Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గల్పించి వాడెడిదురాచారము నీమహాకవులపోకడ ఖండించుచున్నది.

అల్పవిషయముల నఁదమగువాడుక తెలుగులో గద్యవైఖరులొప్పు పద్యములలో రసభావసౌందర్య ముట్టిపడ జిత్రించుటయే గాక, లౌకిక పరిజ్ఞానమందును, లోకానుభవమందును వీరు మిన్నలైయున్నారు. జార్జి పట్టాభిషేకసమయమున బ్రచురింపబడిన పద్యావళులన్నిటిలో తిరుపతి వెంకటేశ్వరులు సమర్పించ దానియం దాశీర్వచనమునకు తోడు వందివాక్యములకు జోడుగా, రాజకార్యభారప్రశంసయు, ధర్మవిరోధమున గల్గమోపెడి యధికార భ్రష్టతయు నెంతయో లలితవ్యంగ్యరీతుల దెలుపబడినవి. వీరి నాటకములందు, ప్రబంధము లందు, అవధానప్రస్తావనములందు గోచరించు కథాసందర్భములు, సంభాషణ వైఖరులు, అసమానమగు లౌకిక పరిజ్ఞానమును వెల్లడించును. ఉంగరము పోయినప్పుడు వ్రాసినపద్యమెంత నియ్యోగమర్యాదల దూగుచున్నది! సరసాలాపవర్ణనము లందునకూడ పూర్వకవిప్రయుక్తమైన వర్ణనల దలమార్చి వాడక, స్వకీయానుభవమునుండియే గూర్చుచుందురు.

చ| సరసునివైపు వీపు, ఆలచానమొగంబటు గోడవైపు,
    ఆసరసుడు కేలుచాపు, నలచానయు చన్నులమీదమో
    పు, నాసరసుడు కోర్కెచూపు, నలచానతొడం దొడ
    లోనదోపు, నీ వరుసనె తెల్లవారె నొకవైఖరికొక్కని
    కొక్క వేశ్యతోన్ |

తిరుపతి వెంకటేశ్వరులు విఖ్యాత కావ్యములందు వారి యనుభవములే, వారి యహంకారపూరిత వాగ్వైభవములే మిక్కిలి యందముగ దోచుచున్నవి. శ్రవణానందము, పాణిగృహీత, గీరతము, వారి యనుభవసారమును దెల్పుచు సహంకారోద్వేగభరితములై యున్నవి. స్వానుభవములను చిత్రించుటలో, సహంకారమును పద్యనాళముల బ్రవహింపజేయుటలో, సామాన్యులు హేయముగ రసవిహీనముగ, మాత్సర్యగర్వపూరితముగ జేయుదురో కాని, సరసరీతులు పదనిగ్రహముతో వెలువరింప జాలరు. తిరుపతికవు లీపని యవలీల నొనర్చిరి. "ఎవ్వారిని లక్ష్యపెట్టక యవారణదిగ్విజయం బొనర్చి ప్రజ్ఞానిధులంచు బేరుగొనినార" మను వాక్యములోని నిజప్రతి భాభివరనమందలి దోషమునెల్ల “నీవలనన్ సరస్వతీ” యని భారతీగుణ పోషణమునకై వినియోగించిరి. గీరతము తాకినవారిభావము లెట్లున్నను, అందలి యహంకృతుల్లిల్ల సద్ధర్మనిర్వహణార్థమై, లోకహితైకకాంక్షతో నుద్దీపితమైన వాస్తవము చదువరులకెల్ల స్ఫురించును. గీరత కవిత్వము నవీనాంధ్ర కావ్యసంకల్పములలోనెల్ల నుత్తమమైనది. మానసకోశమున మెలగుచు, రసభావ పదప్రయోగ వైదుష్యమున దురాచారముల జెండాడు సాగిస్వతిమహారథుల సమరార్భాటము లీ గీరతమున కావ్యవిస్తరత నొందియున్నవి. శ్రవణానందమున, యౌవనవసంతసమాగమమున పులకరించి మొగ్గదొడగిన, కోమలభావకుసుమంబులు, నుధామాధుర్యమినుచు, సౌందర్యరాసులై తెలుగుపదునుల జెన్నొంది యున్నవి. రవీంద్రుడు విజ్ఞానకోశమన జల్పించు దేవోపాసి; తిరుపతి వెఁకటేశ్వరులు మానసరంగమున స్వానుభవముల సహంకారచోదితులై నిరాఘాటముగ, నిశ్శంకముగ, ఘంటాపధముగ మ్రోయించు కావ్యకర్తలు. వంగీయాధునిక మహాకవి సంశయిములప్రోగు; తా నెరుగనిదాని జెప్పజూచెడివాడు. తెలుగుకైతల క్రొత్తమగలు నిశ్శంకముగ, స్వతంత్రించి, మానస వ్యాపారముల నుద్బోధింపగల యాుధ్రస్వభావవిరాజితులు. తిరుపతి కవులు రసభావముల మానసిక విమర్శకులేకాని, యాధ్యాత్మతత్వవిజ్ఞాతలు కారు.

తిరుపతి వెంకటేశ్వరులు రచించిన ఇతర కావ్యములు బుద్ధచరిత్ర మొదలగునవి, తమ స్వానుభవోద్దీపకంబులగు శ్రవణానంద గీరతములకు జంకిపోవుచున్నవి. కాని భారత నాటకములందు వీరు దేశమున కత్యంతోపకార మొనర్చిరి. వ్యాసున కందరాని మెఱపులను భారతకవులు చూపియున్నారు. వీరినిమించి తిరుపతికవులు నాటకముల గూర్చినారు. ఈ నాటకములలో కొన్ని తావుల పేలపిండి కవిత్వమున్నను, అనవసరముగ పద్యములనేకములు జేర్చినను, మంచిపట్టుల దివ్యమైన పద్యములు, రసస్ఫూర్తి, కథావిన్యాసము గన్పట్టుచున్నవి. వీరు భారతములోను ఆంధ్ర గీర్వాణములలో గూలంకషముగ జదివి, వివాదాంశముల జక్కగ బంశీలించి, మానసప్రచార వైదుష్యమున పాత్రపోషణ మతినిపుణత నిర్వహించిరి. భారత నాటకములు వెలువడు కాలమున మన తెలుగు దేశములో దేశీయభావ ముదయించుచుండెను. రసపుత్ర వీరుల గాథలు, శివాజీ మున్నగువారి చరిత్రములు, ఓరుగల్లు విద్యానగరములు వీరప్రతాపములు, తెలుగుచదువరులడెంద మానంద పరుచుచుండెను. అట్టి సందర్భములలో తిరుపతికవులు భారతవీరుల విచిత్ర చరిత్రముల సర్వజనామోదమగు నాటకములుగ జేసి దేశాభ్యుదయుమునకు దోడ్పడిరి. వీరు కొన్ని భారత పాత్రలపట్ల నదివరకు దేశమందుండిన యపోహల రూపుమాపి, వారి నామములకు శాశ్వత కీర్తి నొనగూర్చిరి. వేణీసంహారము మున్నగు నాటకములవలన న్యాయమార్గ మెరుగని కర్ణక్రయంబరు వదంతి మిగుల