థాలయములను నెలకొల్పి సేవాస్వరూపమును బహిరంగముగా వెలువరించుటకు ప్రయత్నములు జరుగుచున్నవి.
మా గ్రంథాలయము 1920 సంవత్సరము అక్టోబర్ 18 వ తేదిన 300 ఆంధ్రగ్రంధములు, 100 ఆంగ్లేయభాషాగ్రంథములతో శ్రీ నండూరు వెంకటాచార్యులు, నూకల రామస్వామిగార్లచే నెలకొల్పబడి తదాది నుండియు గ్రామస్థుల అభిమాన ప్రోత్సాహములచే రు.1000-0-0 లు విలువచేయు గ్రంథరాజనులును, యితర పరికరములును, రు 100-0-0 లు మూలధనమును సముపార్జింపగలిగితిమి. దేశభక్తులును, మాతృభాషానేవకులును అగు మాగ్రామస్థులు ప్రతిదినము యిరువదిమందికి తక్కవకాకుండా చదువరులు వచ్చుచుందురు.
— నూకల రామస్వామి
కార్యదర్శి
భారతవర్ష గ్రంథాలయోద్యమము
సార్వజనిక గ్రంథాలయములు జాతీయవిద్య యొక్క ముఖ్యభాగమను విషయము చాలకాలము క్రిందటనే గ్రహించితిమి. సౌర్వజనిక గ్రంథాలయోద్యమము అన్ని రాష్ట్రములలోను స్వదేశ సంస్థానములలోను, పనిచేయు చున్నది. అందువలన దేశము యొక్క వివిధ భాగములందు పని సలుపుచున్ని గ్రంథాలయోద్యమములకు పరస్పర సంబంధము కలుగ చేయవలయునను కోరిక యెడమట స్వాభావికము. ఈవంక ప్రయత్నములు పెక్కుమార్లు జరిగినవి గాని సార్వజనిక గ్రంథాలయోద్యమమును దేశమంతటను వ్యాపింప చేయుటకుగాను, విస్పష్టమైన సాధనములతోను, ఆదర్శములతోను కూడిన ప్రయత్నము సాగలేదు. యావద్భారత సంఘావశ్యకతను గూర్చి మొదట సూచించినది ప్రభుత్వమువారు. అందుకువారు మన కృతజ్ఞత కెంతయో పాత్రులు.
ఉద్దేశము యెంత మహత్తరమైనను ప్రభుత్వము వారి యజమాన్యము కింద జరుపబడుచున్న పెక్కు ఉద్యమములవలెనే సంకుచిత రాజనీతిచే వారిందును గూర్చి చేసిన ప్రయత్నములవల్ల ఉపయోగము గాన్పించదయ్యె. వారేర్పారచిన మహాసభకు ప్రభుత్వమువారి ప్రతినిధులునూ, మరికొందరు స్వదేశ సంస్థానములనుండి భాండాగారికులునూ మాత్రమే రానర్హులై యుండిరి. ప్రభుత్వమువారి గ్రంథాలయముల నిర్మాణము మాత్రము ఆసభయందు విచారణీయాంశముగ దృష్టియందుంచు కొనిరి. గ్రంథాలయోద్యమమును దేశమిల్లెడల నెట్లు వ్యాపింపచేయుట యను విషయమును ఒక రాష్ట్రీయప్రభుత్వమువారు సూచించినను వదలి వైచి, దేశమంతటనుగల గ్రంథాలయములు అన్యోన్యాశ్రయమును కలిగియుండుట, కోరువారికి అన్ని గ్రంధాలయములును సహాయము చేయుట అను ఈరెండు ముఖ్యనూత్రములను గ్రంధాలయోధ్యమ రంగమందు కృషి సలుపునారు వారికి సూచించినను, యావద్భారత గ్రంథాలయ సంఘము నొక దాని నేర్పరచుట తప్ప మరేమియు అసభవారు చేయజాలరైరి.
ద్వితీయప్రయత్నము ఆంధ్రులది
1919 సం॥ నవంబరు మాసమందు చెన్న పట్టణములో జరిగిన ఆంధ్రగ్రంథాలయ మహాసభతో పాటు, బరోడా సమస్థానములో నములో గ్రంథాలయ శాఖాధ్యక్షులగు శ్రీ కీర్తిశేషులైన, జే.యస్.కుడల్ కారు గారి అధ్యక్షత కింద యావద్భారత గ్రంథాలయ మహాసభను అంధ్రులు జరిపిరి. ఈ మహాసభకు వివిధ రాష్ట్రములనుండియు, స్వదేశసంస్థానములనుండియు, ప్రతినిధులాహ్వానింపబడిరి. ప్రభుత్వమువారు నగరములందుండువారి గ్రంథాలయ ప్రతినిధులను, సంస్థానములవారు వారి ప్రతినిధులను పంపిరి. మహాసభ జయప్రదముగ జరిగినది. దేశమందు గ్రంధాలయవ్యాపకమును గూర్చి యోగ్యతగల పండితులచే వ్యాసములు చదువబడెను. తీర్మానములు గావిఁపబడెను. చేసినపని దినదినాభివృద్ధిగాంచుటకు యాపద్భాగత గ్రంథాలయ సంఘమొక దానిని యేర్పరచవలెనని తీర్మానించిరి, ఈతీర్మానములను అమలులో పెట్టుటకును నియమనిబంధనలను తయారు చేయుటకును ఒక తాత్కాలిక సంఘము నేర్పాటు చేసిరి. నిబంధన పత్రములు తత్సంఘసభ్యులకు పంచి పెట్టబడిన తర్వాత యావద్భారతి సంఘ మేర్పడెను. కాని మనదురదృష్ట వశముచే సంఘాద్యక్షులైన కుడల్ కారు గారు హఠాత్తుగా మరణించుటవలన, యావద్భారత సంఘమువారు ఉద్యమము పట్ల యేమీయు చేయలేదు.
పిమ్మట దర్భంగ సంస్థానపు భాండాగారికులగు ఎస్.సి.గుహ ధాకూరుగారు దేశీయ మహాసభకు ఒక గ్రంథాలయ యుండ వలయుననియు, జాతీయవిద్యయందీ యుద్యమమును ముఖ్యాంతర్భాగముగ చేసి వ్యాపింప జేయ