ఈ సంవత్సరమునకు యీ క్రింది కార్యనిర్వాహకవర్గ మెన్నుకోబడినది:౼
ముందు సంవత్సరం సభను శ్రీ గోపాలుని రామ లింగయ్యగారు ముప్పాళ్ళకు ఆహ్వానము చేసినందున అంగీకరించడమయినది.
గ్రంథాలయములు
(అరుమకొండ శ్రీరాజరాజని రేంద్రాంధ్ర భాషానిలయ ఏకోనవింశ ద్వార్షికోత్సవ అధ్యక్షులగు
శ్రీ ఎ. వెంకటరమణయ్యగారి ఉపన్యాసమునుండి)
విద్యాభివృద్ధికిఁ బాఠశాలలు మాత్రము చాలవు. ఇతర సాధనము లావశ్యకము. సంఘమును సంస్కరించుటకు సంఘీభావ మేర్పడుటకు సాధనముల నెల్ల మనము సమకూర్పవలెను.
జనులందరును సంఘీభావము కలిగియుండుటకును, అనూన్యపరిచయము నభివృద్ధి చేసికొనుటకును, సమత్వమును సంపూర్ణముగఁ గలిగియుండిన ధర్మపఠనమందిరములు, గ్రంథాలయూలు, వస్తుప్రదర్శనశాలలు మొదలగు వివిధ సంఘములను ఇందుకు సాధనములుగా దేశము నందెల్లెడలను విరివిగా సాపింపవలెను. సకల జనులును ఎచ్చోటికి వివక్షత లేకుండ పోగలుగుదురో అట్టిస్థలమే సార్వజనిక గ్రంథాలయము. విద్యాధిదేవతయగు సరస్వతీదేవికి జాతి, నుత వివక్షతగాని, గొప్పతనము, బీదతనము అను భేదబుద్ధిగాని ఎంతమాత్రమును లేదు. న్యాయవాదికానిండు, ఉపాధ్యాయుఁడు కానిండు, జాగీర్దారుడు కానిఁడు, వర్తకుడు కానిండు, ఇంకను ఎవరైన కానిండు ౼ ఆమె పాదపద్మముల సన్నిధిని మోఁకరించి జ్ఞానామృతమును తనివిదీరాఁ గ్రోలవచ్చును. విజ్ఞానపిపాసను దీర్చుకొను నుద్దేశముతో చనుదెంచు బీదవానితో సరిగా కూర్చుండి చదువుకొనిన తన పరువు తక్కుపగునని భాగ్యవంతు డెంతమాత్రమును భావింపరాదు. ఈ విశాలో దేశములను నెరవేర్చుటకు సంఘములను తగినంత పునాదిగలవిగ స్థాపింపవలెను. గ్రంథములను, పత్రికలను అన్ని తరగతులు జనులయొక్క రుచులను కనిపెట్టి సమకూర్పవలయును. జనుల సాంఘిక జీవనమునందేక భాజనముగ పనిచేయవలెనని తలంచు సంఘము సార్లకమగుటకు ఈవిషయములందు నిష్పాక్షికముగ నుండవలేను. ఈ విధముగ ధర్మగ్రంథాలయములును, పఠనమందిరములును, ఒక గ్రామము యొక్క గాని, పట్టణముయొక్క గాని సర్వజనులకును ఉపయోగించు సాంఘిక ప్రతిష్టాపనలై వెలయవలయును.
జనులందరును ఒక చోట సమావేశమై పరస్పరము భావములను వెల్లడించుకొను ప్రాముఖ్యమును గణుతింపశక్యముకాదు. ఇట్లు సమావేశమగుటవలన మానవుని జీవితమును నడతను అంటియుండు స్వల్పములగు అనేక దుర్గుణములు తొలగును.
గ్రంథాలయము లుంచు స్థలములు మిక్కిలి రంజకములై హృదయాకర్షకములుగు నుండవలెను. సర్వసాధారణముగా జనులు పగలు లంతయు తమ తమ వ్యాపారములను జూచుకొని సాయం సమయమునందు గ్రంథాలయమునకు