భవనములనిర్మించుకొనినవి. కేంద్రగంథాలయ స్థాపనానంతరము మఁడల గ్రంథాలయములు స్థాపింపవలెనను నభిలాష యుద్యమ నాయకులకు జనించినది ఆ సమయమున శ్రీయుత వావిళ్ల వేంకటేశ్వర్లు గారు తమ యుదారభావమును వెల్లడించిరి. ఆంధ్రదేశమున స్థాపింపబడు ప్రతిమండల గ్రంథాలయమునకును తమచే ప్రకటింపబడిన 600 రూప్యముల విలువగల గ్రంథములపెట్టునుచితముగా నిచ్చుటకు వాగ్దానము చేసి. ముందు ప్రశటింపబోవువానినిగూడ తా మొసగుటరు అభ్యంతరము లేదనిరి. కొందరు కవులును వారిమార్గము ననుసరించిరి.
1919 సం| తో మూడవభాగ మారంభమయినది. ఈవత్సరమున నూతనగ్రంథాలయములు, మండలసంఘములు స్థాపింపబడినవి. నవంబరు నెలలో చెన్ననగరమున ఆంధ్రగ్రంథాలయ మహాసభ జరిగినది. ఆ సమయముననే అఖిలభారత గ్రంథాలయసభ సమావేశ పరుపబడినది. ఈవత్సరమున ప్రత్యేక వ్యక్తులవలన గ్రంథాలయోద్యమమును తెల్పు రెండు చిన్నపొత్తములు ప్రకటింపబడినవి. వానిలో శ్రీ నూరి నృసింహశాస్త్రిగారు ఆంగ్లమున ప్రచురించి గ్రంథము ఉత్తమమయినది. ఆగ్రంథ ప్రచురణమువలన యితిర రాష్ట్రములవారికి మన యుద్యమప్రాశస్యము గ్రహించుటకు వీలుకలిగినది. 1919 సం|| రాంతమునకు గ్రంథాలయముల సంఖ్య 586 వఱకు వృద్ధి నొందినది. 1920 సం౹ నీ సంఘపక్షమున ప్రచారకులను తయారుచేయుటకు పాఠశాల యేర్పరుపబడెను. ప్రతి దర్మగ్రంథాలయ మునకును సద్గ్రంథములను తక్కువవెలకు లభింపజేయుటకు ముద్రాశాల స్థాపించుట యవసరమని తోచి, కార్యదర్శిగారు చాల ప్రయత్న మొనరంచిరిగాని దైవమనుకూలింపడయ్యను. మహానందిలో సభ సమావేశమయినది. పిమ్మట దేశమంతయు రాజకీయో ద్యమముతో నిండిపోయినది. ఇతర ఉద్యమములు తలయెత్తుటకు వీలుకలిగినది గాదు. అందువలన, గ్రంథాలయోద్యమము మందగించినది. పలువురు గ్రంథాలయనేవకులు శ్రీకృష్ణజన్మస్థానము నలంకరించరి. శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్యగారు తమయారోగ్యమును కోల్పోయియుండిరి. తిరిగి యిపుడు ఆరోగ్యవంతులై యున్నారు. రాజకీయరంగమును నిర్మాణభాగము సాగుచున్నది. గ్రంథాలయోద్యమము తరిగిన తొల్లిటి యుత్కృష్టతను బొందవచ్చును. ఈ మూడు సంవత్సరములలోను కొన్ని గ్రంథాలయములు నశించినవి. ప్రస్తుతము రమారమి 600 గ్రంథాలయము లుండవచ్చును. కార్యదర్శిగారు గ్రంథాలయసర్వస్వమును మాసపత్రికగా ప్రకటించుటకు ప్రారంభించినారు. మ॥ వెలిదండి శ్రీనివాసరావుగారిచే ప్రారంభింపబడిన గ్రంథవిభజన శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు గారు పూర్తి చేయించుచున్నారు. కావ్యనిధి చెలికాని లత్సారావు గారు గ్రంథాలయవార్షకోత్సివసంచికలను ప్రకటించుకున్నారు. కృష్ణా మండలమునకు మండలగ్రంథాలయము మొన్ననే స్థాపింపబడింది. గుంటూరుమండలమున గ్రంథాలయమహాసభ సమకూడనున్నది. ఆంధ్రదేశమునకూడ స్వార్థత్యాగులు బయలు వెడులుచున్నారు. కార్నేజివంటి కోటీశ్వరులును, గైక్వారువంటి విద్యాభిమానులును లేరని నిరుత్సాహపడకుడు. ప్రతిపల్లెయందును ధర్మగ్రంథాలయస్థాపన గావింపుడు. విద్యవెదజెల్లి జనసామాన్యము యొక్క యజ్ఞానమును పారద్రోలుడు. మన మేరూపమున నీశ్వరుని ధ్యానింతుమో యురూపముననే ఆయన మనకు దర్శన మిచ్చితీరును.
“శ్లో॥ యోయోయాం యాం తనుం భక్తః
శ్రద్ధ యార్చితు మిచ్ఛతి
తస్య తస్యా చాలం శ్రద్ధాం
తా మేవ విదధామ్యహమ్|
౼ యాతగిరి లక్ష్మీవెంకటరమణ
కథ - కలాపము
గ్రంథాలయములకు భవననిర్మాణము
ఆంధ్రదేశమున జాతీయప్రబోధము ముఖ్యముగా గ్రంథాలయముల మూలముననే జరిగినది. ఈ ప్రబో కేవలము పాలమీది పొంగువలె వెంటనే సమసి పోకుండ దినదినప్రవర్ధమానమై జాతికి పుష్టినిచ్చుటకు గ్రంథాలయములు చిరస్థాయిగానుండి తమవిధులను నిర్వర్తించు చుండవలెను. ఇందుకు ముఖ్యము గ్రంథాలయములకు భవననిర్మాణము. ఏయుద్యమమైన శాశ్వతముగా నుండవలెనన్న దానికి శాశ్వతమగు సాధనములు కొన్నియుండవలెను. గ్రంథాలయమునకు భవన మట్టి సాధనము, ఇందుకొరకై మన యాంధ్రదేశమున కొంత కాలముక్రిందట తీవ్రమగు ప్రయత్నములు జరిగినవి. కొన్ని సంఘములు స్వంతభవనములు నిర్మాణము చేసుకొనియున్నవి. కొన్నిచోట్ల చందాపట్టీలు ప్రారంభించి కొంతసొమ్ము వసూలై ఏగ్రామ పెద్దలవద్దనో నిలవయుంటూ యున్నది. కొన్ని చోట్ల భవవనిర్మాణము ప్రా