గవర్నమెంటువారే పూనుకొందురు. అట్టి పనిని ఇప్పుడు ప్రజలు పూనుకొని నిర్వహించుకొనుచున్నారు. అట్టిచో ప్రజలకు గవర్నమెంటు వారు తగు సహాయము చేయుటకు మారుగా భవనము పూర్తి యగుటకు అంతరాయము కలుగ జేసిరి. ఇట్టి స్థితిగతులయందు కర్తవ్యమును గూర్చి గ్రంథాఅయసోదరులు చర్చించెదరని ప్రార్థన.
సైజాము ౼ ఆంధ్రులు
నైజాము రాష్ట్రమునందున్న ఆంధ్రులస్థితి వలసబోయినవాడవలెనే యున్నది. వారిమంచి చెడ్డలు పోయిన దేశము వారి కక్కరలేదు. పంపినదేశము వారేమియు చేయజాలరు. రాజకీయవిషయములందేమి, భాషావిషయమందేమి, మతవిషయమందేమి, వారు చాల వెనుకబడియున్నారని అందరికిని తెలిసిన విషయమేను. ఈవిషయమై ఆంధ్రనాయకు లెల్లరు మూకీభావమును వహించియుండుట మిక్కిలి శోచనీయము. తుదకు ఆంధ్రస్యాహిత్య పరిషత్తువారికిగూడ ఈ రాష్ట్రమునందున్న ఆంధ్రఅముద్రితి నాఙ్మయమునందైన దయగలుగకుండుట దేశము యొక్క దురదృష్ట మనవలసిందేగాని వేరుగాదు. కొంతకాలము శ్రీ శేషాద్రి రమణకవులను నియోగించి నైజాము రాష్ట్రమునందున్న ఆంధ్రగ్రంధములను సేకరింపజేసిరి. ఆకాలమునవారు అమూల్య గ్రంథములను సేకరించియే యుండిరి. ఏ కారణముచేతనొ దేశము యొక్క దురదృష్ట మనవలసినదేగాని వేరుగాదు. కొంతకాలము శ్రీ శేషాద్రి రమణకవులను నియోగించి నైజాము రాష్ట్రమునందున్న ఆంధ్రగ్రంధములను సేకరిఁప జేసిరి. ఆకాలమునవారు అమూల్య గ్రంథములను సేకరించియే యుండిరి. ఏ కారణముచేతనొ కొలదికాలమునకే ఆకార్యమును విరమించిరి. బహుశంద్రవ్యాభావముచే నైయుండును. కడచినవత్సరము పిఠాపురమునందు జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తువారి కోత్సవసమయము నందీవిషయము యోచింపవలసినదిగా కొందరు నైజాము-ఆంధ్రులు విన్నపమును బంపికొనియున్నను, ఈవిషయము యోచనకు రాలేదు.
ఎవరికాళ్ళమీద వారు నిలవనిది మోక్షము లేదను సఁగతి నైజాము-ఆంధ్రులు గ్రహించినవారై, “నైజామురాష్ట్ర ఆంధ్రమహాజనసంఘము” ను స్థాపించి, అన్నివిధముల అభివృద్ధిని బొందుటకై కృషి సలుపుచున్నారు. ఈవిషయమై శ్రీ మాడపాటి హనుమంతరావుగారు, ఇంకను మరికొందరు యువకులును తదేకనిష్ఠతో కార్యసాఫల్యమునకై గడంగియున్నారు. రైలుస్టేషనునకు 50, 60 మైళ్ళదూరమునందున్న గ్రామములందు రెండు ఆంధ్రవారపత్రికలు అప్పుడే బయలు దేరి పనిచేయుచున్నవి. అముద్రిత గ్రఁధసేకరణ విషయమునను, చారిత్రిక పరిశోధన విషయమునను పనిజేయుటకై ప్రయత్నించుచున్నారు. వీరి ప్రయత్నములు జయప్రదములగుగాక యనికోరుచున్నాము.
గణపతి గ్రంథాలయము, కాకినాడ
ఈగ్రంథాలయ వారి కోత్సవసమయమున శ్రీ బులుసు సాంబమూర్తి గారు తమ అధ్యక్షుకోపన్యాసము నందు ఆధునిక థాలయోద్యమమును గురించి గత పదిసంవత్సరముల యభివృద్ధియు, ఆంధ్రదేశమున అచ్చటచ్చట గ్రంథాలయ మహాసభలు జరుపబడుటయు భారతవర్షము లోని కెల్లబరోడా తరువాత ఆంధ్రదేశము గ్రంథాలయాభివృద్ధియందు మిన్నగానుండి వన్నెకెక్కి యున్నదనియు గ్రంథాలయముల స్టాపనము మనదేశమునకు నూతన విషయము కాదనియు ప్రాచీనమునినుండి స్థిరపరుపబడియున్నపనియు ఖండాంతరవాసులకు ఆదర్శములై జూపెట్టననియు విపులముగా జెప్పరి. ఇటీవల గ్రంథాలయోద్యమము రెండుమూడు సంవత్సరముల నుండి విజృంభణము తగ్గినట్లు కనిపించుటకు గారణమల విమర్శించిరి. ఇందు యుత్సాహపరులై పనిచేయుచుండిన యువకులు రాజకీయవ్యవహారములందు పనిచేయుటచేత గ్రంథాలయములందు పట్టుదల తగ్గిపోయినదనియు ఈ యుద్యమనాయకులలో కొందరు పెద్దలు బాలభటోద్యమము నందును మరికొందరు రాజకీయ ఆందోళనమునందును దిగుట చేత గ్రంథాలయాభివృద్ధి తగ్గుటకు హేతువగుచున్నదనికి, సామాన్యమగు ఆంధ్రగ్రంథములేగాక హిందీ పుస్తకములు సమకూర్చి వలసినదనియు, సంచారపు కార్యాలయములు ముఖ్యముగ నుండవలసినవనియు కాంగ్రెసు యిక్కడ జరుపబడును గనుక యీలోపుననే సంచార గ్రంథాలయము ఒకటి ఇక్కడ నెలకొల్పబడవలసిన యవసరమున్నదనియు యిట్టిధనికుల సహాయముండినపుడు యిదియొక విశేషముకాదనియు హెచ్చరించిరి.
ఆంధ్రదేశగ్రంథాలయ ప్రతినిధుల మహాసభ
ఈ సభ మే నెల 1,2,3 తేదీలయందు "పమిడిపాడు” గ్రామమున ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి అధ్యక్షత క్రింద జరుపబడును. శ్రీ గోపాలకృష్ణయ్యగారి ఆధిపత్యముక్రింద ఈ సభ నూతనమార్గముల ద్రొక్కి ఆంధ్ర దేశాభ్యుదయమునకు తోడ్పడుగాక!
కడచినసభ జరిగి మూడుసంవత్సరముల కాలమైనది. అందుచేత ఆలోచించి సిద్ధాంతీకరింపవలసిన విషయము లెన్నియోకలవు. గ్రంథాలయసోదరులు దీక్షాపరులై దేశకళ్యాణము నొడగూర్చెదరు గాక!