శ్వాంతికే ! అభ్యస్యంతి శతావధాన కలనాం కీర్తిం
లభంతే ధనం | తస్మా దాధుని కావధానిగురుతో
హేతూ గురూ సంశ్రయే ||
వీరి యుత్సాహప్రోత్సాహ తన్మయత్వముల కాంతిచే నెందరో భాషాసేవకులై సరసకావ్యముల గూర్చగలిగిరి. తిరుపతి వేంకటేశ్వరులు గుణగ్రాహులు, పరాభిప్రాయమును సహించువారలు, వినయసంపన్నులు. పెద్దబింకములదారు లెరుగక నందరితో కలసిమెలసి సంచరించు నిండుకుండలు. అయినను వలసినచో వెఱ్ఱి మొఱ్ఱి బడాయిల నణగద్రొక్కవలసినచో, పండిత వాదప్రహారముల నణగద్రొక్కనవలయుచో, వీరి మానస మిట్లుఁడెను.
శా౹ "మాకన్నన్ మహనీయు లైనకవు లీక్ష్మామండలి౯
లేకపో ! రీకాలంబున యుష్మదీయ కవితాద్వీపంబు
ముంపంగ నస్త్రోక శ్రీక మదీయదివ్యకవితాతుంగార్భటీ
ఘోరగం। గాకల్లోలవతీ ప్రవాహభర వేగ ప్రక్రియల్ చాలవే"
తాము స్వతంత్రించి బూనిన నూత్నకవితామార్గముల నిలచి నిలుపగల యహంకారము, పూనిక ఉత్సాహము నైజసత్వమున దీపింప, తిరుపతి వేంకటేశ్వరులు నవీనాఁధ్రకవితాపురోగాములై విలసిల్లిరి.
తిరుపతికవులు తెలుగుకవిత్వమును ప్రభుపోషణమునుండి తప్పించి, ప్రజాపోషణమున జేర్చి, కవుల స్వాతంత్య్రమును, కావ్యముల పరమైశ్వర్యవిభూతిని నెలకొలిపియున్నారు, రాజుల దర్శించి, సంపన్నుల జూచి, "సన్మానము లంది బహుమానములన్ గ్రహీయించిరే” గాని, కావ్యలక్ష్మీవిలాసముల నరస్తవమునకుపయోగింపలేదు. నానారాజ సందర్శనమునందగుపడు చర్యలన్నియు, "జయంతితే సుకృతినో రససిద్దాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం" బను నార్యోక్తి జాటుచు, "ధరణీశులు మ్రొక్కగ నిక్కి నా" మను నిర్లక్ష్యమానస స్వాతంత్య్రమును, సూచించుచుఁడును. అంతకుమున్ను రాజాశ్రితులగు తెలుగుకవులు తామల్లినపొత్తముల రేడులకందించు వేడుకఁ బెద్దప్రొద్దు లోపికతో రేనిచూపుల గాచి యుండి, తిరుపతి వేంకటేశ్వరులు విజయనగరమున, నభినవభోజుడోయన సరస గుణసాంద్రుడై, సకలకళాసంపన్నుడై. కవికల్పవల్లియై వెలుగొందు ఆనందగజపతీంద్రుని గనుంగొని "ఎందరి జూచెనేని వరియింపదు మాకవితా కుమారి.......తటాలున దీనిఁ బరిగ్రహింపుమా” యని హెచ్చరించి, వసుమతీశులు కూడ కావ్య సామ్రాజ్యవైభవంబులు పరమాత్కృష్ట్యమును అంగీకరింపవలయుగారవ మేర్పరచిరి.
తిరుపతికవులు కావ్యసాధనమే మోక్ష సాధనమని విశ్వసించి, నిర్మలవిశుద్ధ రసానుభవమున నుత్తమగతుల జింద సుద్యోగింతురు. శ్రోత్రియమగు జీవనముకాని, వైదికాచార సంపత్తులు కాని, దేవతోపాసనకాని, పరతత్త్వమును, పురాణగాధలను పరివని బేర్కొనుటకాని, కవుల నిత్యసాధనగ వీరంగీకరింపరు. “శృంఖలాతృణీకరణమందు” కావ్యకలనానుకూలముగు మానసమే, రసాత్మకనుగు నీశ్వరోపాసనయే మోక్ష కారణమగునని జెప్పియున్నారు. ఇందువలన తిరుపతికవుల కుపాసితదేవి లేదన రాదు. వెంకటశాస్త్రి సహజగాంభీర్యముతో, "అస్మదుపాస్య, అమ్మహోదార చరిత్ర యియ్యెడల దారచియింపకపోదు సాయమున్" అని నిత్యము నమ్ముచుండెను. తిరుపతిసింగపు హృదయాంతరాళము, భీముని మానసమువలె, కోమలవినయలాలిత్య మొప్పుచు " హేయంబైన సభాపరాభవము రానీకమ్మ కాత్యాయనీ,” యంచు జాలి పలుకుల నమ్మను గొలుచుచుండెను. గురుజనఁబులగూర్చి వీరి కపరిమితవిశ్వాసముండెను. ఈ కృతజ్ఞతయే వీరి భక్తవర్గమును గూర్చగలిగినది. “వారింగన్న కవీశ్వరుండయిన, నెవ్వాడైన” గురుద్రోహ మొనరింపగూడదనియే వీరి యభిమతము. ప్రాచీన హైందవాచారములపట్ల పహేతుకమైన యభిమానముంచి నిలవదీయుచు, పాశ్చాత్య సంపర్కమున నేర్పడిన సంఘ సంస్కరణాభిలాషను నిగ్రహించుచు, జాతీయధర్మ ప్రతిస్థాపనలందు మాన్యత నేర్పరచుచుండిరి.
తిరుపతికపులు ఖండకావ్యములకు దారి జూపిరి. భారతభాగవతాది మహాపురాణములు రచించుటకు వలయు లోకానుగ్రహదీక్షయు, తపస్సంపత్తియు, రససిద్ధియు తిక్కన పోతనాదులు కొప్పియుండెను. ఆంధ్రకవితాపితామహుని మనుచరిత్ర యేగ్పడుకాలమునకే తెలుగుకవులపస కొంత చెడినదని జెప్పవచ్చును. పెద్దన మూడాశ్వాసముల బూరించినంతనే కాస్యవైఖరి మారినది. తరువాత కార్యకర్తలు ప్రబంధములలో నష్టాదశవర్ణనల నింపి, కావ్యమును ఖండచిత్రముల సంపుటముగ నోనర్చిరి. ఇవియు చేసుకూరివాని యనంతరము రసరూప సౌందర్యములు వీడినవి. సామర్థ్యమెట్లున్నను తిరుపతికవులకు ముందు బేరొందిన వీరేశలింగకవిగూడ, “శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన నైషధము” రచియించెను. తిరుపతికవులవధానకవిత్వమును జనరంజకముగ నొనర్చి, సుళువగు సరసమగు, లక్ష్మణ సహితమగు భాషలో సమస్తవిషయము