పచ్చని పైరిచ్చి | బాగైన నీరిచ్చి వెచ్చన జల్లనయు | ముచ్చటగ నిచ్చినట్టి తల్లి పైనున్న వీటిలో వసమించు తొలుకొండ బసిడిగ ద్దెనున్న భారతమాత ॥తల్లీ॥ —తుమ్మల సీతారామమూ
పత్త్రికాపఠనము
మ. ప్రతినిత్యమ్మును ప్ర్రాలుమాలక యె వార్తాపత్రికల్ గాంచ నే
స్థితికి దేశమువచ్చెనో ప్రముఖు లేచేఁతల్ బొనర్ప మదికి
గుతుకంబందెదరో యెఱుంగ నగుట రూపస్థ మండూక ప
ద్ధతికి బాహ్యులమౌదు మట్లగుట యేతన్మాత్రమేఁ గాంచుఁడి.
ఉ. మందుల మౌటచే బయిని మాలినవస్తువు లెన్నొ పంపి యు
క్తిం దగ మోసగించి పరదేశనివాసులు 'దేశవి త్తము
వందలు వేలు లక్షలు ప్రవాహముగాఁ గొనఁ దెల్ప దేశ మీ
చంద మథోగతి౯గన విశిషాదమునైన వహింప నౌనుగా ॥
ర్తి చౌదరి.
— ప్రతాప వేంక టేశ్వరకవి.
ద్వితీయ అఖిల భారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ
ఈ మహాసభ కాకినాడ పట్టణ పురమందిరమున 1923 సం॥ డిశంబరు నెల 26, 27 తేదీలయందు అతి వైభవముగ జరిగినది. మద్రాసునందు ప్రధమ సభ జరిగిన పిమ్మట, ద్వితీయ సభ బరోడాయందు జరుగ వలసి యుండెను, కాని అట్లు జరుగకుండుటచేత పమిడిపాడు నందు జరిగిన ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభచే తీర్మానింపబడిన ప్రకారము, ఈ సభ కాకినాడ యందు సమకూర్పబడెను. 26వ తేదీ మధ్యాహ్నము 2 గంటలకు సభ ప్రారంభమాయెను. సభకు నిర్ణయింపబడిన కాలమునకు పూర్వమే సభాభవనమంతయు ప్రతి నిధులతోను ప్రేక్షకులతోను క్రిక్కిరిసిపోయెను. వివిధ రాష్ట్రములనుండి వచ్చిన ప్రతినిధులు రమారమి 250 మంది గలరు. బరోడా, మైసూరు, పుదుక్కోట, సంస్థానములనుండియు, బొంబాయి విశ్వవిద్యాలయము నుండియు ఈ సభకు ప్రతినిధులు పంపబడిరి. ప్రార్ధన జరిగిన పిమ్మట, ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీ చెలికాని ధర్మారావు బార్-అట్-లా గారు తమ ఉపన్యాసమును గంభీరమగు వాక్కులతో ఈ క్రిందిరీతిని ఒసంగి యుండిరి.
ఆహ్వాన సంఘాధ్యక్షుని ఉపన్యాసము
ఆహ్వాన సంఘ ముపక్షమున మీకు స్వాగత మొసంగు భాగ్యము నాకు అబ్బినందులకు మిక్కిలిగర్వపడుచున్నాను. ఎనిమిదవ ఆంధ్రగ్రంథాలయ మహాసభలో జరిగిన తీర్మానానుసారముగా, కాకినాడలో ఈ సభ కూడు ఉన్నది. ఈ సభకు వచ్చిన ప్రతినిధులందరి కార్యదీక్షయు, దేశాభిమానమును, ఈ సభను నిర్విఘ్నముగ జరుపగలుగును, మిక్కిలి విచారికరమగు కొన్ని ఆలోచనలు నా మనస్సును చీకాకుపరచుచున్నవి. ఈ ఉద్యమముతో అత్యంతమైన సంబంధముగల ప్రముఖులిద్దరు పరలోకగతులైరి. మొదటి అఖిలభారత గ్రంధాలయసభకు