కాలము మనముపొందు యభివృద్ధి మేడిపండువంటిదై అనిష్టమునకు కారణమగును గాన పూర్వయొకప్పుడు విద్యాతిలకములై, పాతివ్రత్యము, మమోనిగ్రహము, భక్తి, సచ్ఛీలము. శౌర్యము, గాంభీర్యము, ఆత్మసమర్పణశక్తి, శాంతి మొదలగు గుణసంప్రదాయ ప్రవర్తనచే ప్రపంచాదర్శప్రాయమైన అద్వితీయచరిత్రను గడించి మనదేశమునుగు, జాతికి, మహోత్కృష్టకీర్తిని గడించి కాలయోగముచే అజ్ఞానదశలోనున్న స్త్రీజాతి తిరిగి పూర్వదశకు రావలెనన్న, పూర్వము ప్రపంచాదర్శపాయలై విరాజిల్లే మృతజీవినులైన, సీత, సావిత్రి, దమయంతి, ద్రౌపది మొదలగు మహాపతివ్రతలచరిత్రల పఠనీయమే ముఖ్యాధారమని మనవిచేయుచున్నారు. అట్టి చరిత్ర జ్ఞానము స్త్రీలోకము పొందుటకు గ్రంథాలయములు తప్ప వేరొకసాధనము గానిప్పంపదు.
జనసామాన్య విజ్ఞానాభివృద్ధి
ప్రపంచమునందు సమస్తవిషయములలోను అభివృద్ధిజెంది నవనాగరికాగ్రగణ్యములని ప్రసిద్ధిజెందిన జర్మనీ. అమెరికా, మొదలగు పాశ్చాత్యదేశములు కూడ గ్రంథాలయోద్యమమువలనే సమస్తవిషయవిజ్ఞానము నొందినట్లును జనసామాన్యముయొక్క విజ్ఞానాభివృద్దికికూడ గ్రంథాలయములే ఎక్కువ ఉపయోగపడినట్లును కన్పట్టుతున్నది. ప్రస్తుత కాలమనందు మన దేశమొత్తములో, బరోడాదేశప్రజలు, ప్రపంచజ్ఞానానుభవముగలవారై విజ్ఞానదాయకులై యుండుటకు కారణము ప్రజాప్రభున్యాయముతో ప్రజల బిడ్డవోలె పరిగణించుచు ప్రజలు విజ్ఞానవంతులైనపుడే తమ రాజరికము జానదాయమై కీర్తినొందునని గ్రహించి వారు నెలకొల్పిన గ్రంథాలయోద్యమమే ముఖ్యధారమై యున్నది. అయితే యీ ఉద్యమము మహనీయులగు మహారాజాగారి పోషణ కలిగియుండుటచే ఎక్కవ అభివృద్ధినొంది యున్నదని చెప్పుటయందతిశయోక్తి లేదు. గ్రంథాలయోద్యమము నందు ప్రస్తుతము యీ దేశమునందు బరోడారాజ్యమే ఆదర్శప్రాయమైయున్నది.
గ్రంథాలయోద్యమము మనదేశమునకు క్రొత్తదిగాదు
ఇట్టి గ్రంథాలయోధ్యమము మనదేశమున క్రొత్తదిగాక అనేకశతాబ్దముల క్రిందటనే ప్రారంభింపబడి ఉత్కృష్టత గాంచునటుల 17 వ శతాబ్దమున తంజావూరు నందు ఆంధులచే స్థాపింపబడి 8 లక్షల గ్రంథుములతో విరాజిల్లుచున్న గ్రంథాలయము వలనను 19వ శతాబ్ద మున బ్రౌ౯ దొరగారి ప్రోత్సాహముచే దొరతనమువారిచే చెన్నపురియందు స్థాపింపపడిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమువలనను విశదమగును. అయితే సదరు గ్రంథాలయములు ఆంధ్ర దేశమునకు వెలుపలనుండుటచే సమస్థ ఆంధ్రజయోపయోగము కాకుండుట విచారకరము.
ఈ కాలమునందుగూడ సవీన గ్రంథాలయోద్యమ స్థాపనకు ప్రాతిపదిక మన ఆంధ్రదేశమై యీభీమవరం తాలూకాయని చెప్పుకొనుటకు కుముదవల్లి గ్రామములో 1897 సం॥ స్థాపింపబడి విచ్ఛిన్నమునోంద కుండ నేటివరకు శ్రీ వీరేశలింగకవిసమాజమను పేరుతో శ్రీయుతులు భూపతిరాజు తిరుపతి రాజుగారు మొదలు కార్యనిర్వాహకుల కృషిచే గృహము శాశ్వతముగా జరుగుటకు వలయుధనముతో యభివృద్ధినొందియున్న గ్రంథాలయమును 1900 సం॥రమునందు శ్రీయుత నాళం కృష్ణారావుగారు మొదలగువారిచే రాజమహేంద్రవర పట్టణమున శ్రీ వీరేశలింగముగారి పేరున స్థాపింపబడి కారణా తరములచే నేడు గౌతమీ గ్రంథాలయముని వాడబడుచున్న గ్రంథాలయును నిదర్శనములై యున్నవి. ఈ సందర్భమున వారు చేసిన కార్యదీక్షాపరత్వముతో కూడిన దేశసేవకు శ్రీయుతులు భూపతిరాజు తిరుపతి రాజుగారు వందనీయులై ఆంధ్ర దేశమునకు ఆదర్శప్రాయులై యున్నరు.
నూతన అభివృద్ధి
1911-14 సం॥ నుండియు వివిధ ప్రదేశముల ధర్మగ్రంథాలయస్థాపన కాబడి అవి అభివృద్ధి నొందుటకును శాశ్వతుగా నిలుచుటకును తగుకృషి చేయుటకై ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము స్థాపింపపడి అనేక కష్టనష్టములకొనర్చి త్యాగదీక్షలతో దేశసేవానిరతులై శ్రీ ముత అయ్యంకి వెంకట రమణయ్యపంతులు“గారు పాటుబడుటచే 1920 సం॥ వరకు గొప్పయభివృద్ధి అయినపని జరిగింది. ఈ విషయమునందు పంతులుగా రాంధ్ర దేశకృతజ్ఞతకు పాత్రులును, వందనీయులును అయియున్నారు.
దర్మిలారు వెంకటరమణయ్య పంతులు గాలికి కలిగిన యిబ్బదులచేతను, ఆరోగ్యవిహీనముచేతను, యీ దేశములోకల రాజీకీయ సంచలనములో ప్రజలు మునిగి యుండుటచేతను, పట్టణములయందు పనిజరుగుచునన్నను పల్లెటూడ్లయందు గ్రంథాలయోద్యమము నామమాత్రాదశిష్టమై యుండుటకడు విచారకరము. దేశాభివృద్ధికి