చతుర్థగంజాంమండల గ్రంథాలయ మహాసభ, కళింగపట్నం
తీర్మానములు
(1) గ్రంథాలయోద్యమాభివృద్ధికిని ఆంధ్రవాఙ్మయాభివృద్ధికిని తమ జీవితమును ధారపోసి అకాలమృత్యువు వాతబడిన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు, కావ్య చెలికాని లచ్చారావు, వంగూరి సుబ్బారావు గార్ల యొక్క ఆత్మలకు శాంతిగలుగుగాక యని ఈసభవారు భగవంతుని ప్రార్థించుచున్నారు.
(2) డిస్ట్రిక్టు బోర్డులు, తాలూకాబోర్డులు, మునిసిపాలిటీలు, తగిన స్థితిగలిగిన సంస్థలు, ధర్మ గ్రంథాలయములకు, పఠన మందిరములకు విరివిగ గ్రాఁటుల నొసంగ వలెనని ఈసభవారు ప్రార్థించుచున్నారు.
(3) గ్రామపురోభివృద్ధికి హేతుభూతంబులగు ధర్మ గ్రంథాలయములకు గ్రాంటులనిచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడవలెనని యీ జిల్లా యందలి యూనియ౯ బోర్డు లను ఈసభవారు ప్రార్థించుచున్నారు.
(4) (క) గ్రంథాలయ సభలు ఈ క్రిందివిషయముల గమనించి పనిచేయుట మూలకముగా గ్రంథాలయముల సజీవముగ నుంచవలెనని తీర్మానించుచున్నారు.
1. శిలవస్తువులు అనగా రాగి, ఇత్తడి, రాయి, మట్టి, మొదలగువానితో చేయబడిన విగ్రహములు, ఉపకరణములు, అలంకారములు మొదలగునవియును పురాతన చిత్తరువులు మొదలగు వానిని సంగ్రహించి, గ్రంథాలయమునందు ప్రదర్శించుట.
2. తమ గ్రామ చరిత్రను వ్రాసియుంచుట, దీని యందు పురాతనచరిత్రయేగాక ప్రస్తుతపు సాంఘిక, ఆర్థిక, నైతిక పరిస్థితులన్నియు అత్యంతవిరళకుగ నుఁడవలెను.
3. అన్నిమతములకు సంబంధించిన జాతీయ ఉత్సవములనగా దేవీనవరాత్రములు, శ్రీకృష్ణజయంతి మున్నాగు పండుగులు పర్వములగు భారతజాతీయ నిర్మాణమునకు తోడ్పడు మహాపురుషుల వర్గంత్యుత్సవములను జరుపుట.
(చ) ఈ కార్యములన్నియు నిర్వహించుటకును అనగా నూతనగ్రంథాలయములు స్థాపించుటకును, పోషించుటకును, పురాతన గ్రంధములు ముద్రించుటకును శిల్పవస్తువులు సంగ్రహించుటకును, జాతీయ ఉత్సవములు సల్పుటనకును ఇంకను గ్రంథాలయోద్యమమును విరివిగా వ్యాపింపయటకు గ్రంథాలయ సభ్యు లెల్లరు సంక్రాంతి పండుగ దినములందు జాతీయభిక్షను ద్రవ్యరూపమునను, వస్తురూపమునను వసూలు చేయవలసినది.
(5) గంజాంమఁడలమందు అన్ని పట్టణములందును, పల్లెలయఁదును ధర్మగ్రంథాలయములను, పఠనమందిరములను సాపింపవలెననియు మండల గ్రంథాలయ సంఘ మందుచేరి కృషి సలుపవలెననియు ప్రజల నీసభవారు హెచ్చరిుచుచున్నారు.
(6) బరంపురం ఆంధ్రభాషాభివర్ధినీ సంఘము వారిని, గంజాంమండల కేంద్ర గ్రంథాలయ సంఘముగా ఏర్పడుటకు ఈ సభ వారు కోరుచున్నారు.
(7) క. అంధ్రమఁడలమందున్న మండల గ్రంధాలయము లన్నిటికిని తమ గ్రంథములన్నిటిని ఉచితముగా నిచ్చుచు గ్రంథాలయోద్యమాభివృద్ధికి చేయూత నొసగుచున్న శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రుల్లు అండ్ సన్సువారి కీ సభవారు వందనముల నర్పించుచున్నారు.
చ. ఈమండల గ్రంథాలయముగా నేర్పడిన శ్రీ బరంపురం ఆంధ్రభాషాభివర్తినీ సంఘమువారికి వారి గ్రంధముల నిచ్చుటకు గాను శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రి అండ్ సన్సు వారిని ఈ సభవారు ప్రార్థించు చున్నారు.
(8) వ్యవహారమునను, సంభాషణకు, ఉతర ప్రత్యుత్తరముల నాంధ్రులందరు ఆంధ్రభాషకు ప్రాముఖ్యత నొసంగవలెనని ఈ సభవారు తీర్మానించుచున్నారు.
(9) గంజాంజిల్లా గ్రంథాలయ సంఘమును, ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమునకు శాఖాసంఘముగ జేర్చుటకు తీర్మానించడమయినది.
(10) గ్రంథాలయములందు పుస్తక భాండాగారము నాకు తోడు రాట్నమునకు కూడ తావొసగి పురాణ పత్రికాపఠన సమయమందు, తదితర సమయములందు ధర్మముగ నుండుటకు రాట్నమును త్రిప్పును నూలు వడుకుటకు సదుపాయములు జేయ నీసభవారు హెచ్చరించుచున్నారు.