సితులను గమనించి లోపాలోపములను సవరించుటకును గ్రంథాలయ పురోవృద్ధికై తగిన సలహాలను విద్యాశాఖ ముఖ్యాధికారులకు తెలుపుటకు తగిన యవకాశము లేనే లేదు. గ్రంథాలయమందుండునట్టి యధికారులు ఏమివ్రాసి పంపినను ఆ రికార్డులపై సంతకము చేసి విద్యాశాఖవారికి బంపునట్టిస్థితియే తప్ప క్యూరేటరుపదని నలంకరించిన లగాయతు నేటివరకును వీరేలాటి యభివృద్ధియు జేసినటుల కానరాదయ్యె. వీరికి పూర్వమి స్థానము నలంకరించియుండి కీర్తి శేషులైన శ్రీయుత రంగాచార్యులుగారు చేసిన మహోపకారముచే నానా స్థలములనుండి గ్రంథములు నార్జించునట్లుకు అట్టి గ్రంథములను ముద్రించి లోకహితము చేయవలయు ననియు చాల ప్రయత్నముల చేసి గవర్నమెంటువారిచే నొక గ్రంథార్జనశాఖను వారి కాలములోనే నెలకొల్పిరి, ఆటులు నెలకొల్పిన శాఖచే 1915 సం॥ నుండి 1922 వరకును అమూల్యములును అపూర్వములగు గ్రంథరత్నములార్జింపఁబడినవి. పాప మామహనీయుడీ గ్రంథములను చూడకయే లోకాంతరగతుఁడయ్యెను. ప్రకృతమందా శాఖకు కూడ దొరతనము వారు తీసి వేసిరి. అట్టి మహనీయుని కృపచేతనే నేటికాలమునకీ గ్రంథాలయముండునట్టి స్థలమైన తెలియునట్లాయెను. ప్రకృతమఁదుండు క్యూరేటరు గారే కొన్నిరోజులు గ్రంథాలయస్థితులను చూచుచువచ్చినచో నామమాత్రా వశిష్టమగుటకు సంజయము లేదు.
ఇంక పండితులు చేయుఁట్టి కేటలాగులను సరిచూచి సవరించి ముద్రణమునకు బంపుట మున్నగు కార్యములఁ జూచుటకు లైబేరియ౯, అసిస్టెంటు లైబ్రేరియ౯ వీరివురకు సరిపోవుచున్నది.
పండితులు సంస్కృతభాషకు మాత్ర మిద్దరు యున్నారు. వారికి సహాయ మొనర్చుటకు పండిట్ కాపిస్ట్ ఒక్కరున్నారు.
తెనుగున కొకరిని, ద్రావిడ భాష కొకరిని పండితులుగా నియమించి వారికీ సహాయము చేయుటకు కాపీస్టులు లేకనే వారే గ్రంథములను చదువుచు, చదివినవాటికి క్యాటలాగులు తయారు చేయుచు, తంటాలు పడుచున్నారు. ఉండునట్టి గ్రంధములన్నమో లోకల్ రికార్డులు మొదలుగా గల గ్రంథములు, ఆంధ్ర, కర్ణాటక ద్రావిడ భాషలలోనే శిధిలీకృతములై యున్నవి. ఈ గ్రంథలను చూచుటకును క్యాటలాగులు తయారు చేయుటకును మనుష్య సహాయ యా యాంధ్ర ద్రావిడ పండితులకు చాలదు. ఇఁక కర్ణాటక భాషలో లెక్కలేని గ్రంధములును, చరిత్రములకు సంబంధించిన లోకల్ రికార్డును వేలు వేలున్నవి. ఆభాష కొక పండితుడు కూడ లేడు. పండితుల జీతములు గూడ స్వల్పముగా నున్నవి పని మాత్రము మెండు.
గ్రంథాలయమందు ఈక్రిందిలోపములను వెంటనే సవరించినగాని ఉపయోగ ముండదు.
1) వచ్చునట్టి విజిటరులకు తగిన స్థలము లేకుండుట.
2) ఎట్టులో తంటా పడియైనను చదువుకొందమన్నమో ఒక పుస్తకమును తెప్పించుకొని చదువుటకు లెక్కలేని కేటలాగులను చూచి తెలుసుకోవలసినదిగా నున్నది. చూచి నప్పటికిని వాటి నెంబరుల వ్రాసియిచ్చి, గ్రంధమును తెప్పించుకొనుటకు జాలసేపగుచున్నది. అట్టులగుటకు కారణము సరియైన లిస్టులేని లోపమె యన దగును.
3) ఆర్జించి తెచ్చిండు గ్రంధములను చూచుట కైన నివ్వరు. అట్టి పుస్తకములను కాపీచేసి లైబ్రరిలో నుంచిన తర్వాత విజిటరుల కియ్యఁ బడునని చెప్పుచున్నారు. పోనిండు. అటులనే కాపి చేసిన తరువాత జూతమంటే ఆర్జించి 2, 3 సంవత్సరములయ్యు, నేటివరకును కాపీ చేయకనే యుంచియుండుట కడుశోచనీయము.
4) గ్రంథాలయమందుండు నట్టి ప్రాచీన గ్రంథములను అనేక రికార్డులను రీకాపీ చేసి యుంచకనే నానాటి కొక పత్రముచొప్పున నూడిపోవునట్టి స్థితిలో నుంచి యుండుట మిక్కిలి సంతాపకరము.
5) దేశాటన మొనర్చి గ్రంథములు సంపాదింప మొదలిడినచో గ్రంధములు అసంఖ్యాకములు చిక్కువని తెలిసి యుండగా నింతలో ఈ శాఖను తీసిన విషయ మత్యంత దుఃఖకరము,
ఈ గ్రంథాలయ విషయములను విచారించి కనుగొనుటకుగాను గవర్న మెంటువారు ఇటీవలనే కమిటి నొక దానిని ఏర్పరచి యున్నారు. ఈకమిటీ వారు ఏమి చేయదురో ముందు ముందు చూడవలసియున్నది.