Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.5 (1924).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్హతలేదు. గ్రంధాలయమన్నమో, గ్రంధసముదాయమే సరస్వతీ దేవియొక్క యాకారము. వేదోపనిషదితిహాస, పురాణ, మహాకావ్య, నవలా, ప్రబంధాదుల వాగ్రహీతగానమే యానలువరాణి వీణానాదము. గ్రంధపరిచయము గొనువారలే ఆ సరస్వతీదేవి నారాధించు వారలు. ఆ విద్యాప్రదాయినీ సందర్శనాఫలిత మింతయని వర్ణింప నలవికాదు. గ్రంథములు విజ్ఞాననిలయంబులు. అంత్యరహితములు. మహనీయ మహాప్రభు ప్రత్యామ్నాయములు. నిర్జనప్రదేశ మిత్రంబులు. మానసికదుఃఖాపమోదకంబులు. సరస్వతీ ప్రసన్న కటాక్షు వీక్షణ జ్యోత్స్నామాత్రమున అజ్ఞానాంధకారము భేదింపబడును. జ్ఞానము స్వస్థితిని విశదీకరించును. స్వస్థితి పరిజ్ఞానము స్వాతంత్య్రమునకు మూలాధారము, స్వాతంత్య్రము దేశాభివృద్ధికి, జాతీయతాభివృద్ధికి ప్రధానమార్గము. అట్టి గ్రంధస్వరూపిణియగు సరస్వతీ విగ్రహము యువజనులచే నెలకొలుపబడినది గాన నేతత్స్వరూపమునకుఁ బ్రాణప్రతిష్ఠఁజేయు భాగ్య బాధ్యతలు మహాజనుల కిప్పటికి గలిగినవి, ఈభాగ్యమెవ్వరి కబ్బునౌకదా! ప్రతివానికిని లభించుట దుస్తరము. కాన మా ప్రార్ధనల సంగీకరించి యీ సుప్రతిష్ఠ సరస్వతీ నిలయమున కుదారభావముతో భూరిపిరాళముల నొసంగి శాశ్వత పోషకులుగా గాని, ప్రధాన పోషకులుగా గాని, రాజ పోషకులుగా గాని చేరి యిమ్మహాకార్యనిర్వహణ భారము వహించి, ఊచితరీతిని తోడ్పడెదరని నమ్మచున్నారము. ఇంతియ గాక యీ సంఘ భవనమునందు పురాణాదిక సత్కాలక్షేపములు నిరంతం మొనర్ప నేర్పాటులు గూడ జరిపింప నుద్దేశించినారము. జాతి, మత, భాష, దేశ చారిత్రక విషయములను గురించిన ముఖ్యవిషయముల కన్నిటికి తగిన యవకాశములను గల్పించుచు నేతద్విషయైక జ్ఞానమును ప్రజలలో నెలకొల్పుటకు బ్రయత్నించుట కూడ నీ సాంఘికుల ప్రధానోద్దేశ్యములలో నొక్కటి.

మాతృదేశమునకును, మాతృభాషకును గలిగిన కళంకము దొలగుటకు సోదరజనులలో విజ్ఞానమును వ్యాపింపజేయ నెంచి సర్వజన హితంబుగ సాపింపబడిన యీ హిందూయువజన సంఘమునకు స్వంత భవనమును మూలధనమును సమకూర్పదలచినారము. శాశ్వత పోషణార్థము రు 5000 లకు పైఁబడిన మూలనిధి యుండిన నేగాని యీ యువజన సంఘము సర్వాంగములతో నిరంతరాయముగ జరుగుచుఁడనేరదని మాకుఁ గలిగిన యయిదు సంవత్సరముల యనుభవమామీద నిర్ణయింపఁ గలిగితిమి. అమిత ధనైకమూలమగు నీ మహాకార్య ముదారావంతుల తోడ్పాటుగావి నిర్వహింపఁబడ నేరదు. అయిన నీ మొత్తమార్జించుట యసాధ్యముకాదని మా దృఢ నమ్మకము. ఒక్కరొక్కరే యీ మొత్తము నీయసామర్ధ్యముఁ గలవారలెందరో యీ గ్రామముననుఁడ పురవాసులు కెల్లర కియ్యది యొక భారము కాదని మా విశ్వాసము. గనుక మీరందరు నడుముగట్టుకొని కార్యభారము వహించి విరివిగ ధనసాహాయ్యము, గ్రంధసాహాయ్యము గావించి యితరులను ప్రోత్సాహపరచి మీచే నగురీతి మాకు జేయూత నొసంగి తోడుపడెదరు గాక యని వేడుచున్నారము. పరాత్పరుండు తమరీ సుకృతినొనర్ప నుదారసాహసము, త్యాగబుద్ధి తమకనుగ్రహించుగాక !

౼ ఊటుకూరు వేంకటసుబ్బారావు

కార్యదర్శి


సంపాదకీయములు

అఖిలభారత గ్రంథాలయ మహాసభ

మూడవ సమావేశము

జాతీయవారములో (డిశంబరు ఆఖరు వారములో) బెల్గాము పట్టణమున జరుగును

జాతీయవారము సమీపించుచున్నది. కర్నాటక రాష్ట్రమందు చేరిన బెల్గామునగరమున జాతీయమహాజన సభ తోపాటు అనేక అఖిల భారత సభలు జరుగును. అందు ఈసభ ప్రాముఖ్యతయందు ఇతర సభలకు తీసిపోవునది కాదు, భారతజాతీయ జీవనపునర్నిర్మాణ విధానమందు గ్రంథాలయోద్యమము ఆక్రమించు స్థానమును గూర్చి ఎంత చెప్పినను చెప్పవచ్చును. ఇందును గూర్చి తిరిగి చెప్పుట చర్వితచర్వణము కాదు. ఈ ఉద్యమము ప్రజలను ఉద్దేకపూరితులనుగా చేయునదిగాక మెల్లమెల్లగా పటాటోపములేకుండునట్లు విధ్యుక్తకార్యములను నేరవేర్చునది