పశ్చిమ గోదావరిమండల గ్రంథాలయ సభ
౧౯౨౩ సం౹ ఏప్రియల్ నెల ౧౯-వ తేది మధ్యాహ్నమున భీరువరంగ్రామమున ప్రథమ పశ్చిమ గోదావరిమండల గ్రంథాలయ ప్రతినిధుల సభ సమావేశమైనది. కోపల్లె, సరిపల్లె, గునుపూడి, కుముదవల్లి, ఆకువీడు, నిడమర్రు, రాయకుదురు, పోలమూరు, వీరవాసరం, గోపవరం, కొవ్వూరు, పాలకొల్లు, నర్సాపురం మున్నగు గ్రామముల గ్రంథాలయములనుండి ప్రతినిధులు విచ్చేసిరి.
ప్రధమమున దైవప్రార్థన జరిగిన పిమ్మట ఆహ్వాన సంఘాధ్యక్షులగు నిడమర్తి లక్ష్మీనారాయణగారు ఈ క్రింద వివరించిన ప్రకారము స్వాగతోపన్యాసమును జదివిరి.
ఆహ్వాన సంఘాధ్యక్షుని యుపన్యాసము
ఈ గ్రంథాలయ మహాజనసభను యీపురంబునకు ఆహ్వానించి ఈసభ జయప్రదముగా జరుపుటకు ఆనేక వ్యయప్రయాసల కోర్చి కార్యనిర్వహణ మొచ్చినట్టియు, గ్రంథాలయోద్యభివృద్ధికి పాటుబడి కార్యదీక్షతో పని చేసినట్టియు నా సోదర సభ్యులలో అందు ముఖ్యమగ గ్రంథాలయోద్యమమునందు స్వార్థత్యాగము, కార్యదీక్ష, అంతర్ముఖత్వము కలిగి చిరకాలము అనగా, 26 సం౹ లనుండి ఎడతెగని కార్య దీక్షతో విచ్ఛిత్తులేకుండగా పనిచేసి యీతాలూకా ప్రజలకేగాక యిక్కాలములందు ఆంధ్రదేశమునకు యీ ఉద్యమము నందు ఆదర్శప్రాయులని కీర్తించతగిన శ్రీయుతులు భూపతిరాజు తీరుపతిరాజుగారు ఉండగా ఏవిధమైన కార్యము చేయక నిర్ధరకుడనైయున్న నేను యీస్థానమున గూర్చుండి యేమేమో చెప్పుటకు మనసొప్పక యిక్కార్యమునకు శ్రీ తిరుపతిరాజుగారే తగియుందురు గాని నేను అనర్హుడనని మనవిచేసినప్పటికి నాయందుగల అవ్యాజవాత్సల్యముచే నా సోదర సభ్యులు నన్నే నియమించినందున యిందుల కంగీకరించితిని.
గ్రంథాలయములు — (సరస్వతీ భవనములు)
భగవంతునిచే సృజింపబడు సమస్తజీవరాసులకు ఆహార, నిద్ర, మైధున భాషలు, సమాసమైనప్పటికి అందు మానవజాతి అగ్రగణ్యముగా పరిగణింపబడుటకు నాధారమైన యుక్త ఆయుక్త వివేచనాజ్ఞానము పొందుటకు కారణమైన జాతీయవిద్యకు నిలయములైన గ్రంథరాజముల యొక్క పఠనీయముచే మానవ ఐహిక ఆధ్యాత్మిక విజ్ఞానము నభివృద్ధినొందిచు సరస్వతీనిలయభవనములే గ్రంథాలయము లనంబరగు. దేశాభివృద్ధికి అవసరమగు సమస్త ఉద్యమములలో గ్రంథాలయోద్యమము పునాదియనియును, అట్టిపునాది దిట్టము లేనినాడు ఏయుద్యమము సభివృద్ధినొందుట కష్టమనియు మనవి చేయుచున్నాను.
జాతీయవిద్య
ఇప్పటి మన ప్రభుత్వాధీన నియమితివిద్య అన్యభాషా సాంప్రదాయ ప్రాధాన్యమై సామాన్యముగ మూడువంతులు మన శాస్త్రములయందు నీచముగా పేర్కొనబడిన సేవకావృత్తికిమాత్రమే ఉపయోగపడు చున్నది. కాని జాతీయవిద్యోద్బోధకమైన గుణసంప్రదాయము కలిగి మానవ ఆత్మాభివృద్ధికి అవసరమగు స్వాతంత్య్ర ప్రియత్వము, ఆత్మగౌరవము, నీతి, సత్యము, ధర్మము, స్వార్థత్యాగము, జాతీయత మొదలగు సద్గుణోద్బోధ చేసి దేశాభినృద్దికి తోడ్పడకపోవుటయేగాక, ఆత్మగౌరవమును. జాతీయతను నశింపచేయుటచే అట్టి జాతీయ విద్యాభివృద్ధికి గ్రంథాలయములే ముఖ్యాధారములని చెప్పనొప్పు.
కార్యనిర్వహణము
మన దురదృష్టముచే మన దేశమునుండి తొలిగిపోయిన ఐకమత్యము, దేశభక్తి, కార్యనిర్వహణశక్తి, ప్రపంచజ్ఞానానుభవములు, రాజకీయ జానము, తిరిగి అలవడి దేశము నబివృద్ధినొందించుటకు గ్రంథాలయములే ఎక్కువగా ఉపయోగపడగలవని 1911 సంవత్సరమునుండి 1920 సంవత్సరమువరకు దెశీయమహాజనసభ వారు శానించిన కార్యములు చేయుటలోను జాతీయవిద్యాబివృద్ధికిగాని, యితర దేశసంబంధమైన కార్యములకు ధనము సమకూర్చి సహాయము చేయుటయందుగాని, ప్రజలు దేశీయమహాజనసభాకార్యములయందు పాల్గొని జంకుగొంకు లేక పనిచేయుటకు భోధించుటయందుగాని గ్రంథాలయసంఘములు చేసినపనులు తార్కాణమై యున్నవి.
స్త్రీజాతృభివృద్ధి
మనలను కనిపెంచి జన్యాదినుండియు మనకు సద్దుణోద్బోనచేసి మనలను జ్ఞానదాయగులకుగా పెంపొందిుచియు వారుగూడ మనవిలె దేశసేవచేసియు దేశాభివృద్దికి తోడ్పడతగిన స్త్రీజాతి మూర్ఖనిద్రావస్థలోనున్నంశ