నివాసస్తులైరి. అందుచేత ఈ గ్రంథాలయ భవనము స్పెయిను దేశకళానైపుణ్యమును జాటురీతిని గట్టబడినది. ఈగ్రంధాలయము మొదట పదునెనిమిదవ శతాబ్దమున స్థాపింపబడినది. పిమ్మట ౧ూ౭౯ సంవత్సరమున ధర్మగ్రంథాలయముగ జేయబడినది.
ప్రారంభమున సొమ్ము తక్కువగా మండుటచే గ్రంథాలయ భవనమున నాటకము నొకదానిని ప్రదర్శించి, రు.450 లు సంపాదించిరి. ఒక భవనమునందు వెనుక వైపునగల రెండు చిన్న గదులు మాత్రము గ్రంథాలయమునకు ప్రత్యేకింపబడినవి. అప్పుడు పఠనమందిరము లేనేలేదు. గ్రంథాలయము వారమునందు మూడు రోజులు మధ్యాహ్నమునను, ఒకదినము సాయంకాలమునను మాత్రము తెరువబడు చుండెను,
౧౯౦౦ సంవత్సరమున ఆండ్రూ కార్నీజీ గారు ఈ గ్రంధాలయమునకు నాలుగులక్షల రూపాయల విరాశము నియ్యగా, ఇంకను కొంత ఇతర సహాయముతో ప్రస్తుతమున్న సుందరమందిరము నిర్మింపబడినది.
ఈ గ్రంథాలయ చరిత్రను మనదేశమందున్న కొన్ని గ్రంథాలయముల చరిత్రతో పోల్చవచ్చును. ఇప్పుడు గొప్పవనకొను గ్రంథాలయములన్నియు మొదట అల్ఫారంభములతోనే బయలు దేరియుండును. ఈ గ్రంథాలయ మందు తొంబదివేల గ్రంధములు గలవు. ౪౦ వార్తాపత్రికలు, ౨౦ మాసపత్రికలు వచ్చుచున్నవి. ప్రతిదినమును అయిదువందలమంది చదువరులు ఈ గ్రంథాలయము యొక్క ఉపయోగమును పొందుచుండెదరు. ప్రతి దినమును తొమ్మిదివందల పుస్తకములను తమ ఇండ్లకు తీసికొలిపోవు చుండెదరు. ఈ గ్రామమునందున్న జనాభా ఇరవై వేలమంది మాత్రమే.
ఈ గ్రంథాలయమున అపరూపపు గ్రంధములనేకములు కలవు. ప్రత్యేకశాస్త్ర గ్రంథములును విశేషముగా కలవు. గ్రంథభాండాగారికులను తరిబీతు చేయుటకు పాఠశాలనొకదానిని ఈ గ్రంథాలయమువారు నిర్వహించు చున్నారు.
ఆరవ గుంటూరుమండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ
తీర్మానములు
(1) కడచిన సంవత్సరము ప్రజాప్రబోధమునకై విశేషముగా పాటుపడి శ్రీకృష్ణజన్మస్థానమున కేగిన గ్రంథాలయసోదరుల నందరిని ఈ సభవారు అభినందించుచున్నారు.
(2) ముందు సంవత్సరము ఈమండలమున గ్రంథాలయోద్యమమును తీవ్రోత్సాహముతో వ్యాపింపజేయుటకు మండలప్రజల నందరిని ఈ సభవారు హెచ్చరించుచున్నారు.
(3) గ్రంథాలయోద్యమ వ్యాప్తికి మండల కేంద్రగ్రంథాలయ స్థాపన మత్యవసరముగావున అందుకువలయు ప్రయత్నములు చేయుటకు మండల గ్రంథాలయ సంఘమువారిని ఈ సభవారు కోరుచున్నారు.
(4) మండలగ్రంథాలయ సంఘ పక్షమున జరుగుతుండిన కరపత్ర ప్రచురణము ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారు పూనుకొనినందున వారికి మండలపక్షమున అన్నివిధముల సాయము చేయవలెనని ఈ సభవారు తీర్మానించుచున్నారు.
(5) మండలగ్రంథాలయ సంఘము యొక్క కార్య నిర్వహణమునకు శాశ్వతనిధిని సమకూర్చి సంఘపక్షమున నొక సంచారకార్యదర్శిని నిర్వహించుచుండవలెనని ఈసభవారు తీర్మానించుచున్నారు.
(6) మండలములో గ్రంథాలయోద్యమమునకు సంపూర్ణయైన అంగనిర్మాణ మేర్పడుట అవసరము కావున ప్రతి తాలూకాకును ప్రత్యేక తాలూకా గ్రంథాలయ సంఘముల నేర్పరచి ప్రతిసంవత్సరము ఆయా తాలూకా గ్రంథాలయ సభలు జరుపుచుండవలెననియు, దీనిని ఆమలు లోనికి తెచ్చుటకు మండల గ్రంథాలయ సంఘము వారు కృషి సల్పవలెననియు ఈ సభవారు తీర్మానించుచున్నారు.
(7) క్రిందటి గ్రంథాలయసభలో “ఏలపాటల” విషయమై చేసిన తీర్మానానుసారము శ్రీయత ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు చేసినకృషికి వారి నీ సభవారు అభినందించుచు సంపాదింపబడినవాటిని అచ్చొత్తించుటకు తగు ఏర్పాటు చేయుటకు మండల గ్రంథాలయ సంఘము వారిని హెచ్చరించుచున్నారు. ..