Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుల యధీనమున మిక్కిలి ప్రసిద్ధి గాంచి యుండెను. ఫిరోజిషానగర కోట యను దేవాలయమును ముట్టడించినపుడు ఆ దేవళమున భద్రపర్చబడి యున్న సంస్కృతగ్రంథములను ఆమహారాజు తన రాజధానికి తెచ్చి వానినన్నిటిని రాజభాషలోనికి తర్జుమా చేయించి ప్రచురించెను. హుమాయూను, అక్బరు, జహంగీరును విద్యాభివృద్ధి చేయుటయందును విద్వాంసుల పోషణయందును మిక్కిలి శ్రద్ధాళువులై యుండిరి.

మహమ్మదీయ మహాయుగము. హిందూ దేశమున స్థాపితమై మహమ్మదీయ ప్రభువుల పరిపాలనలో చేరిన చిన్న రాజ్యములు కూడ విద్యాపోషణయందు వన్నెకెక్కినవి.

గుప్త వంశము ఆవసానము పొందిన పిదప స్థాపితమైన చిన్న హిందూరాజ్యము లన్నిటియందును గ్రంథాలయములు విరివిగా సాపింపబడియుండెను. ధారానగరమని రాజ్యము చేసిన భోజునిచే స్థాపితమైన గ్రంథాలయము ఇందుమిక్కిలి ప్రాముఖ్యత చెందినది. ధారానగరమును చాళుక్యులు జయించినపిదప అచ్చటి గ్రంథాలయమందలి గ్రంథములను చాళుక్యులు తెచ్చి తమ రాజధానీ నగరమున స్థాపితమైయున్న గ్రంథాలయమున భద్రపర్చిరి. ఈ చాళుక్య వంశరాజులలో విశాల దేవుడను వాడు మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాడు. ఈయన కాలములో సంగ్రహింపబడిన (మహాభారత) గ్రంధ సంచిక నుండి తయారు చేయబడిన (మహాభారత) శిఖితగ్రంథము ఇప్పటికిని జర్మనీ దేశమందలి "బాను” అను నగరమున విశ్వవిద్యాలయమున యున్నది. ఇప్పటికిని ఆల్వారు, బికనీరు, జమ్మూ, మైసూరు, నేపాలు మొదలగు సంస్థానముల మహారాజులు ఉన్నతమగు గ్రంథాలయములను పోషించుచు ఆయాగ్రంథాలయముల యందు భద్రపరుపబడియున్న గ్రంథములకు విభజన పట్టికలను ప్రచురించియున్నారు. తంజావూరు రాజమందిరమున నాటికి నేటికి కూడ చూచు వారందరికి ఆచ్చెరువును గొల్పుచున్నది. సరస్వతీవిలాసమను ఉద్గ్రంథాలయము. ఇందలి గ్రంథములకు విభజన పట్టికను తయారు చేయుటకు దొరతనము వారిచే నియమింపబడిన బర్నీలుగారు దానినిగూర్చి ఇట్లు వాకుచ్చియున్నారు:౼ "ఈ గ్రంథాలయము యందున్న లిఖిత గ్రంధముల సంఖ్యను బట్టి చూచిన ప్రపంచమందలి గ్రంథాలయము లన్నిటిలో ఇదియె అగ్రగణ్యమని చెప్పక తప్పదు”. ఈగ్రంథాలయము దక్షిణ ప్రాంతములను క్రీస్తుశకము 16, 17 శతాబ్దములలో పరిపాలించిన తెలుగు నాయక వంశపురాజులు ప్రథనుములో స్థాపించిరి. ఈవిషయము ప్రతియాంధ్రునకు గౌరవావహము గదా! పిమ్మట 18వ శతాబ్దమున మహారాష్ట్రులు దీనిని మిక్కిలి యభివృద్ధికి తెచ్చిరి. ఇప్పటికిని 11 భాషలలో లిఖింబడిన 18000 లిఖిత గ్రంధములు ఇందున్నవి. ఆధునిక కాలమున రాజధాని నగరముల స్థాపింపబడి ప్రవృద్ధినొందుచున్న క్యానికురా గ్రంథాలయమునంటి టి ప్రతిష్ఠాపనలను మనము చూచుచున్నాము. జిల్లా ముఖ్యపట్టణముల యందును ఇతర నగరములయందును ఇప్పటికాలమున నూతనముగా స్తాపింపబడి సారస్వతసంఘములకు గాని వ్యాయామసంఘములకు గాని అనుబంధములగు గ్రంథాలయము లెన్నియో మన దేశమున గలవు. పూనా నగరమందు స్థాపింపబడి ప్రవృద్ధిగాంచుచున్న “హిందూదేశ సేవకసంఘ గ్రంథాలయమును” ఆధునిక కాలమున అత్యున్నత నాగరికతను పొందిన దేశములకు కూడా అలంకారములుగా నుండుమోపును.

నవ్యభారతవర్షయుగమున అభివృద్ధిమార్గను సరణముగ గ్రంధాలయములను స్థాపించి అభివృద్ధికి తెచ్చు చున్నది. బరోడా సంస్థానాధీశులగు శాయాజీ గాయిక్వారు మహాప్రభువు. ఆ శ్రీమంతులు పాశ్చాత్య దేశములందు విరివిగా సంచారము చేయుచున్నపుడు ఈ యుద్యమమూలమున ఆ దేశపుబ్రజలు పొందుచున్న యమూల్యజ్ఞానసంపత్తిని యరసి తమరాష్ట్రమున గూడ ఆదేశపు విధానల ననుసరించి ఈ యుద్యమమును స్థాపించి భరతవర్షమునకంతకును మార్గదర్శకులైరి. ఇందుకోనికై వారు అమెరికా నుండి 1911 సంవత్సరమున బోర్డెను ఆను గ్రంథాలయ శాస్త్ర పండితులను రావించి వారి యాజమాన్యము క్రింద తమ రాజధానీనగరమున కేంద్ర గ్రంథాలయ ప్రతిష్టాపనను శ్రీవారు నెలకొల్పిరి. ఈ ప్రతిష్ఠాపన కంగములుగ జిల్లా గ్రంథాలయములు, పట్టణగ్రంథాలయములు, పల్లెటూరు గ్రంథాలయముంలు, సంచార గ్రంథాలయములు యంత్ర సహాయమున సేయు ప్రదర్శనమూలమున జ్ఞానాభివృద్ధి నొందించు ప్రతిష్ఠాపనలు మున్నగు శాఖల నెన్నియో స్థాపించి తన్మూలమున వారి రాష్ట్రమందంతటను జ్ఞానము, గాయిక్వారుగారు వెదజల్లిరి. పుదుక్కోట రాష్ట్రమున గ్రంథాలయోద్యమము చేయుచున్నపని ఆ సంస్థానపు ప్రజలకు కరతలామలకమేగద. తిరువాన్కూరు సంస్థానమున, అసంస్తపు రాజధానీనగరమున స్థాపింపబడియున్న