చున్న బ్రహ్మశ్రీ లంకా ముందరరామశాస్త్రి గారికి యీ సంఘపక్షమున వందనశతకంబు లర్పించుచున్నవాడను.
ఈ గ్రంథాలయమందు యేవిధమయిన పదవి లేకున్నను కడు జాగరూకతతో యీ గ్రంథాలయ భాగమును వహింపుచున్న వారలును, అసహాయయోగ ప్రవర్తకులును యగు శ్రీయుత రాళ్ళబండి వెంకటేశ్వరశర్మ, రంగావఝల రామకోటయ్యగార్లను యెంత్రయో యీ సంఘపక్షముస కొనియాడుచున్నాను.
ఈ గ్రంథాలయమున కుచితముగా గ్రంధములనిచ్చిన వారికి యీసంఘపక్షమున వందనశతకంబు లర్పించుచున్నవాడను.
అనంతరము శ్రీయుత బెల్లంకొండ రాఘవరావుగారు యీగ్రంథాలయవిషయమై చాలాపాటుబడిన బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రి గారిని శ్లాఘించుచు యీ గ్రంథాలయవిషయమును బోధించిరి. అధ్యక్షుని అంత్యోపన్యాసములోను మంగళవాద్యములతోను సభ ముగిసెను.
ఈ గ్రంథాలయశాఖయగు నాటకశాఖచే ఆరాత్రి శ్రీకృష్ణరాయబారము (పాండవోద్యోగము) కడురమ్యముగా సకలజనాహ్లాదకరముగా ప్రదర్శింపబడెను. మరుసటిదినము అనగా దుందుభి సంవత్సర కార్తికశుద్ధ ౧౨ రోజున తృతీయవార్షిక కార్యనిర్వాహక వర్గయెన్నికలు జరుగుటకై బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రి గారి అధ్యక్షతిక్రింద సభగావింపబడి యీ క్రిందివిధముగా యెన్నికలు జరిగెను:
అధ్యక్షుడు - బెల్లంకొండ రాఘవరావు, ఉపాధ్యక్షుడు — ముత్తరాజు లక్ష్మీనరసింహం. కార్యదర్శి — బెల్లంకొండ హనుమంతరావు. సహాయ కార్యదర్శి — ముత్తరాజు రంగారావు.
కార్యనిర్వాహక సభ్యులు —— బెల్లంకొండ రామారావు. బెల్లంకొండ జగన్నాధరావు. బెల్లంకొండ నారాయణరావు, కోట రామసుబ్బయ్య.
ఈ గ్రంథాలయపక్షమున హిందీ, రాజ్యాంగతంత్రము, చరిత్ర, వాఙ్మయము మొదలైన విషయములలో క్రమశిక్షణయిచ్చుటకు ఒక జాతీయపాఠశాల స్థాపించుటకై తీర్మానించడమైనది.
- బెల్లకొండ హనుమంతరావు,
కార్యదర్శి
శ్రీశారదా పుస్తక భాండాగారము, నాగిరెడ్డిపల్లె
అనంతపురముజిల్లా కదిరితాలూకా నాగిరెడ్డిపల్లె గ్రామమునందలి శ్రీశారదా పుస్తక భాండాగార సమారంభోత్సవము 1923 వ సంవత్సరము ఫిబ్రవరి నెల 13వ తేది మంగళవారము (మహాశివరాత్రి) నాటినాత్రి 9 గంటల సమయమున ధర్మవరపురవాసులును — సాహిత్య సరస్వతీ బిరుదాంకితులును, — అగు మ। రా౹ రా శ్రీ సీరిపి ఆంజనేయులవారి యాధిపత్యమున జరుపఁబడెను. ఊరిలోని చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు గ్రంథాలయమునఁ గ్రిక్కిరిసియుండిరి. కదిరిపురమునుండి కొందఱుసోదరులు విచ్చేసియుండిరి. ప్రారంభమున శ్రీయుత చిట్టా నరసింహప్పగారు ఈశ్వరప్రార్ధన చేసిరి. ఆహ్వాన సంఘాధ్యక్షులగు మ॥ రా॥ రా॥ శ్రీ మాచిరెడ్డి వేంకట స్వామిరెడ్డిగారు సభ్యులపక్షమున స్వాగతిపత్రముఁ జదివి యధ్యక్షుల కర్పించిరి. కార్యదర్శి గ్రంథాలయ నియమములను సభ్యులకు వినిపించెను. ఆనంతర మధ్యక్షులు తాము వ్రాసి తెచ్చియుండిన గ్రంథాలయోద్యమ చారిత్రమున, నీయూరి జనులయంతరువునకుఁ దగిన ముఖ్యావసరవిషయములఁ - దేటమాటల - నాకర్షకముగను నుపన్యసించిరి. సభాపతి తమ యంత్యోపన్యాసానంతరము, పదునేను రూపాయల విలువగల 33 గ్రంథములు, నిలయమునకు దానము చేసి, యితరులకు మార్గదర్శులైరి. తదుపరి క్రింది విరాళములు కృతజ్ఞతాభివందన పూర్వకముగ నందుకొనఁబడినవి.