నది. ఇప్పుడా దేశములయందు ఈ ధర్మనిధిమూలమున జరుగుచున్న కృషియు తన్మూలమున ప్రజలు పొందుచున్న అమూల్యమగు జ్ఞానాభివృద్ధియు వర్ణనాతీతము. ముఖ్య పట్టణములయందలి గ్రంథాలయ భవనముల నిర్మాణనుకొరకు అమితమగు ద్రవ్యము వ్యయ పెట్టబడుతున్నది. అప్రతిష్ఠాపనల నిర్వహించుటకుగూడ ఎక్కువ ద్రవ్యము ఈనిధినుంచి ధర్మము చేయబడుచున్నది. కేంద్రగ్రంథాలయములను స్థాపించి తన్మూలమన పల్లెటూళ్లకు విరివిగా గ్రంథములను పంపుట