మునుపు తా నెందుండిపుట్టేమో యట్టి
దుమ్ములోపలికిని దుఃఖంబడకె
కీర్తింపబడకె శ్లాఘింపగా బడకె
గౌరవిఁపబడకె క్రమ్మరఁబోవు”
వీనిని బోల్చిచూచిన స్కాటు వాక్యముల అనుకరణ మనియే స్పష్టముగును. కాని వెంకటశర్మ గారే వినిని స్వతంత్రించి వ్రాసిన, దేశమాతపై వీరికిగల యనూనాభిమానము స్పష్టమగును.
(3) ఉద్యమముల పట్లను వర్తమాన చరిత్రాంశములను తేటగ నిర్వచిందురు. స్త్రీనే ముందుండుగులిడ పురుషుల వెనుదీయుదురను పద్యరాజమును ధారప్రశంసలో పేర్కొని యున్నాను. ప్రస్తావకపద్యములలో పీఠికాపురాధీశునిగూర్చి నిదర్శనము లుదాహరించితిమి. గాంధీ యుద్యమమునుగూర్చి 1922లో వ్రాసిన పద్యమందుద్యమసారమంతయు విస్వష్టముగా బద్యరూపమన నిర్వచింపబడియున్నది:
మ. కసి యెన్నఁడును బూనరా దెదిరిపైఁ
గారుణ్యమున్ వీడరా
దసురుల్ వోయెడు వేళనైనఁ గపటో
ద్యోగఁబు గారాదు ఏ
సకి లేదంచును వీడగూడదు దయా
సత్యాది శౌచంబు లీ
యసీధారావ్రతిమందు ముఖ్యములు మీ
రవ్వాని బాటింపుడీ.
ఇందీ కవియొక్క నిర్వచనశక్తియు భాషాస్వాధీనత, సంస్కృతలక్షణము లొప్పుచున్నవి.
(4) వెంకటశర్మ సంఘ సంస్కరణమునకు దోడ్పడుటకై, అబలాపిలాసము, పంచమాలాపము, నిమ్నజాత్యుదరణము, బాలవితంతు విలాపము మున్నగు పద్యావళుల కొన్ని వ్రాసియున్నాడు. వీనియందు పదలాలిత్యమున్నను, అల్లికసాంపులున్నను, పద్యరూపమున జేసిన యుపన్యాసములు, శాస్త్రచర్చలు అనదగియున్నవి. వీరిని వ్రాయుటచే, వెంకటశర్మ కావ్యోచితవస్తువిచక్షణలేనివాడని కొంద రభిప్రాయపడిరి.
1907–23 వరకు పత్రికలలో ప్రచురిఁపబడిన పద్యావళులలో రెండువంతులు లేశోద్యమమునకు, సంఘసంస్కరణమునకు, వర్తమాన చెరితాంశములకు, ఉద్యమప్రస్తావనకు, నాయకస్తవమునకు, మృతస్మృతికిని వినియోగింపబడియున్నవి. సుమారు 200 కవు లీయపార పద్యసముచ్చయము నేర్పరచిరి. ఇది యాంధ్రకవిశ్వమున జేర్పదగినదా? లేదా? అనువిచారణ సవిస్తరముగ జేసి యున్నాము. పదముల సొంపుచేగాని, వృత్తకల్పనచేగాన్ని ధారాసారళ్యముగాని, బాహ్యలక్షణముల వేలిచేగాని కవిత్వ మేర్పడ నేరదని నిశ్చయించితిమి. సద్వర్ణన ముండవలెను. ఈ వర్ణనము భావము నుద్దీపించుచు, రసోదయ మేర్పరచవలెను. రసభావములు, వర్ణింపబడిన విషయమునకు తాత్కాలికముగ జెఁదినను చదువరుల అనుభవము లోనివై విశాలప్రపంచపు సామాన్య అనుభవములలో చేరియందరిని ఆనందపరచ గల్గియుండవలెను. ఇట్టి సభావద్యోతకంబగు వర్ణనముగాని, యూహలు గాని ముఖ్యాంశములై యుండ విద్యపద్య విబేదము లేర్పరచు బాహ్యకావ్యలకుణములు గొడవులై యువకరింప సత్కవిత్యమేర్పడును. అనగా కవిత్వాంశ్రమగునా, కాదా అనునది భూతవర్తమా నాది కాలవిక్షణచే నేర్పడదు. పాత్ర విచక్షణచే నేర్పడదు. వానిని వర్ణించుటయందు తదితరముగ స్ఫురించున ప్రస్తుతభావ సంస్ఫూర్తిని పట్టియుండునని తేల్చితిమి. ధ్వనివ్యంగ్యము కావ్యలక్షణము. అయితే, వర్తమానాభివర్ణనము నిత్యానుభవమున జేరినదగుటచే నీయది కళలయెడ ప్రజలకుఁడవలసిన గౌరపమును ఏర్పరజాలనియు, నాటక పాత్రములు ఈనాటి దుస్తుల గట్టి యాడినచో పేలవముగనుండి యాకర్షింపదనియు, కాలమందును దేశమందును ఆచారములందును వేషమందును ప్రస్తుతస్థితికి దూరమైన గాని కళాంశమునందు ఆదరము లక్ష్యము కుదురవనియు, కళాకావ్య నాటకముల విమర్శకులు కొందరభిప్రాయపడు చున్నారు. ఇందుచేతనే సామాన్యజీవిత పద్ధతులకు భిన్నమైన కవిసమయములు, వృత్తములు, నాటకాభినయములు అవశ్యమయినవి. ఈ కారణమున ఎంతో ఎక్కువ రసభావోద్రేకము గల్పించు పట్లతప్ప, మిగిలిన వర్ధమానవిషయములందును, ఉద్యమప్రచారమందును, సంఘ సంస్కణాశులందును, కావ్యవైఖరుల నుపయోగింపకూడదని తేలుచున్నది. కాని నా కీపట్టున నొక శంకకలిగినది. కవి ఏవిషయమున రసావేశావస్దజెంది, కరుణాను కఁపితుడై వీరభావమున విస్తరించునౌ, ఆసమయమున నాతను పల్కుమాటలే కావ్యములగునని తొల్లి చెప్పియున్నాము. వాల్మీకి చచ్చినపిట్టకై వగచి తొఁటి పద్యము నుచ్చరించినచో, లక్షణవిజ్ఙాత లందరిని గగ్గాని గారవించినచో, వృతజీవియై, నిరంతర కష్టపరంపరల వేగుచుండెడి బాలవితంతువులయెడలను, సాంఘిక దురాచారదుర్విదగ్గులై దుర్భరపాతిత్య ననుభవించు పంచములపట్లను, నిండు మనంబుతో స్వార్థరహితముగ వెలువడు ప్రేమలహరీపద్యంబు లాదరిణీ యంబులు గనెరవా? సంఘము మార్పునొప్పక .....