వ్యాపించియుండెను. తిరుపతికవులు కర్ణుని చారిత్రమును చర్యఅను సహేతుకముగ, న్యాయ్యముగ పోషించి, యీ మహాత్ముని కీర్తిబింబమును నిష్కళంకముగ నొనగూర్చి యున్నారు.
కావ్య నాటకములందు తిరుపతికవు లెట్టిమహానీయసిద్ధినొందిరో, గద్యవిమర్శనమందును, వాదప్రకారములందును అట్టిచక్కని సిద్ధియే పొఁడియున్నారు. గంటూరుసీమ, గీరతములందు గోచరించు వ్యవహారదక్షత చిరాభ్యస్తన్యాయవాదఁగూడ సంతృప్తిపరచుచున్నది. వీరికృతులలో నీశ్వరప్రశంస మిక్కుటముగ. భక్తి పారవశ్యమున గోచరించదు. వీరు లౌకికులు, భాషాసంస్కర్తలు, స్వతంత్ర కావ్య నిర్మాతలు, స్వానుభవాహ్వకార నిరూపకులు, రసికాగ్రగణ్యులు. ఆఁతియే కాని, శాశ్వతలక్షణములు వీరికావ్యములందెంతవరకున్నవో ప్రస్తుత మూహించజాలము. ఏమైనను శ్రవణానందములోని కొన్నిపట్టులు, మిగిలిన గ్రంధములన్నిటిలోని సుభాషితములు తెలుగువారల గారవమందుచు చిరస్మరణీయములై నిలచియుండుననుటకు సంశయములేదు. భాషాభివృద్ధికిని, యాథునికాఁధ్ర సారస్వతవ్యాప్తికిని వీరేశలింగమొకవంకను, తిరుపతికికవులొకవంకను దోడ్పడి, సూత్రధారులై మెలగిరనుటకు సందియముఁడదు. ఆంధ్రసారస్వత చరిత్రములో వీరెల్లపుడు నవీనయుగా రంభకులుగ గౌరవింపబడుదురు. కావ్యనిర్మాతలుగ భావిసంతతు లెట్టి గౌరవమాపాదింతురో కాలగర్భితమై తెలియకున్నది.
తిరుపతికవుల భాషాసేవ మరపుదగిలినను, వారి కావ్యములు ప్రాచీనశల్యోపములై యుపకరింపకున్నను, వారి నిత్యచారిత్రము వారి నిరాఘాటప్రచారము, వారిగాధలు, వారిసుగుణములు తెలుగువారిచే నెల్లపుడు స్మరిఁపబడునని నా నమ్మకము. భోజరాజువలె, అనఁదగజపతివలె,కృష్ణదేవరాయునివలె, వీరును తమ కథలచే మెప్పించుచుఁదరు. తిరుపతికవులు నిర్దిష్ట లక్షణపరిజ్ఞానమునకన్న స్వతంత్ర భాషాప్రయోగ వైదుష్య మెక్కువ వాసికెక్కిననది. వారి కావ్యసిద్ధికన్న, మహోదార జీవితచారిత్ర వెక్కువ గౌరవింపబడు చున్నది. దిగ్విజయములు, అవధానములు, వాదప్రచారములు, సరిసప్రబంధరచనలు, మృదుగఁధీరహస్యోపవ్యాసములకన్న తిరుపతి వెంకటేశ్వరుల లలితమర్యాదలు మిన్నలైనిలిచియున్నవి. పండితసంస్కర్త, రసప్రవక్త, తన వైదుష్యముచేకన్న, కావ్య విజయముల చేకన్న, తన నిత్యాలాప సౌకర్యమాధుస్యమున కాలప్రవాహమున నిలువగలిగియున్నారు. ఆనుటకు తిరుపతి కవులే నిదర్శనములై యాచంద్రతారార్కమగు కీర్తి ననుభవింతురు.
౼ పురాణం సూరిశాస్త్రి
ఆంధ్ర గ్రంథాలయోద్యమము
ఇరువదవ శతాబ్దముతో నూతనశక్తి యాంధ్రుల నావహించినది. ఈనూతనశక్తి దేశోపయోగమునకై వినియోగ పడునట్లు చేయుట మనవిధి. జనసామాన్యము విద్యావంతులు కావలెను. అందుకు మాతృభాషయే పరమసాధనము. మాతృభాషను పెంపొందించుటకు గ్రంథాలయమే మంచిపొధనము. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము స్వయంసహాయముపై నెక్కువ యాధారపడియున్నది. ఉద్యమాభిలాషులు కార్యశూరులు కాని వాకుర్శలుగారుగారు. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ చరిత్రను మూడుభాగములుగ విభజింపవచ్చును. మొదటి భాగము 1897 సం॥తో ప్రారంభనుయి 1914 సం॥తో నంతమొందెను. ఆంధ్రగ్రంథాలయములందు ప్రాచీనములు రెండు. మొదటీదగు తంజావూరు పుస్తక భాండాగారము ఆంధ్రనాయకులచే 17వ శతాబ్దమున స్థాపింపబడి ఆమూల్యములగు 8 లక్షల గ్రంథములను కలిగియున్నది. రెండవదియగు చెన్నపురి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారము బ్రౌనుదొరగారి ప్రోత్సాహమున దొరతనము వారిచే డెబ్బదివత్సరములక్రిందట స్థాపింపబడినది. కాని మన దురదృష్టమోయన రెండు గ్రంథాలయములును ఆంధ్రదేశమునకు వెలుపల నున్నవి. ఈ రెండు గ్రంథాలయములందునూ పూర్వకవి విరచితములగు ముద్రితా ముద్రితగ్రంధము లనేక ములున్నవి.
ఆంధ్ర దేశమున ధర్మగ్రంథాలయముల స్థాపనకు పూర్వము క్లబ్బులని వ్యవహరింపబడు కొన్ని సంఘములు అచట బయలుదేరినవి. ఈ సంఘములు సాంఘికుల వినోదపరచుటకు మాత్రమే యుపకరించుచుండును. నియందు యితరులకు ప్రవేశములేదు. 1897 సం॥లో మొట్టమొదట నవీనధర్మగ్రంథాలయము ఆంధ్రదేశమున