Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ పుదుక్కోట గ్రంథాలయ మహాసభ

(అధ్యక్షులగు సూరి మేకటనరసింహశాస్త్రిగారి ఉపన్యాసము)

గ్రంథాలయ సంఘ వార్షిక సభయందు గంథాలయ పరిపాలనకు సంబంధించిన సాంకేతిక విషయములను గూర్చి చర్చించుట సహజము. ఆయితే మనమింకను ఉద్యమమున నలుదెసలను ప్రచారణ చేయవలసియున్నది. గ్రంథాలయములవలన కలిగెడి అనేక లాభములు ప్రజాసామాన్యమునకు స్పష్టముగా బోధపడలేదు. దేశము నిరంతర కాంక్షతో వాంఛించుచున్న జాతీయవిద్యావిధానమున గ్రంథాలయముల యుచితస్థానము ఇంకను నిరూపింపవలసియున్నది. గ్రంథాలయములు కేవల గ్రంధములను భద్రపర్చు స్థానములు మాత్రమేగాక జాతిమత వృత్తి వయోవిచక్షణ లేకుండ జనసామాన్యమునందలి అన్ని వ్యక్తులకును సౌభాగ్యము సమకూర్చునదిగా నుండనగురిని ప్రజ లింకను పూర్ణముగా గ్రహించిలేదు. అన్ని తరగతుల ప్రజలు సమానస్కంథులుగా ఏకత్ర సమావేశమై ఓర్పు, సహజము, మొదలగు పౌరవిదులను అలవడచేసుకొనటకు గ్రంథాలయము తగిన కేంద్రస్థానమను విషయమునకు తెగి ప్రాముఖ్యత ఇంకను జనమాన్య మిచ్చుటలేదు. మన దేశము ప్రాచీనకాలము నుండియు నాగరికతఁ జెందినదని మన మెంతే విఱ్ఱవీగు వారమై నను ఈడుముదిరినవారి విద్యాభివృద్ధికొరకు వర్తమానకాలమందు మన మేమియు కృషి చేయుచుండుట లేదు. గ్రంథాలయములు సంస్థాపితములైనచో ఈపనిని మిక్కిలి జయప్రదముగా జరుపగలనను విషయము నిప్పుడిప్పుడే మనవిద్యాధికులు గ్రహించుచున్నారు. విద్యాదానమొనర్చు ప్రతిష్టాపనలయం దమ్యోన్య సహకార భావమును నెలకొల్పుట ముఖ్యావసరమనియు, గ్రంథాలయముల మూలమున అట్టిపని సమకురుననియు ఇంకను మన దేశస్థులు తెలుసుకొనవలసియున్నది. ఏ గ్రామమందున్న విద్యార్థియెనను నగరములయందు నెలకొల్పబడియున్న ఉన్నత గ్రంథాలయలములయుండెడి ఉద్గ్రంధములను తగిన బందోబస్తులతో తెప్పించి చదువుకొనుటకర్హడను రహస్యము మనదేశమున బహుకొలదిమందికి గాని తెలియదు. ఇంకను ధర్మగ్రంథాలయ మతము మనదేశమున వ్యాప్తి చెందనేలేదని స్పష్టముగా చెప్పవచ్చును. ఈయంశము అన్నియు ప్రజాసామాన్యము స్పష్టముగా తెలుసుకొని అనుభవములోనికి తెచ్చిన గాని "గ్రంథాలయము సమాన్యప్రజల విశ్వవిద్యాలయము" అనులోకోక్తి కేవలగ్రంథస్థముగానే యుండగలదు గాని ప్రజల నిత్యజీవనమందు