Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యధీనముగ నుండెడిది. రెండవది కేవల సంఘసమిష్టి యొక్క యధీనమున యుండెడిది. ప్రజావికాసమునకు కవష్ఠఁభకములగు యుద్యమములన్నియు ఈ రెండవ తరగతిలో చేరినవే. ఇందువలననే పూర్వకాలము నుండియు మనదేశమున జరుగు దానధర్మము ము లన్నియు ప్రజాభివృద్ధికొరకై సద్వినియోగములై ప్రజాసమిష్టికి జవసత్వము నొసగుచుండెను. మన యుద్యమము యొక్క పరమ ప్రాప్యము మానవమానస వికాసమని చెప్పవలసియున్నది. మనుజులెందరున్నారో వారి స్వభావములు కూడ అన్ని యున్నవని చెప్పవలెను. వీని నన్నిటిని అభివృద్ధి నొందించు సాధనములుకూడ అంత అసంఖ్యాకములని చెప్పిన యతిశయోక్తి కానేరదు. మానస పికాపమున కవసరమగు ప్రతిష్ఠాపనేలను స్థాపించి నడువవలని వచ్చినపుడు ప్రభుత్వ ప్రతిష్ఠాపనలకు సహజలక్షణమగు, నియమబద్ధమైన సంపూరైక్యస్వభావమునకు వానియందు తావీయకూడదు. ఇందువలన ప్రభుత్వమునుండి గ్రంథాలయములు సొమ్మును గైకొనకూడదని చెప్పుటలేదు. ప్రభుత్వమువారు ఈ యుద్యమమునకు తగు సహాయము చేసి తామిచ్చు ద్రవ్యము సద్వినియోగమగునట్లు తగుకట్టుదిట్టములు చేయుట మిగుల యావశ్యకము. కావున ఈ యుద్యమము జయప్రద మగుటకు ముఖ్య సాధనము కార్యదీక్షాపరులు వీరు ఈయుద్యమమున గట్టి నమ్మకముకలవారై సన్మార్గమున దీనిని నడిపి తన్మూలమున దేశోద్ధరణ చేయుటకు బద్దకంకణులైన వారుగా నుండవలెను. పుణ్యభూమియగు ఈ భరతవర్షమున అనాదినుండియు మానవజీవితమంతయు బ్రహ్మార్పణము చేయవలసిన నిబంధనయుండి యున్నది. కావుని ఆత్మసమర్పణముయొక్క యావశ్యకతను గూర్చియు అందలి ఫలమును గూర్చియు భారతీయులకు నొక్కి తిరిగిచెప్పుట యనావశ్యకము. మన దేశచరిత్రమును పరికించి చూడుడు. ఎంత ఆత్మసమర్పణ! ఎంత కార్యదీక్ష! ఎంత సేవా పరతంత్రము! ఎంత ఆత్మశక్తి! మన పూర్వుల జీవితములు మనకు బోధించుచున్నవి. మన భారతజనని అన్నివిధములను దైన్యస్థితిని చెంది గగ్గోలుగా ఆర్తనాదము చేయుచున్న ఈ యాతురసమయమున మన విధులను మనకు గుర్తెరిగి మన మాతృఋణము తీర్చి ధన్యులము కాజనదా!

ఆత్మ సమర్పణము ప్రత్యక్షావతారము దాల్చెనోయన వెలసిన మహాత్మా గాంధి మన దేశమునంతను, తేజఃపుంజముగా ముందుండి నడుపుచుఁడగను, మహాకవి రవీంద్రుడు దేశదేశాంతరములకును, ఖండఖండాంతరములకును జని అచ్చట శాశ్వతశాంతిని నెలకొల్పుటకు విశ్వప్రయత్నములు జరుపుచుండగను, అరవిందుడు పుదుచ్చేరినగరమున ఘోరతపమాచరించుచు విశ్వమానవ జాతిని సంపూర్ణముగ సేవచేయుశక్తులను సమపార్జించు చుండగను, సేవాపరిత్వమును ఆధునిక భారతీయులకు సక్రమముగ బోధపడకుండుటకు తావున్నదా! భారత జాతి ఆధునికకాలమున చెందుచున్న పునర్నిర్మాణ కార్యవిధానమందు మన ధర్మ గ్రంథాలయోద్యమము ముఖ్యస్థానము నధిష్టించి యున్నది. సంఘమునందు శాంతిని నెలకొల్పి అన్యోన్య స్పర్థలను నివారణ చేయుటకు ఈ యుద్యమమునుగల శక్తి అనంతము. మనదేశ నిప్పుడు చీకాకు పరిచుచున్న సాంఘిక వైరములన్నియు ఈ యుద్యమమును జయప్రదముగ నిర్వర్తించినచో మాసిపోగలవు. ఈ యుద్యమము వలన సమిష్టిజాతిని ప్రత్యేక వ్యక్తికిని కల్గెడు లాభములు కడుమెండు. ఈ యుద్యమము మనుజుని కేవల వైషయిక వాతావరణమునుండి లేవనెత్తి అనంతకళ్యాణగుణాకరుడును ప్రేమ సంపూర్ణుడును యగు పరమేశ్వరుని ప్రేమతశ్వమును కించిత్కాలమైనను అశుభవమునకు తెచ్చును. మనుజుని జానవఁతునిగా చేయును. కావున భారతీయులారా! లెండు, నడుము బిగించుడు. మాతృసేవా పరతంత్రులుకుండు! అప్పుడు ఈ ఆర్యావర్తమున ధర్మమోక్షములకు వ్యతిరిక్తము కాని అర్థకామములకు భరతఖండమున పునఃప్రతిష్ఠించిన వారమగుదుము! మహాత్మా గాంధి గారు సెలవిచ్చినట్లు మన హృదయ పీఠమున పరమేశ్వరుని పునః సింహాసనాసీనుని చేసిన వారమగుదము.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.