Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.5 (1924).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాని పఠనమందిరమునకుఁ గాని విచ్చేయుదురు. అందుచే అది బహిరంగ ప్రదేశమునందు గాలి విరివిగా వచ్చుట కనుకూలముగ నుండవలయును. దానిచుట్టును చెట్లను పెంచిన జనప్రియముగ నుండును. గంధము లందరికిని సులభముగ లభించునట్లు చేయవలయును. గంధభాండాగారికుఁడు చదువరుల రుచులను కనిపెట్టి ఎవరికి తగిన గ్రంధములను వారి కందఁ జేయుచుండవలెను. అతఁడు ఉల్లాసవంతుడై మిక్కిలి రసజ్ఞుఁడుగ నుండవలెను. గ్రంథాలయమున కాతడు ప్రాణము. దాని యొక్క పఫలతకు అతఁడే మూలము,

చదువుకొనగలిగిన వారికి గ్రంధములు నిచ్చునంత మాత్రముననే గ్రంథాలయము యొక్క ధర్మము పూతి౯ కాలేదు. దురదృష్టవశముచే మనదేశమునందు చదువుకొనజాలని వారు పురుషుల యందే ఆనేకులు కలరు. అట్టి వారిలో వయస్సు మిరినవారికి చదువు చెప్పుట మిక్కిలి కష్టమగు కార్యముకదా! కాని, వారిని జ్ఞానవంతులుగ జేయుట మనకు చేతనైనపనియు ధర్మమునునై యున్నది. గ్రంథాలయములందే గాక, వారు నివసించుచుండెడు గుడిసెలకు సహితముపోయి గ్రంథములను పత్రికలను జదివి బోధించి వారి జ్ఞాననేత్రము వికసించునట్లు చేయవలెను. అప్పుడె గ్రంథాలయము యొక్క ధర్మము పూర్ణముగ నెరవేఱినదని చెప్పవచ్చును.

స్త్రీలకును పిల్లలకును కావలసిన ఏర్పాటులు మన గ్రంథాలయములయందు లేవు. స్త్రీలు సాంఘికులుగ జేరుటకుమాత్ర మభ్యంతరము లేదు. కాని వారికి కావలసిన ప్రత్యేకమగు ఏర్పాటులు లేనిది లాభ మేమి? శ్రీ మన గృహాధిదేవతగదా! అధా౯ంగలక్ష్మికదా! ఈ లక్ష్మీ దేవతలను మనము నిరసింపఁదగునా? కావున, వారుగూడ అభివృద్ధి నొందుటకు కావలసిన ఏర్పాటులను జేయుట అత్యంతావశ్యకము. స్త్రీలందఱును గాఢాంధకారమున మునిగియున్నప్పుడు మనము చేయవలసినదే మన, చందాలేమియు తీసికొనకుండఁగనే స్త్రీణ చదువుకొనుటకు గ్రంథములను పత్రికలను వారి గృహములకు పంపు నేర్పాటులను ప్రతి గ్రంథాలయమును, ప్రతి పఠనమందిరమును చేయవలసియున్నది. ఈవిషయమున ఆంధ్రదేశమునగల కొన్ని గ్రంథాలయముల వారు పరిశ్రమ చేయుచుండుట మిక్కిలి ప్రశంసనీయము. కావలసిన గ్రంథములను, పత్రికలను, ప్రతిదినమును వారికి అందఁజేయు చుండవలెను. విద్యావతులకు కొందరు స్త్రీల నేర్పాటు చేసి వారిని గృహములకు పంపి, చదువుకొనజాలని స్త్రీలకు వారు చదివి వినిపించునట్లు ఏర్పాటు చేయవలెను.

పిల్లలు కూడ వచ్చుటకు మన గ్రంథాలయములయందు బొత్తిగా ఆకర్షణ సాధనములు లేవు. స్వాభావికముగ జిజ్ఞాసను సంతృప్తి పరచుకొనుటకును ఙ్ఞానపిపాసు దీర్చుకొనుటకును పెద్దలకువలె పిల్లలకును గ్రంథములను పత్రికలును ఆత్యంతావశ్యకములు. పాశ్చాత్య దేశముల యందెల్ల, అందును ముఖ్యముగా అమెరికాదేశమునందు, పిల్లలకు ప్రత్యేక గ్రంధములును, పత్రికలునుగూడ విశేషముగ గలవు. గ్రంథాలయములయఁదు వారు చదువు కొనుటకు ప్రత్యేక మందిరములును, వారికి బోధించుటకు ప్రత్యేక భాండాగారికులును కూడ కలదు. ఆదేశముల యందున్న గ్రంథాలయములలో పిల్లలు చదువుకొనుటకు ఎన్ని సౌకర్యములు కలవో యూహించుటకైన మనకు సాధ్యముకాదు. అట్టి సౌకర్యములు మన దేశము నందు పెద్దలకుకూడ లేవు.

పైన జెప్పినరీతిని జన సామాన్యమునందంతటను విద్య వ్యాపిఁపజేయుటయే గ్రంథాలయము యుక్కా పరమావధి. కావున పాఠశాలలవలన జనులందరికి విద్య యబ్బక పోయినను, గ్రంథాలయోద్యమమువలన విద్యాభివృద్ధియగుటకు అవకాశమున్నది.


ధర్మగ్రంథాలయము

గ్రంథాలయపాలకుడు - సిబ్బంది

బి. హెచ్. మెహతాగారు

(అనువాదకుడు:— యాతగిరి లక్ష్మీ వేంకటరమణ)

గ్రంథాలయ పాలకుని నియమించుటలో ప్రతి గ్రంథాలయమువారును మిక్కలి జాగరూకత వహింపవలెను. వలెను. ఒక పక్షమునకు సంబంధించిన మనుజుని నియమించుటకు ప్రయత్నింపగూడదు. పాలకత్వమనకు తగిన మనుజునే నియమింపవలెను. ఈసూత్రము అన్ని దేశములకును, కాలములకును వర్తించును. అనేక మతములు, జాతులు, ఆచారములు కలిగిన ప్రజాసమూహముతో నిండిన మన హిందూ దేశములోని ధర్మగ్రంథాలయము