రంభమై కొంతవరకు పనిజరిగి కారణాంతరములచే పని సిల్చిపోయి ఆసంపూర్తియగు భవనము గ్రామమునకు దిష్టి బొమ్మలుగా నిల్చియున్నవి. ఈయసంపూర్తి ప్రయత్నములను తిరిగి చేపట్టి భినవనిర్మాణము పూర్తిచేయుట ముఖ్యముగ చేయవలసినపని.
ఇందునుగూర్చి తగిన ఉత్సాహము ప్రజలలో కలుగ వలసియున్నది. గ్రంథాలయముల యొక్క అవసరావళ్యరతలను గూర్చి మొదటి నుండియు మేము చాటుచునే యున్నాము. ఆంధ్రలోకమునకు ఈయంశమునుగూర్చి తిరిగి నొక్కిచెప్పినచో అది యాంధ్రులను అగౌరవము చేయుటయే కావున అట్టిపని ఇక్కడ పూనుకొనుటలేదు. అయితే ఒకయంశముమాత్రము మేమిచ్చిట చెప్పవలసి యున్నది. మన దేశమందిప్పుడు రాజకీయజీవనమున అనేకక్షలు బయలు దేరి ప్రజలను చీకాకుపరచుచున్నవి. ఈ కారణములచే ప్రజలయం దంతఃకలహము లేర్పడి యున్నవి. ఇందుచే చాలప్రదేశములయందు ప్రజలకు ఐక్యభావము కుదరక ప్రజాసామాన్యమునకు సంబంధించిన పనులేవియు జరుగుటలేదు. ఇందువలన దేశాభివృద్ధికి ప్రజలయందుండవలసిని సొమరస్యమునకు గొప్పకీడు వాటిల్లుచున్నది. ఇట్టితరినము ముఖ్యముగా కొన్నిసంగతులను స్మృతికి తెచ్చుకొనుట యావశ్యకము. మనదేశపు దురదృష్ట మదేమియో గాని ఇద్దరు పురుషులకు పదియంశములయందు ఏక ప్రయోజనముండి ఒకయంశమున విరుద్ధ ప్రయోజనమున్నచో విరుద్ధ ప్రయోజనాంశమునే పట్టిపల్లార్చి తన్మూలమున ఉభయులమధ్యను శాశ్వతమగు వైషమ్యమును పెంపొదించుకొందురేగాని ఐక్య ప్రయోజనముల నాధారము చేసుకొని స్నేహభావమును వృద్ధిపర్చుకొనరు. కేవలము ఇందుకు ప్రజలను నేరపెట్ట నవసరములేదు. మన దేశమునందేర్పడిన విషమపరిస్థితులే ఇందుకు కారణము. అట్లయ్యును, మనదేశము శాశ్వతముగా ఇట్టిదురవస్థయందుండవలసినదేనా! దీనినుండి విముక్తి ఎప్పుడైనను యున్నదా? దేశమున విద్య వ్యాపించినకొలది ప్రజలు తమ బాగోగులను గుర్తెరుగుదురుకదా! పోరునష్టము, పొందులాభము' అని చిన్ననాటనుండి యెరిగిన యారోక్తి కదా! అట్టిచో విరోధముగల విషయమునికుమాత్రమే అట్టి భావమును కట్టిపెట్టి, ఏకాభిప్రాయముగల విషయము లన్నిటియందును మనవారందరును ఐకకంఠ్యముగా కృషిచేసి ఏల అభ్యుదయము పొందకూడదు ? పూర్వము మన దేవాలయములను, గ్రామసంఘములును ప్రజలయందు ఐక్యభావమును వృద్ధిపరచుచుండెసు. మొదటిదానియఁదు విద్యాగంధము కలవారని చెప్పుకొనువారిలో చాలమంది కిపుడు నమ్మకములేదు. రెండవది రూపుమాసినది. ఇప్పుడు ప్రజలందరు ఏకత్రసమావేశమగుట ఎక్కడ? తమకందరకు కావలసిన విషయములను, చర్చించి నిర్ణయించు కొనుటకు సావకాశమేది? ప్రజలయందు ఆత్మగౌరవము ఆత్మశక్తిని విజృంభింపచేసుకొను మార్గమెది? ఇట్టి సద్గుగుములు ప్రజలయందు ను స్థాపితములైనపుడు గదా! "జస్తిసు” పార్టీవారును లిబరల్ పార్టీవారును, చెప్పునట్లు తగిన ప్రతినిధులను ప్రజలు ఎన్నుకొనుట తమప్రతినిధును తమకుత్తారవాదులుగా చేసుకొనుశక్తి ప్రజలయందుర్భవించుటయు జరుగునది. కాంగ్రెసుపార్టీ వారు కోరునట్లు ప్రతి గ్రామమునందును కాంగ్రెసు సంఘము లేర్పడి వారి నిర్మాణకార్యక్రమమును, దేశమందు సాగించుట జరుగునదియు అప్పుడేగదా? ఈ పైన చెప్పిన ఉభయపక్షములవారికిని గ్రామమందలి ప్రజలందరు ఏకత్రసమావేశమై జ్ఞానమును సంపాదించుకొనుటకును, తమకు కావలసిన విషయములనుగూర్చి చర్చించుకొని తీర్మానములు చేసికొనుటకును గ్రామస్థులందరికిని హక్కుగల భవనమొకటి యుండవలెను. నాగరికతగల ప్రతిదేశమందుకు ఇచ్చి కూడలిస్థలము (భవనము) గ్రామజీవనమందు ముఖ్యస్థానము నాక్రమించియున్నది. కావున ఓజస్టిసుపక్షపు నాయకులారా! మీకున్నదని చెప్పు పలుకుబడిని మీరు వినియోగించి ప్రతి పల్లెయందును పట్టణమందును గ్రంథాలయ భవనములను నిర్మాణము చేయింపుడు. ఓ కాంగ్రెసు నాయకులారా! ప్రజలు మీతో నున్నారనికదా మీరు చెప్పుచున్నారు. అట్టిచో ఈభవనముల నిర్మాణము చేసి తన్మూలమున యుద్యమము స్థిరపరుచుకొనుడు.
అఖిలభారత గ్రంథాలయ ప్రతినిధి మహాసభ
1920 సంవత్సరములో చెన్నపట్టణములో ఈ సభ మొదటగా జరిగెను. ఇందుకు ముఖ్య కారణభూతులు ఆంధ్రులే. అట్లయ్యును, మద్రాసు పట్టణమందలి ఇతర ప్రముఖులనుగూడ చేర్చుకొని సభ జయప్రదముగా నిర్వర్తింపబడెను. ఆసభకు ఆగ్రాసనాధిపతులగు. జె.స్.కుడొల్కర్గారు బరోడా సంస్థానపు గ్రంథాలయ శాఖాధ్యక్షుడు. రెండవ సభను బగోడా కాహ్వానింపబడునను సూచనను వారు చేసియుండుటచే ఆసభయందు తిరిగి ఎక్కడ రెండవసభను జరగవలసినదియు ఎప్పుడుజరగ వలసినదియు కూడ తీర్మానింపబడలేదు. దురదృష్టవశముచే కుడొల్కర్గారు గారు పిన్న వయస్సులోనే మరణించిరి. అఖిలభారత గ్రంథాలయప్రతినిధి మహాసభ సమావేశమును గూర్చిన ప్రశంస తిరిగి చేయువారే లేరైరి.