గ్రంధము మెడకూ పూసుకుని పసుపూ కుంఖం రాచుకొని కంటికి కాటుక పెటుకొని ఆడవె ఆడ వె అమ్మఢీ! తెలలో పువ్వులు తురుముకొని తిలకము నుదటా దిద్దుకొని బుగ్గను చుక్కా పెట్టుకొని ఆడవె ఆడవె అమ్మణ్ణి! జ ట ల గ్రంథాలయ సర్వస్వము • చేతికి గొలుసులు పెట్టుకొని కాళ్లకు X స్థలు కట్టుకొని పువ్వులచొక్కా తొడుగుకొ" "ని ఆడవె ఆడవే అమ్మణీ! అమ్మణ్ణి. m ట నోట్లో బూరా పెట్టుకొని చేతో ఢాక్కా పట్టుకొని దండలు మెడలో వేసుకొని ఆడవే ఆడవే అమ్మణీ! గాజుల చేతులు తట్టుతును చిటపట అడుగులు తొక్కుతును బోసినవ్వులూ నవ్వుతును ఆడ వె ఆడవె అమ్మణీ! w ముదులం కురిసెడు నీయాటా త్రిభువనమోహనకరమమ్మా! సూర్య చంద్రులూ ఉండేదాకా ఆడవె ఆడవె అమ్మణీ! చింతా దీక్షితులు, బి. ఏ., బి. ఎల్.
ఆంగ్లేయులు - గ్రంథాలయోద్యమము
మన దేశమునం దింతవరకు బరోడా రాజ్యమునందు తప్ప, గ్రంథాలయోద్యమము ప్రజలచే సృష్టింపబడి, పోషింపబడి, ప్రోద్బల పరుపబడుచున్నది. ప్రతి “సంస్థ” యు ప్రభుత్వమునుండియే వచ్చిన, ప్రజలస్వతంత్ర వ్యక్తిత్వము సృష్టి నైపుణ్యత విజృంభించుటకు వీలుండదు. పైనుండివచ్చిన “సంస్థ" లెచ్చటను ఏకాలము నందును ప్రజల సహకారము ప్రజల బాధ్యతాయుత వ్యక్తిత్వమును కల్గియుండనిచో, జనుల కెక్కువ లాభకారులు కాకుఁడుటయేకాక, అనేక కష్టములకు దుర్మార్గములకు కారణభూతులై యున్నవి. ఎక్కువ దూరము పోకినే మనకీ సిద్ధాంతియు నిరూపించుటకు జర్మనీ దేశము సాక్ష్యమిచ్చుచున్నది. అచ్చట ప్రతి సంస్థయ ప్రభుత్వముచే స్థాపితమగుట, ప్రతికార్యము ప్రభుత్వము చేయుట, అందువలన ప్రజలు తమ వ్యక్తిత్వమును మరచి ఎల్లవిషయములకు ఉద్యోగుల సాయమపేక్షంచుట జరుగుటవలన అనేక కష్టములు నండుటయు, ప్రజల స్వతంత్రస్వభావము మరుగుపడుటయు, తద్వారా యుద్దాదిపర్యపసానములు కల్గుట సంభవించేను.
కాని ప్రభుత్వము దుర్మార్గమైనది. ప్రభుత్వము చేనే “సంస్థ” ను పరీక్షింపచేయరాదు. అంతయు ప్రజలనుండియే రావలయుననుటయు మంచిది కాదు. ప్రభుత్వముచే ప్రజాధీనమైనంతవరకు ప్రజల సంయుక్తి వ్యక్తిత్వమును తెల్పునంతవరకు అయ్యది ఎల్లవిషయములందు అవసరమై లాభకరమై యున్నది. ప్రభుత్వము ఒక “ సంస్థ” గదా! అన్ని సంస్థలకంటే అయ్యది "పెద్దది”. అందువలన తదితర “సంస్థలు” చేయలేని కార్యముల కొన్నిటినయ్యది చేయగలదు. ఇతర సంస్థలకు సాయ మనేక విధులు చేయగలదు. కాని ప్రజాపరిపాలన ప్రజల శక్తి సామర్థ్యముల ప్రయోజకత్వము, చిన్ని చిన్ని “సంస్థల" యందు కన్పడునట్లు ప్రభుత్వమునందు కన్పడ జాలవు కనుక అంతవరకు అనగా ప్రజల వ్యక్తిత్త్వమును ప్రకటించునంతవరకు, ప్రజలకు స్వరాజ్యశక్తి నొసంగుటలో యుపాధ్యాయిగా నుండువరకు ప్రత్యేక "సంస్ట" యెక్కువ యుపయోగకారి.
కాన ప్రభుత్వయాజమాన్యము క్రింద ప్రభుత్వ సాయముతో స్వతంత్రముగల ప్రత్యేక “సంస్థలు” ప్రజల సహకారమువలన యేర్పడుట, తద్వారా అన్ని పనులు నెరవేరుట ఎల్లప్పుడు ప్రజల భావిభాగ్యమునకు అవసరము.
ఇట్టి రెండు విధములైన "సంస్థలను" పరస్పర మైత్రితో మెలంగునట్లుచేసి స్వపరిపాలనాసూత్రము నెల్లసంస్థలయం దుపయోగించి, ప్రజల గొప్పతనమును