Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడ మనస్పర్థలు చాల విచారకరమనియు, తామీ వరకు గౌతమీ గ్రంథాలయమునకు పోవుచుండెడి వాడననియు, ఆంధ్రదేశములో నెల్ల ప్రసిద్ధి కెక్కిన యీ గౌతమి గ్రంథాలయములో కక్షలు బయలు దేరి గౌతమీ గ్రంథాలయము నెవ్వరి కందుబాటు గాని, నిరుప యోగమైన యూరిబయటి యొక గృహములోనుంచి అన్ని విద్యాలయములవారికి చాలదూరముగ నుంచుట తమబోటి యుపాధ్యాయుల దౌర్భాగ్యమనియు, దీని విషయమై రాజమహేంద్రవర పౌరు లెట్లు సహించి యూరకొనినదియు తమ కాశ్చర్యముగ నున్నదనియు సెలవిచ్చిరి. వీరి తరువాత చేబ్రోలు వెంకటదీక్షితులు గారు ప్రసంగించి గ్రంథాలయములో యెప్పటి పుస్తకములప్పుడు లభించుననియు, ఇవియన్నియు విడివిడిగా ఎవరికి వారు కొనుట సిద్ధించదనియు చెప్పిరి. తరువాత అధ్యక్షుని ప్రస్తుతమున హిందూదేశములో ప్రజాసామాన్యము రాజకీయవిషయములలో యెక్కువ అభిరుచి చూపుచున్నదనియు, వీరికి సరియయిన జ్ఞాన మొసంగు గ్రంథములను సేకరించుటకు గ్రంథాలయము అవసరమనియు, ఆ పాఠశాలలోని యుపాధ్యాయులు సుమారు వంద గ్రామములనుండి వచ్చియుందురనియు వారు గౌతమీ గ్రంథాలయమును దర్శించి అది యెట్లు పని చేయుచున్నది పరికించి వారి గ్రామములలో ఆపద్ధతిమీద గ్రంథాలయముల స్థాపింపవలెననియు హెచ్చరించిరి. అంతట సభ ముగిసెను.


జర్మను గ్రంథాలయములందు సహకారము

జర్మనీ దేశమందు ప్రష్యాయను రాజ్యము గలదు. ఆ రాజ్యమునందుగల విశ్వవిద్యాలయములు పదింటి యందును రాజమందిర మందును గలసి పదునొకండు గొప్ప గ్రంథాలయములు కలవు. ఆగ్రంథాలయములన్నియు ఒకే విద్యామంత్రియొక్క పరిపాలన క్రింద ఉండియున్నవి. ఆగ్రంథాలయములన్నింటి యొక్క ఉద్యోగులకును ఒక మాదిరిగానే జీతము లియ్యబడుచుండును. ఒకమాదిరి గానే తరిబీకుడు పొందియుండిరి. ఈ గ్రంథాలయ ఉద్యోగులందరును ఒక గ్రంథాలయమునుండి మరియొక గ్రంథాలయమునకు బదలాయిఁప బడుచుందురు. ఆ గ్రంథాలయము లందలి గ్రంథముల పట్టిక లన్నియును ఒకే నిబంధనలనను సరించి తయారు చేయబడినవి. ఆ గ్రంథాలయములందలి నూతన గ్రంథములు పేర్లన్నియు ఒక ప్రచురమునందే ప్రచురింపబడు చుండును. అన్నిటియందు గల గ్రంథము లన్నింటికిని కలిపి గ్రంథముల పట్టిక నొక దానిని తయారుచేసిరి. విదేశ సారస్వత గ్రంథముల కొనుట యందీ గ్రంథాలయములు ఒక్కొక గ్రంథాలయ మొక్కొక్క విషయకమైన గ్రంథములను విక్రయమునకు దీసికొను చుండును, అందువలన విదేశ సారస్వత గ్రంథములన్నియు మొత్తముమీద ఏదో యొక గ్రంథాలయ మందు కాన్పించుచుండును.

విద్యార్థి తనకు కావలసిన గ్రంథము తన గ్రామ గ్రంథాలయమందుదొరకని యెడల, ఆగ్రంథాలయముద్వారా, తన గ్రామమునకు దగ్గరనున్న విశ్వవిద్యాలయమునకు గాని రాజభవన గ్రంథాలయమునకు గాని ఆ గ్రంథుకొరకు వ్రాయును. అక్కడను దొరకనియెడల "ప్రచురణ సంఘము” వారికి వ్రాసి, అగ్రంథము ఏ యితర గ్రంథాలయము నందున్నదో తెలిసికొని, ఆ గ్రంథాలయమునకు తన గ్రంథాలయముద్వారా వాయును. చదువరి తన గ్రామ గ్రంథాలయమునకు జవాబుదారిగా నుండును, ఎరువు తీసికొను గ్రంథాలయము ఎరువిచ్చు గ్రంథాలయమునకు జవాబు దారిగా నుండును.

ప్రచురణ సంఘము

ఏ గ్రంధమైన జర్మనీ దేశమందున్న ఏ గ్రంథాలయ మందున్నదో తెలుసుకొని, ఆవిషయమును కోరినవారికి తెలుపుటయే ఈ సంఘము యొక్క పని. ఏ పుస్తకము విషయమైన తెలిసికొనగోరు వారు అగ్రంథము తన కెందుకు కావలెనూ వ్రాయుచు స్వల్పముగ రుసుమును ఇయ్యవలసియుండును. ఈ ప్రచురణ సంఘము యుక్క ఉపయోగమును పొందుచున్నవి. జర్మనీ దేశమందే 382 గ్రంధాలయములు కలవు. ఇవి గాక ఇంకో ఐరోపాదేశమందున్న ఇతర గ్రంధాలయములు గూడ దేనియుక్క ఉపయోగమును బొందుచున్నవి.

ప్రష్యా రాజ్యగ్రంథాలయ గ్రంధముల యొక్క పుస్తకముల పట్టికకును ఈ ప్రచురణ సంఘమునకును విశేషమైన సంబంధములదు. ఈ రెండును రాజమందిర గ్రంథాలయముతో గూడ విశేషసంబంధమును కలిగి యున్నవి. ఈ సంఘ కార్యాలయమందు 1,283,000 కార్డుల