Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెల్లూరునందు సరస్వతీ రీడింగు రూము అను పేరున పఠనమందిరము ఏర్పడినది.


క్రీస్తుశకము 1565 సంవత్సరము జనవరి 23 మంగళవారము నాడు తెళికోటయుద్ధమున వీరశయన మొందిన రామరాజు పటమును హైదరాబాదు ఆంధ్రపరిశోధక సంఘమువారు సంపాదించిరి.

కడపజిల్లా కోడూరుపాడు గ్రామమునందున్న జ్ఞానోదయనిలయ గ్రంథాలయమునకై దీపావళి పండుగ సందర్భమున ఆగ్రామమందు భిక్ష వసూలు చేయగా దాదాపు ఇరవై రూపాయలు వసూలైనవి.

సమస్త జాతీయోద్యమములకు పునాదియైన గ్రంథాలయోద్యమమును ఆంధ్రదేశమున బాగుగా ప్రచారము చేయుటకు గాను యాతగిరి లక్ష్మీ వేంకటరమణగారు కాకినాడయందు ధర్మగ్రంథాలయ పత్రికను స్థాపించినారు. చందా సంవత్సరమునకు ఒక రూపాయి మాత్రమే. గ్రంథాలయోద్యమమును గూర్చి చక్కని వ్యాసములు ప్రకటిఁపబడుచున్నవి.

నైజాం రాష్ట్రమందున్న తుమ్మలగూడెం గ్రామ "శ్రీ ఆంధ్రవిజయ గ్రంథాలయము వారు నరక చతుర్దశి నాడు దీపావళి భిక్షకు వెళ్లగా ౫౦ లు వసూలయ్యెను. మరునాడు ధనపూజ గ్రంథాలయమునందు జరుపబడినది.

బెజవాడయందున్న "శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరాంధ్ర గ్రంథాలయము" దినదినాభివృద్ధి గాంచుచున్నది. శివాలయ ప్రాకారమును ఆనుకొని దీనికొరకై ప్రత్యేకముగ చాల కాలము క్రిందనే కట్టింపబడిన మేడమీద, ఇటీవలనే ప్రవేశింప గిలిగినది. వైశ్యశ్రేష్ఠుల యాదరణ వలన వెయ్యిరూపాయల విరాళములను వసూలుచేయ గలిగిరి. ప్రతిఅమావాస్యనాడును సభలు చేయబడు చున్నవి.

నైజాము రాష్ట్ర ముందు కొలనుపాక గ్రామమందున్న బహిరామియా గ్రంథాలయము భాషాభిమానుల యాదరణచే ఇపుడుక్రమముగ పనిచేయుచున్నది. ప్రతి గురువారము ఉపన్యాసములు జరుగుచున్నవి. అందు పాఠశాల బాలురు, ఉపాధ్యాయులు, ఇతర యౌవనులు పాల్గొనుచున్నారు.

అక్షరహంసలు

ఈగ్రంథము మా కార్యస్థాన మలంకరించినది. ఇది ధర్మార్థ కామమోక్షములలో తురీయమగు మోక్షాభిలాషులగు భక్త బృందమునకు కొంగుబంగారు వంటిది. కీర్తనల యొక్క అక్షరని యమమపూర్వమై శైలిమధురమై యున్నది. కంచెర్ల గోపన్న గారికి “రామదాసు” అను మరియొక్క వ్యవహారిక నామమున్నట్లే యీ గ్రంథకర్తలగు గోపరాజు వెంకటసుబ్బారావుగారికి “మహాదేవ శంభో" యను రెండవవ్యవహారికి నామ ముండుటయే వారు యపూర్వభక్తులని వేనోళ్లచాటుచున్నది. వీరికి శివకేశవుల భేద మావంతయు లేదు. వెల రు 0-8.000 లు మాత్రమే. వలయు వారు గ్రంథకర్త గారి పేర కాకినాడకు వ్రాసికొనవిలేను.


గ్రంథాలయ ఉపయోగములు

6-11-24 తేది గురువారం సాయంత్రము 4 గంటలకు రాజమహేంద్రవర రాజకీయోన్నత ప్రాథమికోపాధ్యాయు బోధనాభ్యసన పాఠశాలోపాధ్యాయ సంఘము తరఫున "గ్రంథాలయములు, వానియొక్క యుపయోగము” అను విషయమును చర్చించుట కొక సభ జరిగినది. మహారాజశ్రీ అడవి శంకరరావుగా రగ్రాసనాధిపత్యము వహించిరి. ప్రథమమున అడపా సూర్యప్రకాశరావుగా రుపన్యసించుచు గ్రంథాలయములు విద్యాలయములప లేజా: మును వెదజల్లునని బోధించిరి. తరువాత మద్దిరాల చిన్నయ్య గారు ప్రసఁగించుచు గ్రంథాలయములలో ఊరిలోని నలఁగురు కలుసుకొని వార్తాపత్రికల ఠించుచుఁడుట చే ప్రపంచజ్ఞానము పెంపొందునని సెలవిచ్చిరి. ఆమంచ సీతారామయ్య గారు తరువాత ప్రసంగించుచు తాము విద్యార్థిదశ వదలిన తరువాత తమ తీరుబడి కాలమును సద్వినియోగము చేసుకొనుటకు గ్రంథాలయములకు బోవుచుఁటిమనియు, పల్లెటూళ్లలో రైతాంగము వృధాగా పేకయాటతో కాలము పుచ్చుననియు, అట్టివారికి గ్రంథాలయములో చాల యుపయోగకరముగ నుండుననియు నిచ్చజెప్పిరి. తరువాత సయ్యద్ పీరు సాహెబుగారు ప్రసంశించుచు తాము గడిశేలేరు గ్రామములో గ్రంథాలయమూ నభివృద్ధిజేయుటకు పడిన పాటులను వివరించి గ్రంథాలయము వ్యాపారములలో