వలయుననియు సూచించుచు ఒక వ్యాసమును వార్తాపత్రికలో ప్రచురించిరి. గయలో మణిలాల్ భాండాగారికులగు నూర్యప్రసాద మహాజన్ గారు దేశీయమహాసభతోపాటు యావద్భారత భాండాగారికుల మహాసభను గయా కాంగ్రెసుతో బాటు జరుపుటకు ప్రయత్నించెను. కాని ఆప్రయత్నిము సఫలముగా లేదు.
ఇట్టి స్థితియందు కాకినాడ పట్టణమున కాంగ్రెసు సభ జరిగినప్పుడు, ద్వితీయ ఆఖిలభారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభను ఆంధ్రులే సమకూర్చిరి.
కాకినాడ సభయందు మహారాష్ట్రదేశమునుండి వచ్చిన ప్రతినిధులు ముందు సభను మహారాష్ట్ర దేశమునకు ఆహ్వానించిరి. కాని వారు ఇప్పుడా సభను చేయజాలకుండుటచే మూడవ అఖిల భారత గ్రంథాలయసభను బెల్లాము నందు కాంగ్రెసు మహాసభ జరుగు వారము నందు చేయుటకు తీర్మానించిరి. అందుచేత బెల్గామునఁదు తృతీయసభను ఏర్పాటు చేయవలసిన బాధ్యతగూడ మనమీద పడినది.
శ్రీ వేటపాలెము హిందూ యువజన సంఘము
పుణ్యనదులచేఁ గడుశోభితఁబయ్యును, వేదశాస్త్ర పురాణ విద్యావివేక ప్రవరులచేతను, మహనీయ సత్యధర్మపరాయణులైన శ్రీ రామచంద్రాది మహారాజుల చేతను, ప్రసిద్ధిఁ జెందిన దేవాలయముల చేతను, ప్రఖ్యాతి వడసిన యన్నసత్రముల చేతను ఆలఁకృతంబై, దాన ధర్మదయాసత్యశౌచముల కుత్పత్తిస్థానమై, ప్రాచీన నాగరికత కాలవాలమై, సమస్తదేశములకు సర్వవిషయములందు మార్గదర్శియై విరాజిల్లుచుండిన నిబ్బరత ఖండము తన సహజ పూర్వవైభవోన్నతిని గోల్పోయి, సమస్తకళలు నశింప నిరుత్సాహసహితమగు ప్రస్తుత యభాగ్యస్థితి తలపైకెత్త, నిప్పుడిప్పుడు ప్రజలలో స్వయం సహాయభావముద్భవిల్లి, స్వధర్మ నిర్వహణార్ధము నూతన ధైర్యస్థైర్య సాహసోత్సాహములు ముప్పిరిగొనంగ, దేశహితైక సకలధర్మ సంస్థాపన లత్పన్నములగుచున్నతఱి, దేశముయొక్క భావి భాగ్యోన్నతికి భాషాభివృద్ది ప్రధమసోపానము గనుకను, అట్టి భాషాభివృద్ధికిఁ బ్రధాన సాధనములైనవియును, భావిస్థితులను నిర్ధారణ చేయుటయం దత్యంతావశ్యకము లైనవియును గ్రంధాలయములు గనుకను ఈ వేటపొలెమునందలి యువ జనబృందములో జనంచిన స్వాభివృద్ధికై వాంఛయు, భాషాభిలాషయుజిగిరింప మాతృభాషాయోషాలలామ కుచితరీతిని సేవఁజేయు నుత్సాహముతో నీ "హిఁదూయువజన సంఘము" సర్వజనరంజకముగా 1918 వ సంవత్సరమున సుస్థాపితముఁ జేయఁబడెను.
యువజను లీసుప్రసిద్ధ సరస్వతీనిలయమును ప్రతిష్ఠించినపుడు వారిహృదయమున లీనమైయున్న యభినివేశము తప్ప నితర సహాయమేమియు లేకపోయినను, దీక్షతో కృషిసల్పిన సంఘము సర్వజనామోదముఁ బడయకవునాయను నాశయే వారి కార్య నిర్వహణమునకు గడంగ ప్రోద్బలపరచినది.
సర్వజనోపయోగకరములగు పుస్తక భాండాగారములే దేశమున మిక్కుటముగ వెలయుచుండునో ఆదేశము సకలకళలకు నెలవై, నాగరికతకుఁ దావలమై, యఖిలసంపదల కాలవాలమై, యత్యున్నత పదవి అధిష్ఠించియుండును. గ్రంథాలయములవలనఁ గలగు ప్రయోజన పరింపరల లెస్సఁగ గ్రహించియే ప్రజాపరిపాలనా సామ్రాజ్యములోగల పాశ్చాత్యులు తమతమ స్వదేశములందన్ని ప్రాంతములను పుస్తకాలయముల నల్లిబిల్లిగ వేలయింపజేసి ప్రపంచమునందలి జాతీయులలో నెల్ల నాగరికాగ్రణ్యులని విఖ్యాతిని బడసిరి.
అనేక శతాబ్దములకుఁ బూర్వము, పాశ్చాత్య నాగరికత యింకను తలయెత్తక మునుపు మన భరతఖండ మఖండసామ్రాజ్య వైభవంబులతోఁ దులఁదూగుచు ననేక పుస్తకాగారములకు నిలయమై వెలయుచుండెననియు, గాలవశమన రాజ్యము పరాధీనమైన కొలఁదినవియన్నియు దర్గతిపాలై విలయము జెందెననియుఁ జరిత్రలవలనఁ దెలియనగును. అతిపవిత్రవంతమై, ప్రాచీనాధునిక కవిపుంగవు లనేకులకుఁ బుట్టినిల్లగు మన దేశమునందు బ్రజలకు జాతీయవిద్యాదాహము హెచ్చుచున్నకొలది నట్టి దాహాతిశయమును విధికృతముగా తీర్చగల గ్రంథాలయోద్యమము పునరుద్ధరింపఁ బడుచున్నది.
మహాశయులారా! భగపదాలయములను నిర్మించి, యందు విగ్రహములను స్థాపించినంత మాత్రమున బ్రయోజనము లేదు. ప్రాణ ప్రతిష్ఠ జేసినఁగాని జనుల నాకరించూ శక్తి యావిగ్రహములకు గలుగదు. ఆయ్యవి పుణ్యక్షేత్రములు గాజాలవు. అవిగ్రహములకు సందర్శనా