(11) గంజాంజిల్లా బోర్డు ద్వారా గ్రంథాలయముల కిచ్చినట్టు వ్రాయుటను ఈమఁడల గ్రంథాలయ సంఘము యొక్క సలహాననుసరించి పెట్టవలెనని ఈసభవారు సదరు బోర్డువారిని ప్రార్ధించుచున్నారు.
(12) మండలగ్రంథాలయ సంఘమును యిదివరలో చేసిన నిబంధనల ననుసరించి సభలను జరుపుచు కార్యశ్రమమును విరివిరిగా సాగించుటకుగాను తిరిగి పునరుద్ధరించుటకు తీర్మానించమమైనది. మండల గ్రంథాలయ సంఘమునకు ఈ క్రిందివారిని నిర్వాహకులుగా ఎన్నుకొనడమైనది.
(1) మ॥ రా॥ వరహగిరి జోగయ్య పంతులు గారు, అధ్యక్షులు.
(2) ఉపాధ్యక్షుడు, చెన్నూరి నాగేశ్వరరావుగారు, కేంద్ర గ్రంథాలయమునకు ప్రధాన కార్యదర్శి, ఆంధ్రభాషాభివర్ధనీ సంఘ కార్యదర్శి.
మండల గ్రంథాలయ సంఘ కార్యవిధానము జరుపుటకు తిత్తి బలరామయ్య గారిని కార్యదర్శులుగాను,
సంచార కార్యదర్శులు:- (1) రొక్కం బాలకృష్ణా రావుగారు (2) నివల సుబ్బారావుగారు (3) పాణఁగిపల్లి వరహాలుగారు.
కార్యనిర్వాహక సభ్యులు:- (1) ఉన్నవ వెంకట వరహ బుచ్చిరామలింగంగారు, బరంపురం (2) శ్రీ జగన్నాధిపాడిఖడంగ గారు, బారువ (3) న్యాపతి నారాయణమూర్తిగారు (4) కోకా కోదండరామయ్యగారు (5) పాకల సత్యనారాయణ గారు (6) తూముల కృష్ణమూర్తిగారు, (7) రావి లక్ష్మాజీరావు గారు (8) పోతాప్రగడ సింహాచలం పంతులుగారు (9) పొట్నూరి స్వామి బాబుగారు (10) టంకాల సాంబమూర్తి గారు (11) మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారు (12) గిడుగు సీతాపతిరావు గారు.
ప్రతి గ్రంథాలయ ప్రతినిధి
(13) రాబోవు జిల్లా సంఘ సభను ఇచ్ఛాపురం తాలూకా కమిటీలో చింతామణి గ్రంథాలయ పక్షమున సాధ్యమైనంత త్వరలో సమకూర్చుటకు తీర్మానించడమయినది. మయినది.
నైజాము రాష్ట్ర గ్రంథాలయసభ
నైజాము రాష్ట్రమందున్న గ్రంథాలయము లన్నింటి యొక్క ప్రతినిధులను చేర్చి సభ నొకదానిని సమావేశము చేయవలెనని కడచిన నాలుగు సంవత్సరముల నుండియు ప్రయత్నములు జరుగుచున్నవి. కాని ఆ ప్రయత్నములు కొనసాగ లేదు. ఇప్పుడట్టి సభ సమావేశమగు సూచనలు గన్పట్టుచున్నవి.
ఆసభలో ప్రవేశపెట్టిన బాగుండునని గంగరాజు రఘునాధరావుగారు తెలుగుపత్రికయందు ఈ క్రింది తీర్మానములను సూచించియున్నారు.