Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.5 (1924).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్రాసనాధిపతిగారగు కుడు హోల్కరు గారును ఆసభకు అహ్యానసంఘాధ్యక్షులు కస్తూరి రంగఅయ్యంగారును మనలను విడచి స్వర్గస్తులైరి. వారు ఉభయులు మిక్కిలి కీర్తిమంతులు, వారిని పోగొట్టుకొనిన దుఃఖముతో మనము నిరుత్సాహులము కాగూడదు; అందుకు బదులుగా వారిమరణముచే గలిగిన లోపమును కూడ దీర్చికొనుటకు ఇతోధికధిక ప్రయత్నములను మనము జరుప వలసియున్నది. కాకినాడకు అత్యంత సమీపమున నాప్రియసోదరులగు కావ్యనిధి చెలికాని లచ్చారావుగారు కూడ దివికేగిరి, వారికి మనయుద్యమమందు పట్టుదల కడుమెండు. వారి మరణమువలన గలిగినలోపము చులకనగా దీరునది గాదు. మన మాతృభూమియెడల మనము నిర్వర్తించవలసిన విధులను మనము నెరవేర్చుటకు తగిన శక్తిని పరమేశ్వరుడు మనకొసంగుగాక!

సామాన్యముగా విద్యాభివృద్ధినిగూర్చియు, అందుప్రాముఖ్యముగా గ్రంథాలయోద్యమమును గూర్చియు, కొద్దివిషయములను మీయెదుట మనవి జేయుచున్నాను. మన దేశాభివృద్ధిని గోరువారందరు ఆలోచించుచున్న రాజకీయ ఆర్థిక సాంఘిక మతవిషయిక సమస్యలన్నీయు ప్రజలయందు జ్ఞానమును వ్యాపింపజేయుటచే నెరవేరగలవని ఎంచతగియున్నది. ప్రతిమసుజుడున తనయొక్క శక్తిని, దాని ఆభావమును గుర్తొరింగి తనమమోభీష్టము సిద్ధినిబొందుకొరకు ఏయే విధానము అవలంబించవలయునో దానినంతను జ్ఞానజ్యోతి ద్యోతకముజేయును, ప్రతిమనుజుడును తనవాంఛలను ఆకలిదప్పులవలెనే తీవ్రముగ అనుభవములోనికి తెచ్చుకొన్నగాని వాంఛిత ఫలసిద్ధి పొందనేరడు.

మనము ఉపదేశించువిద్య జాతీయపద్ధతి నవలంబించి యుండవలేను. ప్రతిజాతియు, నిర్దిష్టముగు ఆదర్శసిద్ధికై కృషి చేయుచున్నది. ప్రాచ్యా పాశ్చాత్య ప్రాప్యములలో భేదము చాలగలదు. అందువలననే పాశ్చాత్య పద్దతుల నవలంబించి మన పాఠశాలలలో బోధించెడి విద్యమనకు ఈప్సితఫలమును ఇచ్చుట లేదు. చిరకాలాభ్యాసము వలన భారతీయుల మానసిక నైతికతత్వమునందు తృప్తి, ఆడంబరములేని జీవితము, ఆత్మసమర్పణము చేయుధర్మము, త్యాగమునకు లోబరచబడిన భోగము ౼ సంపూర్ణముగ లీనమైపోయినవి. ఈతత్వమును గ్రహించక ఇందుకు వ్యతిరేకమగు సూత్రముల ననుసరించి నిర్మాణము చేయబడు విద్యాభ్యాసవిధానమంతయు మన దేశమునకు నిజాతీయమైన దగుటచే గుంటపూవులు పూయవలసినదే.

కాని ఎన్నటికిని అభివృద్ధిని గాంచనేరదు. ఇంతటితో మనము అన్నిటియందును సంపూర్ణత్వమును పొంది యుంటిమనియు, ఇతరుల వలన నేర్చుకొనవలసిన విషయములు లేనేలేవనియు నేను చెప్పుటలేదు. ఇతరులవలన నేర్చుకొని తీర్చుకొనవలసిన లోపము లనేకములు మనకుకలవు. మనకు నిర్మాణశక్తి బహుతక్కువ. పాశ్చాత్యులను జూచి, మన విధులను సక్రమముగా నెరవేర్చుకొనుదీక్ష , మనము నేర్చుకొనవలసియున్నది. ఇట్లు నేర్చుకొను విషయములయందుగూడ మన జాతీయవ్యక్తిత్వమును మనము మరువగూడదు.

కేవలము కళాశాలాభవనములు మొదలగువానిని నిర్మించుటకును, వానికి తగుపరికరములను చేర్చుటకును ఐశ్వర్యములతో తులదూగుచున్న పాశ్చాత్య దేశములందు మిక్కుటముగ ద్రవ్యము వెచ్చింపబడుచున్నట్లు మన బీద దేశమందు సొమ్ము వ్యయపెట్టలేము, పాశ్చాత్య దేశములలో తప్పనిసరిగా ఉండితీరవలెనను ఎన్నియో వస్తువులు మనదేశమున కేవల వైభవమునకు సంబంధించినవై యున్నవి. ఈ వైభవములు శరీరమును నున్నితపరచి, జీవితమును హ్రస్వముజేయును. ఇప్పటి విద్యార్థులు పూర్వపు వారికంటె ఎన్నియోమడుంగులు బలహీనులు. గ్రంధాలయములు స్థాపించుటయందు ఈ విషయములనన్నింటిని మనము మనస్సు నందుంచుకొనవలయును.

గ్రంథాలయనిర్మాణము మనదేశమునకు క్రొత్తదిగాదు. కాశీ మొదలగు పుణ్యక్షేత్రములందును, మఠములయందును ఆశ్రమములందును నెలకొల్పబడియున్న గ్రంధసమితులు ఆధునిక గ్రంధాలయములవంటి వేను. పరిస్థితులు మారినవి ప్రజలయందు జ్ఞానము ఎక్కువ దట్టముగా వ్యాపించుటకుగాను పాశ్చాత్య పద్ధతులకు కొన్నింటిని మనము అనుకరింపవలెను. ఎక్కువసొమ్మును వెచ్చించి పెద్ద భవనములను, మనస్సును వ్యామోహము చెందించి కర్రసామానులకు, సేకరించుటయందు ద్రవ్యము దుర్వినియోగము చేయక తగు ద్రవ్యమును ఉచితరీతిని వ్యయ పెట్టి గ్రంథాలయస్థాపనమును మనము చేయవలయును,

మిక్కిలి విజ్ఞానవంతులగు బరోడా గాయక్వారుగారు, కీర్తిశేషులు కులాల్కరు గారివంటి కార్యదీక్షాపరుల సహాయముతో ప్రారంభ ఉచితివిద్య మూలమునను, గ్రంథాలయస్థాపన మూలమునను, ఆయన రాజ్యమున ప్రజలకు జ్ఞానాభివృద్ధి చేయుటకు అత్యత్తమములగు సాధనములను అవలంబించియున్నారు. మైసురు, తిరువాన్కూరు మున్నగు ఇతర సృదేశ సంస్థానాధకులు గూడ