Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.4 (1924).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈక్లబ్బు లన్ని టీయందు 'విమర్శనా సంఘం' ముండును. అందువలన ఇయ్యది గ్రంథాలయమునకు చాల తోడ్పాటొ సఁగుచు ఎక్కువమందిని చదువునట్లు చేయుటకు తోడ్పడుచున్నది. అప్పుడప్పుడు ఈ "క్లబ్బు" లఁదు పోటీలు కల్గి ఎక్కువ గ్రంథములుగల గ్రంథాలయమునకు బహుమతులో సంగబడుటచే ఎక్కువ ప్రోత్సాహము కల్గుచున్నది.

అమితబీదలైన పనివారికి ఇంకను చులకనగ నుండు నట్లు చేయుట అవసరము, వారు "క్లబ్బులకు” చందా చెల్లింపలేదు. "సంచారగ్రంథాలయములకు " రుసుము చెల్లింపలేరు. కాని వారు సారాయి దుకాణములకు వెళ్ళుట, డబ్బు ఖ్చడుట, కాలము వృథాచేయుట సామాన్యము. కనుక ఆదుకాణములందు “పత్రికలును, పుస్తకములు” గల భాగ మేర్పరచుట మంచిదని కనిపెట్టబడినది. అప్పుడే కొన్ని దుకాణములందు "గ్రంధాలయములు" బయలుదేరినవి. కొన్నిటిని స్వయముగా చూచిసమీదట ఉపయోగ కారిగా నున్నవని తట్టినది.

"పనివారి విద్యాసంఘము ” వారు సంచార గ్రంథాలయము నేర్పరచి తమ విద్యార్థులకు పుస్తకముల నప్పిచ్చుచున్నారు.

ఇవియన్నియు నిట్లు సాధ్యమగుటకు కారణమేమి? పోస్టు చాల చౌకగనుండి ప్రతి గ్రామమునకు అనుదినము పోస్టుండి ప్రతివారు చదువుకొన్నవారై యుండుటవలన త్వరలో పత్తనమునుండి గ్రంధము నప్పుగా తెప్పించి చదివి తిరిగిపంపుటకు పలనుపడుచున్నది. సారాయిదుకాణములో గ్రంధాలయము ముండుటవలన లాభము హెచ్చగానున్నది. అన్నిటికంటే డంబముగా యఱవక వ్యాపారబుద్దితో లాభముగనున్న పరులనెల్ల చేయుస్వభావము తోడెనది. ఇంతవరకు వివిధతరగతి గ్రంథాలయ ములగూర్చి క్లుప్తముగ జూచితిమి. కాని పరిపాలన మెట్లున్నది? సంచార గ్రంథాలయములఁదు చదువరుల కేమి యధికారము లేదు. క్లబ్ గ్రంధాలయములందు సభ్యులందరు సర్వాధికారులై యున్నారు.

సంస్కారలు ఈగ్రంథాలయము లన్నిటి పైనను ప్రభుత్వయాజమాన్యముండుట గత్యమని వీనికి మునిసిపలు గ్రంథాలయములకు సఖ్యత పరస్పర సహాయముండు టవపరమనియు సంచారగ్రం థాలయములను లాభముకై యేర్పరచు వర్తకుల రూపుమాపి వానినే స్థానిక ప్రభుత్వము స్థాపించుట మేలనియు “పత్రికాలయ గ్రంథాలయములకు హెచ్చుసాయ మిచ్చుట" లాభ మరియు పల్కు చున్నారు.

మన దేశమునందున్నట్లు ప్రత్యేక గ్రంథాలయోద్యమమిచ్చటలేదు. అందువలన పరదేశస్థులు గ్రంథాలయము లిచ్చట తక్కువస్థానమునం దున్నవని తలంచున్నారు. కాని వారు భ్రమపడుచున్నారు. గ్రంథాలయము లేని యూరురు, పత్తనము లేనేలేదు. పైగా గ్రంథాలయ ప్రభుత్వమనే యుపయోగకరమగు విషయసులు బయల్పరచుచున్నది. స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధు లనేకప్రదేశములందు నా కెంతియో శ్రద్ధతో, గ్రంథాలయముల గూర్చిచూప, అనేక విషయముల గ్రహీంప వీలైనది.

నేను మనదేశమునందున్నప్పుడు గ్రంథాలయోద్యమమునం దెక్కవ శ్రద్ధిడి కొన్ని గ్రంథాలయముల స్థాపించు వారితో పని చేసియుంటి. ఇచ్చట చూచినమీదట తలంచునదియేమి? ప్రధాన ప్రభుత్వము సంచార గ్రంథాలయముల నేర్పరచుట - స్థానిక ప్రభుత్వ సంస్థణ “గ్రంథాలయముల వస్తు, పదర్శనశాలల" నేర్పరచుట - పత్రికాలయములు సంచార గ్రంధాలయముల నేర్పరచుట-లాభకరమని ఇప్పుడున్న గ్రంథాలయములపై ప్రభుత్వము సూపరివిజను పెట్టి ధనసాయ మిచ్చుట మఖ్యము. కాని పరిపాలన యందు సభ్యులకు సర్వస్వతంత్ర ముండుటావసరము.

-జి. రంగనాయకులు,

ఆక్సఫర్డు నగరము