ద్వితీయ అఖిలభారత గ్రంథాలయప్రతినిధుల మహాసభ
సంపూర్ణమగు కేంద్రీకరణము ఎప్పటికిని పనికి రాదు. పల్లెటూరి గ్రంథాలయములకును జిల్లా గ్రంథాలయములకును వీలగువరకు తమవ్యక్తిత్వమును స్వేచ్ఛగా ఆభివృద్ధినొందించుటకు తగు సావకాశములుండి తీరవలేరు. భేదములేని సంపూర్ణఐక్యతయందు ఎప్పుడును సౌందర్యము ఉండనేరదు. మనదేశపు మతము యొక్క ముఖ్య సిద్దాంతమిదియేను.
రాష్ట్రీయ గ్రంధాలయసంఘము లన్నిటిని, సమ్మేశనముజేయు ఆఖిలభారత సంఘమొకటి ఉండితీరవలెను. ఇట్టి సంఘము 1919 సంవత్సరమున జరిగిన మదరాసు సభలో నిర్మాణము చేయబడినది. ఇంకెను ఈ సంఘము పని ప్రారంభించలేదు. ఈ సంఘ నిర్మాణముతో, హిందూదేశీయమహాసభతో బాటు గ్రంథాలయోద్యమమునకు గూడ అంగ సౌష్ఠవము సంపూర్ణముగ ఏర్పడుచున్నది. దేశమునందు నలుదిక్కుల స్థాపించబడియున్న గ్రంథాలయములతో పనిజేయవలసివచ్చినప్పుడు కొన్ని కష్టములు తటస్థింపవచ్చును. అయితే నిజమైన ఆనందము కష్టములు నివారణ చేసికొన్నప్పుడు కలుగునుకాని, నివారణ చేసి కొనవలసిన కష్టములు లేనప్పుడు ఎన్నటికిని కలుగ నేరదు. మన దేశమును అన్ని దిక్కులను, అన్ని శాఖలయందును, జాతీయప్రబోధను గలిగియున్నది. రాజకీయ సాంఘిక మతవిషయక స్వేచ్ఛను ప్రజలు మిక్కిలి వాంఛించుచున్నారు. ఈ అన్ని ఉద్యమములకును, మనఉద్యమము విరోధమైన దెన్నటికిని కాదు. ఈ అన్ని ఉద్యమములకును మనఉద్యమము సహాయము చేయునదిగా వర్ధిల్లుచున్నది. ప్రజాసానూన్యమునకు విద్యాదానము చేసి, ప్రజలయందు దట్టముగా వ్యాపించియున్న అజ్ఞానతిమిరమును జ్ఞానతేజస్సుచే తరుమగొట్టుటయే మన పరమప్రాప్యము.
సోదర ప్రతినిధులారా! నా వాంఛలను, నాఉద్దేశ్యములను మీకు ధారాళముగా నివేదించితిని. దేశారాధన తత్పరులగు విద్యాధిక బృందముతో ఈ సభ నిండియున్నది. నేను నివేదించినదానిలో ఎంతవరకు ఆచరణీయమో నిర్ణయించుట మీ విధ్యుక్తధర్మము.
ఆహ్వాన సంఘాధ్యక్షుల యుపన్యాసాంతమున ఆంధ్రభీష్ములనదగు మహారాజశ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు, బొంబాయి నగర వాస్తవ్యులను, శాసన సభాసభ్యులును బారిష్టరును ఆగు ఎమ్.ఆర్.జయకరు గారిని సభకు అధ్యక్షులుగా ఉపపాదించిరి. ఈ ఉపపాదన తగువిధముగా బలపర్చబడిన పిదప అధ్యక్షులు సభ్యుల కరతాళధ్వనులు మిన్నుముట్ట సభాధిపత్యము వహించి అనర్గళవాద్ధోరణితో ఆశువుగా నాఆంగ్లమున నుపన్యసించిరి. అందునుండి యీ క్రింది ముఖ్యాంశములు గ్రహింపబడినవి.
అధ్యక్షుని ఉపన్యాసము
“కడచిన పదిసంవత్సరములు పైకాలమునుండియు ఎక్కువ కట్టుదిట్టములతో దేశాభివృద్ధికై కృషిచేయచున్న ఆంధ్ర గ్రంథాలయోద్యమా భివృద్ధిని స్వయముగా కనుగొను సావకాశము ఇప్పుడు నాకు కలిగినందులకు నేను మిక్కిలి సంతసించుచున్నాను. నేను ఆంధ్ర దేశమును చూచిన కొద్దికాలములోను ఇచ్చటి పల్లెటూళ్లు పురాతనపు సౌందర్యమును వీడలేదనియు, మహారాష్ట్ర దేశమందువలెగాక ఇప్పటికిని పరిశుభ్రముగ నున్నవని నేను కనుగొంటిని. మలేరియా సూక్ష్మజీవులను నాశనము చేయుచున్నామను మిషతో ప్రభుత్వము వారు మహారాష్ట్రదేశమున పురాతనసలో వరములను పూడ్చి వేసిరి. ఇందువలన మా పల్లెటూళ్లలో చెరువులు లేనేలేవు. ఉన్న కొద్దినియైనను మంచిస్థితిలో లేవు. పల్లెటూళ్ల గ్రామకంఠములు నిర్మానుష్యముగను అపరిశుభ్రముగను నున్నవి. ఆంధ్రులు పురాతన సంస్థలను నాశనము నొందించువారుగాక తమ జాతియొక్క వ్యక్తిత్వమును, ధారావాహిక పరిజ్ఞానమును తమ విజ్ఞానమందురు. తమ ప్రతిష్ఠాపనలయందును బాగుగా కాపాడుకొనియున్నారు. ఆంధ్రులజాతియొక్క వ్యక్తిత్వమును కనుగుణ్యముగ ఆంధ్ర గ్రంథాలయోద్యమము కూడ పురాతన సంస్థలయందుత్తమమగు విషయములనెల్ల సంరక్షించుకొనియు నూతన సంస్థలలో అవసరమగువాని నెల్ల సంగ్రహించియు నిర్మాణమైనది. సామాన్యముగా ఆంధ్రగ్రంథాలయము కేవల పుస్తకనిక్షేపమేగాక రాజకీయ, సాంఘిక, నైతిక, మత విషయము మొదలగు జానపదుల ఉత్తమవ్యవస్థలకు సంబంధించిన అన్ని విధములగు కృషియు జరిగెడు కేంద్రస్థానముగా విరాజిల్లుచున్నది. కొన్ని గ్రంథాలయములు పోటీ పరీక్షలు జరిపి ఉత్తీర్ణలగువారికి బహుమతు లొసఁగును. కొన్నిటి యాజమాన్యమున పాఠశాలలు నిర్వహింపబడుచుండును. కొన్ని సంఘములు సాంఘిక సేవ చేయును. ఇప్పుడు భారతదేశము నెదుర్కొన్న సమస్యలలో పల్లెటూళ్లను బాగుపర్చేడి సమస్య అగ్రస్థానము నధిష్ఠించియున్నది. ఈ సమస్యను ఆనుకూలముగా పరిస్కరించుటకు ఆంధ్ర గ్రంథాలయోద్యమము పూని యున్నది. హిందూదేశమంత్రి ఒకరు ఇదివరలో చెప్పినట్లు ఇంతవరకును భారతీయులు వెనుక