దానికి వ్యాప్తికల్గనేరదు. కాబట్టి ఇట్టి సభల యొక్క ముఖ్యోద్దేశము సర్వతోముఖమగు ధర్మగ్రంథాలయము యొక్క పరమప్రాప్యములేవో ప్రజలకు బోధించి వానిని ఆచరణలోనికి తెచ్చువిధానములను నిరూపణచేయుటయేయని నేను మనవి చేయుచున్నాను. అట్లు చేసిన గాని గ్రంథాలయములేని పట్టణముగాని పల్లెగాని యుండకూడదనియు గ్రంథాలయోపయోగమును పొందని పురుషుడు గాని, స్త్రీ గాని, బిడ్డగాని యుండకూడదనియు యుద్యమముయొక్క పరమప్రాప్యము కార్యాచరణకు రాదు.
ప్రధమమున మన స్వదేశమందును పరదేశములయందును పూర్వమున్నట్టియు ప్రస్తుతము పనిచేయుచున్నట్టియు ప్రస్తుతము పనిచేయుచున్నట్టియు గ్రంథాలయములను గూర్చి సంగ్రహముగా పరిశీలింతుము. సనాతమగు ఈ భరతవర్షమున గ్రంథలయములు ప్రాచీన కాలములనుండియు నెలకొల్పబడి వర్దిల్లు చుండెను. ఆదికాలమున జ్ఞానము గ్రంథస్థముగాక వాగ్రూపమున ఒకరినుండి మరియొకరు నేర్చుకొనుచుండిరి. ఆకాలపు బ్రహ్హర్షులును బ్రాహ్మర్షులును రాజర్షులును ఒక్కొక్కరు ఒక్కొక్క సంచార గ్రంథాలయముగా నుండిరి. వారు సంచరించిన వాతావరణమంతటను తమ తపోధనముచే సముపార్దన చేసిన తేజోపుంజమూలమున కాంతిని వేదజల్లుచు అజ్ఞానతిమిరమును పారదోలుచుండిరి. లిపిఏర్పడిసపిదప అనేకరకములగు వస్తువులతో గ్రంథములేర్పడు చుండెను. ఈగ్రంథములు ఆకాలమున హస్తలిఖితములుగా నుండెను. ఈలిఖితగ్రంథములు మిక్కిలి శ్రద్ధతోను ప్రయాసతోను తయారుకాబడుచుండెను. ప్రథమమున ఇట్టి లిఖితగ్రంధములు బౌద్ధవిహారములయందును దేవాలయములయందును ప్రత్యేకముగా భద్రపరుపబడుచుండెను. బౌద్ధయుగములో బౌద్ధవిహారము లన్నిటియందును గ్రంధములు భద్రపరుపబడుచుండెననియే చెప్పవచ్చును. గ్రంథములు లిఖించుట, వానిని భద్రపరుచుటయు బౌద్ధసన్యాసులు విధ్యుక్తధర్మములలో అగ్రగణ్యము, ఫాహియానుయను చైనాదేశపు బాటసారి భారతదేశ సంచారమును గూర్చివ్రాసిన వారి గ్రంథములో లిఖిత గ్రంథములను గూర్చియు వానిని భద్రపరుచు విహారములను గూర్చియు పేర్కొని యున్నాడు. ఆకాలమున లిఖితగ్రంథములు వ్రాయుటకును, భద్ర పరచుటకును వారెంత కష్టపడి ప్రకృతి శక్తుల సాధనముల మూలమున శీఘకాలమున ఉద్గ్రంథములను ముద్రించగల్గు సావకాశముగల ఈ కాలపువారు గ్రహించుట కొంచెముకష్టమైనపని.
మనకు చరిత్ర సిద్ధముగ లభించు గ్రంథలయమును గూర్చిన యుదంతములలో మొదటిది నలందా విశ్వవిద్యాలయమును గూర్చియు గ్రంథాలయమును గూర్చియు. ఇది చైనా దేశపు యాత్రాపరుల గ్రంథములయందు లభించుచున్నది. నలందా విశ్వవిద్యాలయమున గ్రంథములు తొమ్మిది అంతస్తులుగల “రత్నోదధి” యని పేరుగన్న మహాసౌధమున భద్రపరచబడియుండెను. ఈ గ్రంథాలయము క్రీస్తుశకము 8వ శతాబ్దమున నాశము పొందింపఁబడింది. పిమ్మట బంగాళాదేశ ప్రాంతమును పరిపాలన చేసిన పాలవంశపు రాజులు విక్రమశల, ఓదంతపురియను గ్రంథాలయములను స్థాపించి అభివృద్ధికి తెచ్చిరి. ఇవికూడ కాలచోదితములే బాక్త్యారుకిని లీజుయను యవనునిచే క్రీస్తుశకము 13వ శతాబ్దమున నాళము పొందించబడినది. ఇప్పుడు ఈ గ్రంథాలయముల యందుండు కొందరు బౌద్ధ సన్యాసులు అమూల్యమగు గ్రంథములు కొన్నిటిని సంగ్రహించి నేపాళ దేశమునకు పారిపోయి అచ్చట తలదాచుకున్నట్లు చరిత్ర చెప్పుచున్నది. ఈ బౌద్ధగ్రంథాలయములతోపాటు సనాతనార్యమతగ్రంథములను భద్రపరచు గ్రంథాలయములు హిందూ దేవాలయముల యందును, రాజమందిరములయందును సుస్థాపితములై ప్రవృద్ధినొందుచుండెను. గ్రంథాలయములకు గ్రంథదానము చేయుట మిక్కిలి పుణ్యప్రదమని పురాణములు ఘోషించు చున్నవి. బౌద్ధ, జైన మత గ్రంధములును యట్లే చాటు చున్నవి.
బౌద్ధగ్రంథాలయములు నశించినట్లు మనదేశీయుల అదృష్టవశమున జైనగ్రంథాలయములు నష్టమైపోగ ఇప్పటికిని మంచిస్థితిలో యున్నవి. అందు బొంబాయి రాజధానిలో చేరిన సూరట, క్యాంబే, అహమ్మదుబాదు నగరములందున్న జైనగ్రంథాలయములు మిక్కిలి ప్రఖ్యాతిని గాంచినవి. ఇవి యన్నియు మధ్యయుగమున ప్రారంభమైనవి. నీనియన్నిటియందును కాగితపు అట్టలతో చేయబడిన పెట్టెలలో లిఖిత గ్రంథములు భద్రపరుపబడుచుండెను. జైన సన్యాసులు ఈ గ్రంధములు వ్రాయుటకును భద్ర పరుచుటకును మిక్కిలి శ్రద్ద తీసుకొను చుండిరి. పాఠొను వంశీయులు, మొగలు వంశీయులునగు మహమ్మదీయ చక్రవర్తులు భరతవర్షమును పాలించిన కాలమున రాజమందిర ములయందు అమూల్యలగు గ్రంథసమూహములతో నిండిన ఉన్నతగ్రంథాలయములు నెలకొల్పబడి రాజసన్మానమునొందిన విద్వాం