Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయ ప్రయోజనము

(హైదరాబాదునందున్న శ్రీ కృష్ణ దేవరాయలఆంధ్ర భాషానిలయమందిర ప్రవేశమహెూత్సవమునాఁటి అధ్యక్షకుఁడైన

కట్టమంచి రామలింగారెడ్డి యొక్క వచసమునుండి)

ఆంధ్రులది పరాశ్రయమును ఆశించు బ్రతుకు కాదు; స్వసహాయము చేత ముద్ధరింపదగు ప్రారంభములు మనయందెక్కువ. ఇందులకు మనవారు సంఘసంస్కార విషయమందును గ్రంథాలయ వ్యాపన మందును గడించి యుండెడు సిద్దలే సాక్షి. ఈ గ్రంథాలయోద్యమము జనబాహుళ్యము చేతి అంగీకరింపబడక ముందే శ్రీ మునగాల జమీఁదారు గారు ఈనిలయమును నిర్మించినవారిగుట ఈ యుద్యమము నకు వారు మార్గదర్శకులమట అతిశయోక్తి కానేగదు. ప్రకృతము గ్రంథాలయములు విశేషముగ స్థాపింపబడుచున్నవి; అమితముగ నేనాటికి స్థాపింప బడనేరవు. అవి యెన్నియున్నను జాలవు. అంధకారమును విరియింపజేయు నీ నక్షత్రమండలిలో మీ నగరమందు ద్భవించినయది ప్రాథమికము. భాగ్యనగరమన మీ యూరి పేరు దీనిచే సార్థకమైనది.

మీ యొక్క ఆంధ్రజాతీయ భావోన్నతికి సూచికముగ నీ పుస్తకాశయమును శ్రీ కృష్ణదేవరాయ నామాంకితము జేసియున్నారు. దీనికన్న గొప్ప పేరు దేశచరిత్ర మందు కన్పట్టదు. దేశభక్తికి, కార్యోత్సాహమునకు, భాషాకృషికి, ఈ "హిందూరాజ్య రమాధురఁధరుని” స్మరణ అమోఘమైన మంత్రము. దాని ధ్యానముచే ఆంధ్రులు ధన్యులౌట నిజము.

జ్ఞానమును వ్యాపింపజేయు పద్ధతులలో ముఖ్యము లెనివి నాలుగు:— పాఠశాలలు, పుస్తకశాలలు, వార్తాపత్రికలు, ప్రసంగములో ప్రజాప్రతినిధులచే పరిపాలింపబడు దేశములలో ఈనాల్గును బహు చక్కగ నిర్వర్తింపబడుచున్నవి. కారణము స్ప్రష్టము. రాజ్యతంత్రము ప్రజాధీనము గావున ప్రజల యొక్క మేలును వృద్ధిజేయుటయ దానికి సహజమైనకర్మము. రెండవది: ప్రజల యొక్క వివేకము ననుసరించి రాజ్యతంత్రము నడచును. జనబాహుళ్యమునందు జ్ఞానాభివృద్ధిని గలిగిఁపకపోయిన రాజ్యము చెడును. మూఢరాజ్యము మంచిరాజ్యము కానేరదు. అట్లగుట నెల్లకును విద్యను విస్తరింపజేయు మార్గముల ననుసరింతురు. అమెరికాదేశము ప్రజాపాలిత రాష్ట్రములలో ప్రాధమికము. అక్కడ పుస్తకాగారములు వ్యాప్తికిని వృద్ధికిని వచ్చిన రీతి నింకే దేశ మందును లేదు. పురములు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రములు మొదలగు ప్రకృతులు తమతమ పరిపాలనా పరిమితిని ఆదాయమును అనుసరించి లైబ్రెరీల స్థాపించు చున్నవి. పసిపిల్లల కాశ్రయమైన వానిని పెద్దవారికి నుచితమైనవానిని ప్రత్యేకించి యుంతురు. ఇట్లుచేయుట యవశ్యకర్తవ్యము. రాజ్యాంగముల చేత నిర్మింపబడు వానికన్న ధార్మికులైన ధనాఢ్యుల చేత ప్రతిష్ఠింపబడినవి సర్వవిధముల నెక్కుడని చెప్పవచ్చును. పాశ్చాత్యులు ధనసంపాదనమందే కాక వినియోగమునందును సమర్థులు. మన జన సామాన్య మట్లు కుటుంబములకు మించని దృష్టియు శ్రద్ధయ లేనివారు కారు. వ్యష్టికన్న సమష్టి ముఖ్యమనియు, సంఘముచెడిన కుటుంబములను గౌరవహీనదశకు వచ్చుననియు చక్కగ హృదయ పూణ౯ముగ భావించి, వారు సంఘశక్తికి నిద్దీపకములైన త్యాగముల నన్నింటిని ధారాళముగ జేతురు. లైబ్రెరీల కొఱకు ఒక్క ఆమెరికాయందే కాక ఇంగ్లాండునందును విశేషముగ కార్నెగీయను మహాత్ముడు ద్రవ్య సహాయము చేసియుండుట జగద్విదితము. రాక్ ఫెల్లర్ మొదలగువారు చేసిన త్యాగములు అనేక కోట్లను మీఱియున్నవి. నిజమైన క్షాత్ర తేజస్సు ప్రబలి యుఁడు చోట్లలో దేశమునకై ప్రాణమును ధనమును వినియోగింపనెవ్వరు వెనుదీయరు.

జ్ఞానము ఉత్పత్తికి రానిది జరులలో ప్రసరింప నేరదు. జ్ఞానము విరివియైన మాత్రన చాలదు. అది పొడుగుగును లోతుగను దినదినము పోవుచుండవలయును. అపుడు గదా నిక్కమైన జ్ఞానాభివృద్ధి! ఎప్పుడో ఎవ్వరో కనిపట్టి చేకూర్చిన విద్యలను విమర్శింపక, అప్పుడప్పుడు పరిశీలిఁపక, వానియందలి ముఱికిని దీరుక, అవి శుభ్రతరము లగునట్లు నూతనాంశములను చేర్పక, నిలకడ దాల్చిన కుళ్లు నీళ్లుగా నుంచుకొని, జనులకు పోయచు వచ్చిన అనారోగ్యము ప్రబలి క్షయవ్యాధిని కలిగింపక మానదు. కావున వ్యాప్తికి సృష్టియు ప్రధానమని భావించి ప్రకృతాది శాస్త్రకృషికిని తిన్మూలమున నూతన