ఫలితమును బడని సంఘమును విజ్ఞానసస్యాఢ్యము చేయుటకును వలయు సౌకర్యముల గలిగింపవలయును. పుస్తకాగారములు కాలువలవంటివి. చెరువు లేనిదే కాలువలు వృధలు. చెఱువులుండియు వానలు కురియకున్న క్షామము నివారణకాదు. మనుష్య ప్రయత్నముచేత సాపింపబడియుండు నూతన పరిశోధకశాలలు చెఱువులు వంటివి; మహనీయుల యొక్క ప్రతిభావి శేషమే వర్షము. ఏ ఏ రాజ్యమున మూఢభక్తి ప్రబలి, మతములు పేర, మనుష్యుల యోజనాశక్తికిని, నీతికిని, వర్తనముసకును తగుమైన స్వాతంత్యము నియ్యకుందురో ఆరాజ్యము కుళ్ళి కంపెత్తిపోవుట. అట్లు దుగ్గఁధముగా నుండినయెడల ఏపరదేశీయులను మునిసిపాలిటీవారొ వచ్చి దానినూడ్చి పాఱగ్రుక్కుదురు.
పాశ్చాత్య దేశములలో నూతన పరిశోధనలు, తత్త్వములు, సిద్ధాంతములు, సృష్టులు వెలువడనిదిన మొక్కటియు లేదు. మనుష్య- ప్రకృతి యను మహావృక్షమక్కడ క్షణక్షణమును క్రొత్త చిగుళ్లను నూతన వికాసములను బయలుపుచ్చుచుండును. క్రొత్తకొత్త గ్రంధములు ప్రతిదినమును ప్రచురమునకు వచ్చుచుండును. మన యందు ఆధునికవిద్యలు మిక్కిలియు బీడుపడి శోషించి యున్నవి. ఏ గ్రంథాలయమును లెక్కించి చూచినను సరే, ప్రాచీనమునకు చేసిన గ్రంథములు వెయ్యియున్న, ఆధునికములు ఏబదియైన నుండుట యరిది. శ్రుతిష్మృతులు, వానిమీద వ్యాఖ్యానములు, ఆవ్యాఖ్యానముల మీద వ్యాఖ్యానములు, వ్యాకరణములు, కావ్యములు, ప్రబంధములు, సాహిత్యదర్పణములు, సంగీతకళానిధులు, శతకములు, ఇచ్చివేగని సంఘ, మానస, ఆర్థిక, రాజ్యతంత్ర, ప్రకృత్యాది శాస్త్రములకు చేరిన గ్రంథములు అపురూపములు. సనాతనములు నీరితి నింతఘనముగ మెడబట్టుకొని యేదేశమును వర్తమానమను అల్లకల్లోలమైన సముద్రమును ఈ భద్ర భవిష్యత్తు దీవిని చేర జాలదు.
లైబ్రరీల కట్లు సాహ్యాయము చేసిన కార్నెగీ రాక్ ఫెల్లరు మొదలగువారును, ప్రకృత్యాది శాస్త్రములను, ఇంజనీరింగు మొదలగు కళలను పరిశోధించి నూతనాంశముల కనిపట్టుటకు సాధకములైన గొప్పశాలలను స్థాపించి అచ్చట పని చేయువారలకు గొప్ప వేతనములను కలిగించి యున్నారు. సృష్టికి వ్యాప్తికియుండు సంబంధమును గ్రహించినవారగుట కాబోలు ఈ నిలయమునకు స్థాపకులైన శ్రీ మునగాల జమీందార్లును, విజ్ఞానచంద్రికామండలి ఇత్యాది గ్రంథకర్తృ సమాజములకును స్థాపకులును పోషకులై యున్నారు. మన దేశమునందు ఆధునిక శాస్త్రములను కళలను వివరించు గ్రంథములు విశేషించి ప్రచురింపబడక యుండినయెడల, ప్రాత వాసన పర్విన గ్రంథాలయములచే మేలా కీడా యెక్కువ గలుగుననుట చర్చనియమగును. మంచినీళ్ళు లేనిచో కొళాయీలును లేకుండిననే మేలు!
గ్రంథాలయములు గ్రంథకర్తృత్వమునకు ప్రబల సాహాయ్యకములు. ప్రతి యొక్క ఆలయమును ఒక్కొక్క ప్రతిని గొనినయెడల పుస్తకకర్తల యొక్క దౌర్భాగ్యము తొలగిపోవును. అట్లు చేయక ప్రతియాలయమును కర్తలను ఉచితముగా గ్రంధముల నిమ్మని యాచించుటకు మొదలిడిన, అభిక్షాధికారుల కష్టము దేవునికే యెఱుక. ఒక్కడు నూరుమందికి దక్షిణ పెట్టుటకన్న, నూరుమంది ఒక్కనినుండి వెలయిచ్చి కొనుట సుగమ మని మనవారెఱిగి వర్తింతురు గాక!
నైజాము రాష్ట్రమందలి ఆంధ్ర గ్రంథాలయములు
(నీలగిరి పత్రికయందు శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులు గారు ఇటుల వ్రాయుచున్నారు.)
మనదేశమందిప్పుడు పనిచేయుచున్న గ్రంథాలయములు రెండు విధములుగా నున్నవి: (1) ఆంధ్రజన సంఘమువలన నడుపబడు చున్నవి. (2) విడిగా గ్రంథాలయములుగా నడుపబడుచున్నవి. మొదటి పద్దతిని గడచిన రెండు సంవత్సరముల కాలములో హైదరాబాదు నందలి ఆంధ్రజన సంఘ సభాసదుల యత్నమువలను గాని కేంద్ర సంఘమువారి యత్నమువలను గాని స్థాపితము లైనవి. ఇక రెండవతరగతి వానిలో గొన్నిమాత్రము చాలకాలము క్రిందటనే ఏర్పడినవి. ఆ కాలమున ఆంధ్రజన సంఘములను వింకను ఆరంభము కాలేదు. మిగిలినవి ఇటీవల స్థాపితములైనవే కాని అవి గ్రంథాలయములు గానే యారంభమైనవి, ఆయా స్థలములలో నుండు ఉత్సాహవంతులగు యౌవనులకృషివలన ఆస్తిత్వమునకు వచ్చినవి. ఇతరస్థలమునందలి గ్రంథాలయములతో గాని, సంఘములతో గాని వానికి ఎట్టి సంబంధమును లేదు.
ఆంధ్రజన సంఘములవలన నడుపబడుచున్న (మొదటి విధమునకు చెందిన) గ్రంథాలయములస్థితినిగూర్చి విచారింతుము. వీని సంఖ్య ఇప్పుడు షుమారు ౪౦ అని