జూపెట్టగలిగిన దేశములలో ఇంగ్లండు అగ్రగణ్యస్థానమాక్రమించుచున్నది. మన ప్రధాన విషయమునకు పోవుటకు పూర్వము ఈ “సూత్ర" రహస్యమును గమనించు టత్యవసరము. కనుక ఇంతిదనుక విస్తరముగ వ్రాయవలసి వచ్చెను.
ఇంగ్లండునందు నూటికి దెబ్బదిమందికంటే హెచ్చుగా ప్రజలు పట్టణనములందు నివసించుచున్నారు. ప్రతి పట్టణము అచ్చటి "మునిసిపాలిటి" వలన పరిపాలింపబడుచున్నది. పట్టణవాసులందరును ఓటరులై స్త్రీ, పురుషులు సభ్యులగుటకు యోగ్యవైయున్నారు. ఇట్టి ప్రజాప్రభుత్వము క్రింద ప్రతిపట్టణము తన “మునిసిపాలిటీని” కల్గియున్నది.
ప్రతి "మునిసిపాలిటి" తన పట్టణమునందు విస్తీర్ణము సనుసరించి ప్రతివార్డునందు ఒక్క గ్రంథాలయమును స్థాపించియున్నది. గొప్ప పట్టణమగుచో వార్డునకు రెండు మూడు గ్రంథాలయములుండును. ప్రథానగ్రంథాలయము మరొక్కటియుండును. సాధారణముగా వార్డు గ్రంథాలయము లన్నియు ప్రధాన గ్రంథాలయశాఖలై యుండి చదువరులయిష్టము ననుసరించి ప్రతివారము కొన్ని గ్రంధముల ప్రధాన గ్రంథాలయము నుండి తెప్పించు చుండును. ప్రథాన గ్రంథాలయమునకు అనుబంధముగ "మ్యూజియము” లేక “సర్వవస్తు పదర్శన శాల” యేర్పరుపబడి యుండును. ఇందువలన ప్రజలు గ్రంథముల నుండియే కాక “మ్యూజియము” నుండియు ఆనేక విషయముల తీర్చుకొనుటకు సాధ్యముమగు చున్నది. ఈ రెండు భాగములకు తోడుగా ప్రత్యేకముగ "వార్తాపత్రికాశాఖ" యుండను. ఈశాఖయఁదు అన్నిపత్రికలు అందరికి అందచేయబడును.
వార్తాపత్రికల చదువుటకు "సర్వవస్తు ప్రదర్శన శాల" ను చూచుటకు, ఏ "రుసుము" ఏ "నియమము" లేక ఎల్లరు పోవచ్చును. కాని గ్రంధముల నప్పు తెచ్చుటకు ముందు ప్రతిపట్టణ వాసియు దరఖాస్తు చేసి గ్రంథాలయాధి కారి యనుమతి ముందుగా పొందవలయును. అంతట గ్రంథుముల నుచితముగా “నప్పు” తెచ్చుకొనుటకు సాధ్యమగును. ప్రతి చదువరి తనకు తోచిన క్రొత్త "గ్రంధము” ను తెప్పించ వలయునని సలహాయివ్వవచ్చును.
ఇట్టి “గ్రంథాలయములు" పరిపాలించు వారెవరు? "మునిసిపాలిటి" ప్రభుత్వము, "మునిసిపాలిటి" గ్రంథాలయ కమిటీ నొక్క దాని నేర్పరచి దానియందు "మునిసిపాలిటి" సభ్యులు మెంబరులుగా నియమింపబడుదురు. ఈకమిటి " గ్రంథాలయముల" పరిపాలించుట, “సలహా చేయబడిన గ్రంథముల” తెప్పించవలయునా లేదా యని చర్చించుట —— యను పనులు నెరవేర్చి ప్రజాభిప్రాయము "మునిసిపాలిటి" ప్రభుత్వమునందు తెలిసి కార్యరూపమునఁ బెట్టుమందురు. ఇచ్చిట పట్టణ వారులందరు చదువరులనియు వారిందరు మునిసిపల్ సభ్యుల నెన్నుకొనుటలో గ్రంథాలయ విషయముల నాలోచ్చితురనియు అందువలన “"మునిసిపాలిటి" ప్రభుత్వము "గ్రంథాలయముగూర్చి ప్రజాభిప్రాయసుకు నెరవేర్చుననిము తలంపబడుచున్నది.
సర్కార్ లీపద్ధతితో సంతృప్తిపడుట లేదు. ఈ విధమైన “మధ్యస్థపు ప్రభుత్వము” సరియగునది కాదనియు ఎల్లప్పుడు చదువుచున్న చదువరుల చేతనే సరాసరి "గ్రంథాలయ పరిపాలనాధికారులు" నేర్చుకొనుట స్వరాజ్యసూత్రానుసారముగ నుండుననియు పల్కుచున్నారు. కాని ప్రజలందరు గ్రంథాలయమునకు ధనమిచ్చునప్పుడు చదువరులు మాత్రమే ఓటరులైన ధనము గూర్చి విచారించువారు లేరనియు అందరిని ఓటరుల చేసిన అశ్రద్ధ ఎన్నికలందు చూపి నిరుపయోగల నెన్నుకొని గ్రంథాలయముల పాడుచేసెదరనియు అనుభజ్ఞులు తెల్పుచున్నారు.
ఇట్లు ప్రతి పట్టణము నందు "స్థానిక ప్రభుత్వ గ్రంథాలయములు, సర్వవస్తుప్రదర్శన శాల" లుండుటయే కాక "సంచార గ్రంథాలయములు” ప్రత్యేకముగ నున్నవి. పెద్ద “పత్రికాలయములకు” ప్రతి గ్రంథకర్త తనగ్రంధముల విమర్శనకు నుచితముగా పంపును. కాన “పత్రికాలయములకు” నందు "గొప్ప గ్రంథాలయము" లేర్పడుచుండును. కొంత రుసుము చెల్లించుచో ఎల్ల ప్రదేశములవారు సభ్యులై ఈ గ్రంధములందు జదువ సాధ్యమగును.
మతిప్రచారకులు తమ మతమున కుపయోగించు గ్రంధములతో "సంచార గ్రంథాలయముల" స్థాపించి ప్రజలకు సాయము చేయుదురు. ప్రజలయందు విద్యాభిలాష హెచ్చుచుండుటచే కొందరు “వ్యాపారులు" గొప్ప గ్రంథాలయముల స్థాపించి రుసుముపై సభ్యుల జేర్చు కొని వారందరికి గ్రంథముల నప్పిచ్చుచున్నారు. ఈ వ్యాపారము క్రమముగా హెచ్చుచున్నది.
ఇంగ్లీషువారు వారి “క్లబ్బు" లను అనగా "సాంఘిక సంపర్కముపై యేర్పడు సంఘములను హెచ్చుగా ప్రేమింతును. సాధారణముగా ప్రతివాడు. ఏదో యొక "క్లబ్బు” నందు సభ్యుడై యుండుడు. ప్రతి "క్లబ్బు” నందు ఒక్క గ్రంథాలయము తప్పక యుండును, ఇందు మూలనున చదువరులకు పొత్తములు లభించుట చులకన.