Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీద వ్రాయబడిన గొప్ప గ్రంథముల పట్టిక కలదు. అందు పదకొండు ప్రస్యారాజ్య గ్రంథాలయము లందుగల గ్రంథములనుగూర్చియు విపులముగా వ్రాయబడి యుండును. ఇదిగాక, ఆ దేశమందుగల ఇతర గ్రంథాలయము లందుగల గ్రంధముల పట్టికలలు కూడ సిద్ధముగ నుండును. జర్మనీ దేశమందలి ముఖ్య గ్రంథాలయములఁదు గల 16,000 పత్రికల యొక్క పట్టికను గూడ ఈ సంఘము వారు తయారు చేసినారు.

ఏ పుస్తకము గూర్చియైన విచారణవచ్చినప్పుడు, ఆ గ్రంధమును గూర్చి కార్డులమీద వ్రాసి అన్ని గ్రంథాలయములకును పంపెదరు. ఆ గ్రంధమున్న గ్రంథాలయము వారు ఆ కార్డుమీద ఆగ్రంథము తమ యొద్ద గలదని వ్రాసి, తిరిగి ప్రచురణ సంఘమునకు పంపెదరు. ఈరీతిగా విచారణకొరకు వచ్చిన గ్రంథవిషయము తేలిసిన పిమ్మట "ఆ ఫలితము గ్రంథస్థము" చేయబడును. 1912 సంవత్సరమున దీసంఘము వారికి 13,965 గ్రంధములను గూర్చి విచారించుచు 1,35,207 ఉత్తరములు వచ్చినవి. అందు 9,737 గ్రంథములను గూర్చిన విచారణ ఫలప్రదమైనది.

గ్రంథముల ఎరుపు

ఈ ప్రచురణ సంఘమునకు చెంది 400 గ్రంథాలయములు గలవు. ఈ సంఖ్య దినదినమును అభివృద్ధి జెందుచున్నది. ఈసంఖ్యలో ముప్పాతిక భాగము పాఠశాలలకు చెందిన గ్రంథాలయములై యున్నవి, వ్రాతగ్రంధ ప్రతులు, అమూల్యములైన ముద్రిత గ్రంధములు ఎరువు ఇయ్యబడవు. మొత్తము మీద గ్రంధములన్నియు మూడు వారముల వరకు ఎరువియ్యబడును. పత్రికలు, కరపత్రములు మొదలైనవి ఒక వారమునకు మాత్రమే ఎరువియ్యబడును. ఎరువును తీసికొను గ్రంథాలయము, ఎరువిచ్చు గ్రంథాలయమునకు జవాబుదారీయైయుండును. ఎరువుతీసికొను గ్రంథాలయము, తన చదువరులకు కావలసిన నిబంధనలను ప్రత్యేక మేర్పరచుకొనును. ప్రష్యారాజ్య మందుగల 11 పెద్ద గ్రంథాలయములందును సభ్యులు తాము మామూలుగా ఇచ్చుచందా గాక, తీసికొను ప్రతి పుస్తాకమునకు వేరు చందా ఇయ్యవలసియుండును. ఆ తీసికొను పుస్తకమే, ఇతర గ్రంథాలయము నుండి తెప్పించి ఇయ్యవలసియుండిన, రుసుము కొంచెము ఎక్కువయుండును, ఆరుసుములో కొంతభాగము గ్రంధమును ఎరువిచ్చు గ్రంథాలయమునకు జెందును. ఇంకను అవసరమయ్యే ఇతర యేర్పాట్లుగూడ గ్రంథాలయములు పరస్పరము జేసికొనుచుండును.


రాజకీయ ప్రాచ్యలిఖిత గ్రంథాలయ దుఃస్థితి

మెక౯జీ, బ్రౌ౯, మొదలగు మహాశయులు ద్రవ్యమును లక్ష్యపెట్టక దేశమఁదంతటను వెదజల్లి సేకరించి యుండు కైఫీయత్తులు, సన్నిదులు, దానశాసనములు, లోకల్ రికార్డులు మున్నుగాగల చరిత్రాంశములను తెలుపునట్టి గ్రంథములును జగద్విఖ్యాతులగు ప్రాచీన గ్రంథకర్తలచే రచియింపఁబడిన వివిధశాస్త్రీయ గ్రంథములును మద్రాసునందున్న ఈ గ్రంథాలయ మందు వేల వేలున్నవి.

అట్టి మహిమోన్నతిఁ జెందిన గ్రంథరాజము లతిశిధిలములై పునశ్లేఖనము చేయుటకు సంసిద్ధములై నానాటికి క్షీణించుచున్నవి.

గ్రంథాలయమందుండు పుస్తకములన్నయో లక్షగ్రంధములకంటే ఎక్కువగా నున్నవి. అయ్యని సంస్కృతాంధ్ర ద్రావిడ కర్ణాటకాది వాఙ్మయములకు సంబంధించినవిగా నున్నవి. వానిపరిస్థితులు గమనించుటకై నియమించియుండు వారిసంఖ్యయె అతిస్వల్పము. ఒక్క సంస్కృతభాషకు ముగ్గురు పండితులను, తెనుఁగుభాష కొకరిని, ద్రావిడ భాష కొకరినిగా నియమించి తక్కిన భాషలయందుండు గ్రంథములు చేసచూచేను లేక పాడుపడి పోవునట్లు చేసియున్నారు,

ఈ గ్రంథాలయ స్థితిగతులను చూచుచుండుట, కొక లైబ్రేరియన్, అసిస్టెంటు లైబ్రేరియన్, 4 గురు పండితులు, ఒక కాపీస్టు, గ్రంథాలయమునకు వచ్చి చదువు వారలకు పుస్తకముల నిచ్చుట కొక అటెండరును నియమింపఁబడియున్నారు. వీరికందరికిని పైయధికారి క్యూరేటరు. ఈక్యూరేటరు ప్రెసిడె౯సి కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ పదవియందుండెదరు. వీరికి కాలేజీవిషయముల గమనించుటకే ప్రొద్దుచాలుటలేదు. ఇంక గ్రంథాలయ పరి