వసూలు చేసి వారికిని ఇందు భాగము కల్పించి ద్రవ్యమును సమకూర్పవలయును. పిమ్మట గ్రంథాలయావశ్యకతను గూర్చి శ్రీయుత వేమూరి శ్రీరాములుగారును, గ్రంథాలయ తత్వమును గూర్చియు, యీ గ్రంథాలయము జరుగుచున్న విధమును గూర్చియు బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రులు గారును ఉపన్యసించిరి. తదుపరి గ్రంథాలయ కార్యదర్శియగు శ్రీయులి బెల్లంకొండ హనుమంతరావు గారు యీ క్రింది కార్యనివేదికను చదిపిరి: —
కార్యనివేదిక
సుజ్ఞానజనకంబునకు మూలస్థానంబును ధర్మార్థ కామమోక్ష చాతుర్విధ పురుషార్థప్రదంబును, కామక్రోధాద్యరి షడ్వర్గ దూరీకరణంబును, సర్వజన విద్యాబోధకంబును, దేశీయవార్తాజ్ఞాసదివ్యచక్షువును,సర్వమతబోధికంబును,గాఁధ్యుపదిష్ట అసహాయయోగితత్వవిస్తరీ కరణంబునకు,ఆధారభూతమును, యగు గ్రంథాలయం బత్యవసరమనియెంచి సర్వజనానుమతంబై దత్సహాయంబున రౌద్రి సంవత్సర విజయదశమి భృగువాసరంబున యీ గ్రామంబున నొక గ్రంథాలయంబు స్థాపింపబడియె.
గ్రంథాలయ ప్రకరణోచితంబగు గ్రంథాలయ నామకరణంబు యుక్తంబుగాన కీర్తిశేషులును, న్యాయవేదాంత ధర్మశాస్త్రముల కాకరుండును, అఖండ విద్యాప్రదాతయును, యేతత్పురవాసియు, అస్మద్వంశాభిమృగలాంఛ నుండు నగు శ్రీయుత బెల్లంకొండ రామారావుగారి నామంబుచే యీ గ్రంథాలయం బలరారుట యుక్తమని యెంచి సర్వజనానుమోదితంబై " శ్రీ రామా రాయగ్రంథాలయం” బనుపేర యీ గ్రంథాలయంబు స్థాపితంబై యేతావత్పర్యంతము శోభిల్లుచున్నది.
దుర్మతిసంవత్సర ఆశ్వయుజ బహుళ విదియయందు పల్నాడుతాలూకా అంబాపుర గ్రామవాస్తవ్యులును, ప్రస్తుత మీ గ్రామమందు సంస్కృతవిద్యాప్రబోధకులును యగు బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రిగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ గావింపబడి యందు సకల జనానుమోదిశంబయి, అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షుల యెన్నికలు జరుపబడియె.
అధ్యక్షుడు— బెల్లంకొండ రాఘవరావు. కార్యదర్శి — బెల్లంకొండ హనుమంతరావు. ఉపాధ్యక్షుడు —ముత్తరాజు లక్ష్మీనరసింహం గార్లున్నూ నిర్ణయింపబడి ప్రతి శనివారమును యీ గ్రంథాలయ శాఖయగు భజనశాఖచే భజనలు జరుపబడుచున్నవి. యీ గ్రంథాలయమందు బ్రహ్మశ్రీ లంకా సుందర రామశాస్త్రిగారిచే కార్తిక శుద్ధ ౫ మొదలు మార్గశిర పూర్ణిమపర్యంతము జైమినీ భారతమున్నూ, దుర్మతిసంవత్సర మార్గశిర బహుళ ౧౧ మొదలు మాఘ బహుళ సప్తమి పర్యంతము అధ్యాత్మ రామాయణమున్నూ పురాణరూపకముగా చెప్పబడియె. పుష్య శు ౨ (విదియ) రోజున యీగ్రంథాలయమందు సీతాకల్యాణ మహోత్సవమున్నూ జరుపబడియె. మాఘ బ౯ రోజున శ్రీరామపట్టాభిషేక సమారాధనయు జరుపబడియె. శ్రావణబహుళ ౧౧ రోజున యీ గ్రంథాలయపక్షముని తెప్పఉత్సవము జరుపబడియె. భాద్రపద శుద్ధ ఆ రోజుక యీ గ్రంథాలయ నాటకసంఘముల యొక్క ఛాయాపటగ్రహణమున్నూ జరుపబడియె. మార్గశిర శుద్ధ ౧౫ రోజున గతసంవత్సర వార్షికోత్సవమందు ఆమోదింపబడిన శ్రీయుత బెల్లంకొండ సీతారామయ్య గారి స్మారకోత్సవమున్నూ జరుపబడియె.
ఈ గ్రంథాలయమునకు సరుకూర్చిన గ్రంధములు 320. చందాదారులు 10. నిత్యమువచ్చు ప్రేక్షకుల సంఖ్య 2103. రోజునకువచ్చు ప్రేక్షకుల సంఖ్య 7. గ్రంథ గ్రాహకుల సంఖ్య 153. ఈ గ్రంథలయమునకు వచ్చువార్తాపత్రికలు (1) ఆంధ్రపత్రిక (దినపత్రిక) (2) కృష్ణాపత్రిక (3) అభినవ సరస్వతి.
గ్రంథాలయ ఆదాయవ్యయ నిర్ధారక పట్టిక :
ఈరోజున కార్యదర్శి వద్ద నిల్వయున్నది కు7-4-0 లు.
గీర్వాణ వాఙ్మయమున కస్మదాదుల కాద్యగురువులును, పండితోత్తములును, యీ గ్రంథాలయమందు యేవిధమయిన ఆధిపత్యము లేకపోయినను అస్మదాదులవలె శ్రమతీసుకొని యీగ్రంథాలయమును ఉద్ధరించు