లను, నానా సందర్భములను, సుబోధకముగ ముద్దలొలుక బలుకుచుండిరి. అవధానములందును ప్రస్తావనలందును వీరు వచించిన కావ్యవైఖరులు ఆశుకవిత్వ సాగళ్య మొప్పీయు, నందచందములు తొల్లిటి మేటికవుల కల్పనలకు వెనుదీయక తెలుగుపద్యములు నతిశీఘ్రముగ నతిలాఘవముగ నల్లు తెరవుల గిల్పించెను. తిరుపతి వేంకటేశ్వరుల మానసప్రభావమున సర్వజనాంగీకారమంది మాన్యతవహించిన యవధానకవిత్వము, ఇతివృత్తమఁదును, భాషాప్రయోగమందును, విషయ స్వాతంత్య్రమందును ఖండకావ్యముల మూలమై, నవ్యాంధ్రకవితా స్రవంతికియారని బిచ్చమిడిన దాయెను. వాడుక తెలుగు నెంతయు మనోహరముగ నుపయోగించి యల్ప సంస్కారులగు బాలకవులపాలిటి 'దైవమై, తారకమంత్ర ముపదేశించిన ప్రొడ లీతిరుపతికవులు.
ఉ| “వేసవి డగ్గ రాయె మిము ♦ వీడుటకున్ మనసొగ్గదా
యె మా | వాసము దూరమాయె పర ♦ వాసమదేట్టు
లొ భారమాయె మా | కోసము తల్లిదండ్రులది ♦ గో
ఇదిగో నని చూచుటాయె వి | శ్వాసమెలర్పగా సెల
వొసంగినఁ బోయెదమయ్య భూవరా!”
అను పద్దెములందును కామేశ్వరీశతకమందును, శనిగ్రహమందును, అవధానప్రస్తాపన కల్పనలందును తిరుపతి వేంకటేశ్వరులు బింకాననడచిన ముద్దుపోకడ లాధుని కాంధ్రకవితావిర్భావమహారంభమున కాధారములైనవి. ప్రస్తావనలో వీరి సమయస్ఫూర్తి, తిరుపతిశాస్త్రి కాకినాడ రైలునిలయమున నుండగా శృంగభంగమును బ్రచురించినవార్త విని, యచ్చెరువంది చెప్పిన పద్యరాజమే వేనోళ్ళ జాటుచున్నది.
ఉ॥ చుక్కలు రాలలేదు రవిసోములపోకడ మారలేదు న
ల్దిక్కులు కూలలేదు జలధిద్వలనం బుబుకం లేదు నే
డక్కట రామకృష్ణకవు లక్ష్భకులేగతి జేయనేర్తు రా
ధిక్కృత వైరి వేంకటసుధీశ్వరమాళికి శృంగభంగము౯
తిరుపతికవుల లేత కైతలు, నవ్య వైఖరుల దెలుప వెంకటశాస్త్రి మందస్మితావలోకనకళాసంపర్కమున నాంధ్రభాషామాధుర్యమనివార్య మోహపాశముల వెదజల్ల నెందరో ఆవధానులై, నాటకకర్తలై, కావ్యకలనా వైదుష్యమును సంపాదించియున్నారు.
తిరుపతికవులు లాంధ్రగీర్వాణ భాషాలక్షణములం దసమానపాండిత్యము నొప్పుచున్నను, సుప్రయోగదక్షులయ్యును, పూర్వకవుల గుట్టుమట్టుల నెరిగి యీగతి వచించిరి:
క॥ వ్యాకరణ మొక్కతోవ మహాకవు లోకత్రోప కోశమఖల మ్మొకత్రో, వై కనుపట్టెడి నీ భాషాకావ్యమ్ములను దఱుచు చదివినకొలఁది౯”. “తెలుగునకున్న వ్యాకరణదీపసు చిన్నది. భారతాదులలో యతిభ్రంశాదిదోషములుగలవి యొకదోషము కాదు. భారతాదులలో లేని పదములు నవనీకలవె? అందుచే నిది గ్రామ్యమనియు, దేశ్యమనియు పెనగశక్యంబె?" మున్నగువాక్యములతో తమ కావ్యనియమముల బేర్కొనియున్నారు. వాడుక పదములను సందర్భోచితముగ నందముగువాడి తమకావ్యముల కసమానజీవకళలను గూర్చియిచ్చిరి. "కూటికి గుడ్డకై పరులకొంపకు జేం” ౼ ఎంత బాగుంది? ౼ పద్యమల్లుటలో వీరివృత్తములు సైతము షేక్స్పిపియర్ గీతముల వైఖరిలో సరళముగ భావానుకూలమగు సంభాషణారీతుల గద్యమువలె రపస్ఫురితములై దుముకుచుండును. వ్యాకరణ లక్షణములు బాటింపక వాడుక తెలుగుపోకడల రసవత్పద్యరత్నముల జూపుటయేగాక, గద్యపద్దతుల సమీపించు పద్యవైఖరుల నేర్పరచి, భావి కావ్యారంభములకు దారి జూపిరి. దేవీ భాగవతములో దేవపురోహితుడు చంద్రునివాకిట నిలబడి యరచినయర పెంతగద్యనైజ మొప్పుచున్నదో చూడుడు!
ఉ॥ ఔర! దురాత్మ యెంతటి దురాచరణం బోడగట్టి
నావురా! దారను జూడ నేగునను ద్వారమునం దొకఁ
డాగువాఁడె? నా నీరజనేత్రి నాయతివ నీకు స్వ
తంత్రమె? నాకుదూరమే?
ఇట్టులే భారతనాటకములందు పలుతావుల గద్య వైఖరు లందమైన పద్దెముల గన్పట్టుచున్నవి. "పెండిలి యాడినన్' పిదప బిడ్డలు పుట్టుట నిశ్చయంబు, నే పెండిలి మానుకొంటి,”……… సేవాధర్మము నూతధర్మమునురాశీ భూతమై యొప్ప వాచావాత్సల్యముజూపె కర్ణు డిటు మాత్సర్యంబు మీ కేల?” “అంచితులైన బందుగుల అందరిముందర జెప్పి నిన్ను మెచ్చించెద, కుంతిచేత రవిచేతనిజం బని నీకు సాక్ష్యమిప్పించెద. ఫల్గుణ ప్రముఖవీరులు గొల్వగ నెల్ల భూమి యేలించెద.. ” గద్య వైఖరే కాదు —— ఉపన్యాస తీవ్రతయు నిందిమిడియున్నది. పదములు వాడుటలోకూడ స్వాతంత్య్ర మెంతయు ద్యోతకమగుచున్నది "ప్రాచీన గురుశిష్యపద్ధతి” లో.
"శా| బెంచీలక్కర లేదు 'గేమ్సు ముదలౌఫీజుల్ వినన్ రావు బొమ్మంచున్ నిర్ధను ద్రోచిపుచ్చరు" మున్నగు నన్య భాషాపద ప్రయోగములు, సువిదితమైనవి ప్రయోగింపబడినవి. నవీనాంధ్ర రచయితలలో కొందరు సువిదితమగు వన్య భాషాపదములకు దురవగాహమగు నాంద్రపదమును