Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాపింపబడినది. భీమవరము తాలూకా కుముదవల్లిలో వెలసియున్న వీరేశలింగకవి సమాజము స్థాపింపబడినదీవత్సరముననే. ఈసమాజము డైరక్టరుల పరిపాలన క్రింద నున్నది. ఈ సంఘమునకు స్వంతభవన మున్నది. ఈ గ్రంథాలయమున ననుబంధముగా మతధార్మికశాఖ లున్నవి. రాజమహేంద్రవరమున 1900 సం.రములో శ్రీయుత నాళను కృష్ణారావుగారిచే నొకథర్మ గ్రంథాలయము సాపింపబడినది. ఇపుడా గ్రంథాలయము గౌతమీ గ్రంథాలయమనుపేరు బరుగుచున్నది. ఈ గ్రంథాలయమున నిపుడు సుమారు పదిహేను వేల సంస్కృతాంధ్రాంగ్లేయ గ్రంథములు కలవు. ఆంధ్రగ్రంథాలయములలో గ్రంధసంఖ్యయఁదు దీనినే మిన్నయని చెప్పవచ్చును. ఈసంఘ మీదివరలో ననేకమార్గముల ప్రజాసేవ చేసియున్నది. స్వంతి భవనమును నిర్మించుటకు నిర్వాహకులు తగు ప్రయత్న మొనరించుచున్నారు.

1911 సం.రము నుండియు ధర్మగ్రంథాలయములు దేశమందంతటను వెలయుటకు ప్రారంభమైనవి. ఆంధ్రసారస్వతమునకు నూతన వికాసములగు గ్రంథమాలలు, మాసపత్రికలు స్థాపింపబడి ఈ యుద్యమమునకు దోహదమొసగినది. విశాఖపట్నమున ఆర్షపుస్తక భాండా గారమును, హైదరాబాదు నగరమున ఆంధ్రభాషాభివర్ణనీ సమాజయ స్థాపింపబడినది. గ్రామములలోకూడ కొన్ని గ్రంథాలయములు బయలు దేరినవి. గ్రంథాలయనిర్వాహకులు గ్రఁధసహయమున జనుల విద్యావంతులు జేయుయే పత్రికాపఠనమందిరముల నెలకొల్పియు, రాత్రిపాఠశాలలు పెట్టియు, పురాణపఠనము నేర్పిఱచియు, పోటీపరీక్షలు జరిపి బహుమానముల నొసంగుచు ననేకవిధముల విద్యాదానము చేయబడంగిరి.

1914 సంస్థతో నీయుద్యమము యొక్క రెండవ భాగము మొదలిడి 1918 సంవత్సరములముతో సంతమొందెను. ఈ అయిదు సంవత్సరములలోను ధర్మగ్రంథాలయోద్యమమునకు నామరూపము లేర్పడినవి. 1914 సంవత్సరములన బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయమువారికి గ్రంథాలయమహాసభ జరుపవలెనని యిచ్చి వొడమినది. తత్ఫలితముగ ఏప్రియల్ 10 తేదీని ఆనగరమున ప్రథమ ఆంధ్రదేశ గ్రంథాలయమహాసభ బ్ర చిలకమర్తి లక్ష్మీనృసింహము పంతులు గారి యధ్యక్షతక్రింద సమావేళమయినది. ఆసభకు పలు ప్రదేశములనుండి 163 గ్రంథాలయములవారు విచ్చేసిరి. ఆమహాసభలో ఆంధ్రదేశమంతటను ధర్మగ్రంథాలయముల స్టాపించుటకును స్థాపించినవానిని పెంపొందించుటకును ఆంధ్రదేశగ్రంథాలయసంఘ మను శాశ్వతసంఘము సాపించుటకు తీర్మానింపబడినది. ఈ సంఘ కార్యస్థానము బెజవాడ రామమోహన గ్రంథాలయమునం దుండుటకును సంఘపక్షమున నొకపత్రికను ప్రచురించుటకును ఆంధ్రగ్రంథ విభజనపట్టికను తయారుచేయుటకును, మాజికులాంతరు కొనఁటకును, సంచారకార్యదర్శిని ఏర్పాటు చేయుటకునుకూడ నాసభయందే తీర్మానింపబడినది. అది మొదలు ఏటేట రాజమహేంద్రవరము, నెల్లూరు, బారువ, విశాఖపట్టణము, చెన్నపురి, మహానంది గ్రామములలో గ్రంథాలయసభలు జరుగుచు వచ్చినవి. ఈసంఘ కార్యదర్శులగు మ అయ్యంకి వెంకటరమణయ్య గారు వ్యయప్రయాసకలకోర్చి, తమ స్వంతపనులను గూడకొని 1914, 1915 సంవత్సరములలో అనేక గ్రంథాలయముల దర్శించి తగు సలహాల నోసంగీయుండిరి. వారు ప్రతి మఁడలసభ కరిగి గ్రంథాలయగుల తీర్మానమును ఆమోదిఁపజేయుచుండిరి. అందువలన కొన్ని నూతన గ్రంథాలయమలు సాపింపబడినవి. మండలసంఘములు వెలసినవి. ఆంధ్రగ్రంథాలయముల చరిత్ర సమగ్రముగా ప్రకటింప బడినది.

1916 సం|న గ్రంథాలయ సర్వస్వమను పత్రిక పక్రటించుటకు ప్రారంభించిరి. ఈపత్రిక ఉద్యమనిర్వాహకులకు చాల సహయమొనర్చు చున్నవిషయము నిర్వివాదాంశ్రము. ఈ పత్రిక వలన ప్రతివత్సరము నష్టము వచ్చినను భరించి సజీవముగానుంచిన కార్యదర్శి గారి పట్టుదల నెంతయు కొనియాడ వచ్చును. ఈ సంఘమువారు ఆంధ్రదేశమున నేగాక ఇతర స్వదేశ సంస్థానములందును తమయుద్య మము వ్యాపించుటకు తగుకృషి సలిపియుండిరి. కార్యదర్శిగారు 1917 సం బరోడానగరమున జరిగిన గ్రంథాలయ ప్రదర్శనము చూచివచ్చి ఆంధ్రదేశమునను అట్టి ప్రదర్శనమును సమకూర్చుచున్నారు. గ్రంథాలయమునకు వలయు స్వపరికరములును అందు ప్రదర్శింపబడును. ఆప్రదర్శనము ప్రతియాంధ్రుడును చూచి తీరవలసినది. 1918 సంవత్సరములన విశాఖపురియందు అయిదవ గ్రంథాలయ మహాసభ సమకూడినది. ఆసభయందు బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయమును ఆంధ్రదేశమునకు కేంద్ర గ్రంథాలయముగా పరిగణించుటకు తీర్మానింపబదినది. రామమోహన గ్రంథాలయమునకు విశాలమగుస్థలమును పండ్రెండువేలరూప్యముల విలవియగు స్వంతభవనమును కలవు. 1918 వ సం। రాంతములకు గ్రంథాలయముల సంఖ్య 475 475 వరకు బెరిగెను. 15 గ్రంథాలయములు స్వంత