చెప్పవచ్చును. ఇవి సంఘ సంబంధములగుట చేత వీని యోగ క్షేమములను, స్థితిగతులను తెలిసికొను భారము కొంతవరకు జిల్లా సంఘము పైనను మరికొంతవరకు కేంద్ర సంఘము పైనను కలదు. వీనినుండి ప్రతిమూడుమాసములకును త్రైమాసిక నివేదికయను దానిని కేంద్ర సంఘము వారు తెప్పించుకొనుచున్నారు. ఇందువలన వీనియాదాయ వ్యయములును వీని సభలు మున్నగువాని వివరములును, కేంద్ర సంఘమునకు దెలియు నవకాశము కలఁగుచున్నది. జిల్లా సంఘము లింకను బాగుగా గుదుర లేదు. ఆ విషయమున త్వరలో ప్రయత్నములు జరుగనున్నవి. అట్టి జిల్లా సంఘములు క్రమముగా నేర్పడి సానిక సంఘములు తమ కర్తవ్యములను ఎరింగినచో ఒక జిల్లాలోనున్న అన్ని సంఘములకు మొదటను రాజ్యమునందలి సంఘములకు తరువాతను సమీప సంబంధ మేర్పడును. అనగా సంఘములవలన నడుపబడుచున్న గ్రంథాలయముల యోగక్షేమములు బాగుగా నారయబడును. ఈ పరస్పర సంబంధము వలన కార్యోత్సాహము హెచ్చవచ్చును. అన్యోన్యసహాయము నియమబద్ధత్వము, ఉత్తరవాదిత్వ భావము పొడ చూపవచ్చును. ఉద్దేశముల యొక్కయు కార్యవిధానము యొక్కయు కేంద్రీకరణమునకు ముంచిమార్గ మేర్పడును. సంఘములక్రింద నుండు వివిధ విద్యాసంస్థలకును అభిప్రాయసామ్యతి, ఆదర్శసామ్యత కలుగును. ఇది అత్యవసరమగు కార్యమని చెప్పవలసినపనియే లేదు.
విడివిడిగా పనిచేయు గ్రంథాలయములలో హైద్రాబాదునందలి శ్రీ కృష్ణ దేవరాయల ఆంధ్రభాషా నిలయము, సికింద్రాబాదునందలి ఆంధ్ర సంవర్ధనీ వఁటి సమస్తస్థలకు అంతగా బాధ లేదు. హనుమకొండ, వరఁగల్లునందలి గ్రంథాలయములవంటి సంస్థలు వర్ధిల్లగలవు గాని సాధారణ గ్రామములందలి గ్రంధాలయముల అభివృద్ధిమాత్రము కొంత చిక్కులకు లోబడి యుండునని మాయభిప్రాయము. విడి గ్రంథాలయములను గూర్చి ఇతర స్థలములవారికి సమాచారములు తెలియుటయే కష్టము. అట్టి గ్రంథాలయమున్నదో లేదో స్పష్టపడ జలదు. యోగక్షేమములు తెలిసికొను పరస్థానికులు లేనందున కార్యనిర్వాహకులకు నిరుత్సాహము కలుగుట అసాధారణ కార్యముకాదు. కొన్నిసార్లు గ్రంధాలయ నిర్వాహకులనదగు వారొక వ్యక్తియే యై యుండవచ్చును. అట్టి వ్యక్తి స్థలాంతమునకుబోవుటయో, నిరుత్సాహపడి వదలుకొనుటయో సంభవించినచో కార్యము మూలబడ వచ్చును. సభాసదులలో కొన్నిమారులు వైరములు కలిగి సంస్థ నిద్రపోవచ్చును. ఏ కారణముచేతినేమి గ్రంధాలయ కార్యములు సాగకపోయియు ఆసమాచారము మరియొక గ్రామమువారికి తెలియుటకే అవకాశము లేకుండ పోవచ్చును. ఇవి కేవల మూహాజనితములగు నిద్దాంతములు కావు. గడచిన 18 సంవత్సరములలో నాకు విద్యా సంస్థలను గూర్చి కలిగినయుభవము ఇట్టివి ఎన్నియోయంశములను బోధించినది. మంచి యవకాశములు
పై అంశములను ఆలోచించినచో మన గ్రంథాలయములన్నియు ఒక అంగనిర్మాణమునకు లోబడి యుండినచో వీనిస్థిరత్వమునకు మంచి అవకాశములు ఏర్పడ గలవు. కార్య విధానమందు సమత్వము పొడచూప గలదు. కనుక విడివిడిగా నున్న గ్రంథాలయముల నడపు సఁఘములవారు ఈవిషయమున నాలోచించి కర్తవ్యమురు నిర్ణయించుట ఉత్తమము. కార్యము అంత కఠినమైనది కాదు. కావలసిన మార్పు నామమాత్రమే కాని మరేమియు లేదు. ఉదాహరణార్హము గోవిందాపురము నాందోక గ్రంథాలయము "వెంకటేశ్వర భాషానిలయ” మను పేరు గలదియున్నదను కొందరు; అది విడిగా స్థాపితమైయున్నదని యూహిఁతము; దానినడుపుచున్న వారు కొందరా గ్రామమున నున్నారుకదా. వారు తమ్ముదాము గ్రంథాలయ సంఘమనుకొనుటకు మారుగా "నిజాంరాష్టాధ్ర జనసంఘము, గోవిందాపురం" అని పేర్కొనిరేని వారు కేంద్ర సంఘము యొక్కయు జిల్లా సంఘము యోక్కయు అంగనిర్మాణమునకు లోబడెదరు. తమ గ్రంథాలయము యొక్క పేరును మార్చుకొనవలసిన పని లేదు; ఎప్పటి చందాలనే ప్రోవుచేసికొనవచ్చును; ఎప్పటి కార్యముల నేజరుపవచ్చును; క్రొత్తకర్తవ్యము మేదియు లేదు. క్రొత్త వారి యాజమాన్యము కలుగదు. కేంద్ర సంఘము జిల్లా సంఘ ములతో అట్టి సంఘమునకు సంబంధ మేర్పడును. మూడుమాసములకొకసారి దానిస్థితిగతుల గెలుపు వివరణ పత్రికను కేంద్ర సంఘము తెప్పించుకొనగలదు. జిల్లా సంఘము మేర్పడిన వెంటనే వారు దీని క్షేమము నారయవలసిన వారగుదురు. అట్టి సంస్థకు జిల్లా సంఘమునను, దానిద్వారా కేంద్ర సంఘమునను ప్రాతివిధ్యము లభించును. బిక్కుబిక్కుమనుచున్న విడిసంస్థకాక, అది స్వాతంత్య్రంత వంతమున సబలమును నగు సంఘము యొక్క దశకువచ్చి పది సంఘమాలతో సమత్వమును సంపాదించి గొప్ప యుపయోగకారియగు యంత్రము యొక్క ముఖ్య చక్రములలో నొకటియైన చిరస్థాయిగ వర్ధిల్లగలదు.