కొన్ని జంతువుల పర్గణములు కొన్ని దుర్గణములు చెప్పుటలో చీమ (పిపీలికము) నుద్దేశించి, ముందుగా జాగ్రత్తపడుట మేలనుచు,
గీ. గగనతల మభ్రకలుషంబు గాక మున్నె
బాట బురదల పితిపితిల్ బడకమున్నె
తడిసి కొమరైన పుటలు చెడకమున్నె
నూకనుచ్చును వేకువ నోటగరిచి... ...
వచ్చెదవని దాని జాగ్రతకు పంతసించును. "మదు మక్షికము” కూడ ఇట్టిభావమే తెలుపును, “దోమ” తొండమున్నంతమాత్రాన ఏనుగు కానేరదనియు, ఎగుర గిలిగినమాత్రాన ఖగము గానేరదనియు, నీటి యల్ప సంపత్తులకు పొంగి యన్యుల గుర్తిచంపుట తగవు గాదనియు నీతిధ్వంని ప సంబోధించును. “ఖద్యోతము" మిరుగుడుపురుగ తన మెరుపుని జూసి గర్వపడుచుండక
కె. “ణేక్కలు గలవు దాయని
ణిక్కలతోఁ గలసి మెలసి ణేక్కలతో ఇన్
జక్కగ మెణేసెద ననుచు౯
మిక్కిలిగా మిడిసిపడకు మిరుగుడు పురుగా!
కె. చుక్కలు మించును నిన్నా
చుక్కలఁ జద్రండు మించు సూర్యండతని౯
మిక్కిలిమించును తేజున
నిక్కకు ఖద్యాత! ఘనుడనేనని యపుడు౯|
లోకములో మహిమార్ణవంబున కంతములేదు. ‘అతనికంటే ఘనుడు ఆచంటి మల్లన్న' యను న్యాయము నుద్బోంచుచున్నాడు.
"ఇందిందిరము" లేని గొప్పను చెప్పుకొనుచు తిన సర్యాత్కృష్ట్యమునకు సంతసించుచున్నది. భావమే ప్రధానము కాని, ప్రతిజీవుడు త తనస్థితికే, తనజీవితాశముల సంతసింపవచ్చును. భాగ్యము, దారిద్యము, ఆనందము, దుఃఖము అన్నియు మాససస్థితియందే కలవు. తుమ్మెద,
క. నిలయఁబు జలజవిపినము,
మెలఁగుట శ్రీదేవితోడ మేలాహారం
బలరుల తేనియ విద్దయ
కలగానంనట్టి భాగ్యగరిమయుఁ గల౹
నానాగతులను, ఆణిమామహిమాదిలక్షణములను, శాంత భీకర స్వభావములను సర్వవ్యాప్తియు, సర్వశక్తియు, నివియన్నియు నుండ, నంబుదములను స్వభావ పరోపకారదీక్షలను ప్రశంసించుచున్నాడు. "నవాంబుభి?" దురవిలంబి మోఘనా" యనునట్లు,
తే. గ్రీష్మమైనట్టి గ్రీష్మకాలోష్మమునకు
సాలి తూలెడు నీ జంతుజాలమునకు
జల్లదనమును సౌఖ్యంబు సంతిసంబు
గూర్చుపుణ్యాత్ములెవరు? నీకొలది జలది!
తే. ఏరులై పాణెటె నీదానధార లెల్లఁ
జూడజూడఁగ నీయిల్లు శూశ్యమయ్యె
నొడలు గుల్లయ్యె నప్పుల బడలనయ్యె
లే దనెడుమాట నీయొద్దలేదు జలద!
అని మరియు మేఘుములకును, మయూరములకును గల నిరంతర మైత్రి కెఁతయు సంతసించుచు,
ఆ. నింగిపై సదా మెలంగెడు నీకును
నేలపై నటించు నెమలులకును
నేస్తమే మునీదు నేర్పేము? నినుజూతి
తిరియాడు నెమ్మి వారిదంబ!
పింగిలి లక్ష్మి కాంతము "మరాళకిలములో"
"కలహంపంబుర కేటివెళ్లివెఱ్ఱియు వియద్దంగానదీ వీచికాచల దబ్బతమధుభ్రమర జఁజన్నాడమోదక్రియా లలితంబయ్యు తదీయ భోగపరతల్" కాక్షింపక గానసౌకర్యముప్పు కోవిలనేస్త మాసించుచున్నది. అది జాతిభేదమున స్థితిభేదమున సమరజాలదని యభిప్రాయ పడియున్నాడు. వెంకటశర్మ స్నేహమునకును, స్థితి రూపభేదములకును సంబంధము లేదనియు ఎట్టివారికైన స్నేహముండ వచ్చుననియు తలచుచున్నాడు.
1912లో వెంకటశర్మ "లోకల” యను గీతమాలికను ప్రచురించియున్నాడు. అందు ప్రకృతికిని మనకును రసానుకూల్యత గలిగినపుడే, దానిని యనుభవించగలమని చెప్పియున్నాడు. పరిస్థితియంతయు విషయానుకూలముగ నున్నపుడే యానంద ముదయించునని వీని యూహ.
“ఆందమును జిందు మాకంద బృందమపుడు
కెంజిగురుగమితోడ రాజిల్లు చుండునపుడె
సుస్వరసుధారసముగ్రోలి చొక్కగలము”
ఈ భావము వివిధకవులంను వివిధముగ నగుపడు చున్నది. కాళిదాసు, బంకించాటర్జీ ప్రకృతిమానవాన స్థలతో ననుకంపముప్పు వాని సుఖదుఃఖములు ననుసరించి మాటాననిరి. మిల్టన్ మహాకవి, ఆప్యామరణానంతయు గలిగిన వియోగభారమున నందన సౌందర్యమెల్ల వాసన ట్లూహించేను. వర్డ్సత్తు, విక్టరు హ్యూగోలు, విషయమునకును ప్రకృతికని పరస్పరసంబంధ మేమియు లేదనియు, మనస్థితిగతు లెట్లున్నను, ప్రకృతియు వ్యక్తియు స్వతంత్రరససుర్పీతో బ్రవర్తించుననియు నాభిప్రాయ