గీర్వాణములయందు గట్టిపునాది కుదిరిన వెనుక గాని యాంగ్లభాష నేర్పబడదు. తర్కము, వ్యాకరణము, వేదాంతము మున్నగు శాస్త్రములన్నియు నిప్పుడు సంస్కృతమునందేయుండుటచే నాకాశాస్త్రములు పూర్వసుమాదిరినే బోధింపఁబడుచున్నవి. గురుకులవాసమున విద్యాభ్యాసముకల్గినఁగాని దైవభక్తి, జాతీయభావము, దేశభక్తి, గురుభక్తి మున్నగుణవి చిన్ననాటనుండియు నలవడుట స౦భవి౦పదు. చిన్న నాటనేకుదిరిన గాని పెద్దయయిసవెనుక నివి లభ్యముగానేరవు. అందులకై గురుశిష్యులు విద్యాలయమునందెయుండి విద్యాభ్యాసము జరుపుటకు దగినయిరవు కొంతవరకే ర్పరుపఁబడింది. వర్ణాశ్రమవిధుల ననుసరించి చాతుర్వర్ణ్యములవారికిని విద్యగరపునేర్పాటులు చేయబడినవి.
ఇప్పుడు 60 మంది విద్యార్థులును 8 గురు ఉపాధ్యాయలును నున్నారు. విద్యార్థులందఱకును భోజన సదుపాయముచితముగానే చేయబడుచున్నది. ఏ కొలది మందియొ తప్ప విద్యార్థులందరును గాళిదాసత్రయయువఱకయినను సంస్కృతము నేర్చిన వారేగాని కింది తరగతి వారు లేరు.
అధ్యాపకభృతికిని విద్యార్థుల భోజనములకును నెలకు దాదాపు వేయిరూపాయిల ఖర్చున్నది. విద్యాలయమునకు నాలుగువేల రూపాయలు వఱకును వచ్చు స్టిరవసతులున్నవి. ఇందులో గొన్నిభూములు దానపూర్వకముగ లభ్యమైనవి. దాదాపు ఇరువైవేల రూపాయిల యప్పులున్నవి. అవి తీరనఁగాని ఆ యాదాయమును దీనివెచ్చిమునకై స్వేచ్ఛగా వినియోగింప నవకాశము లేదు. దొరతనము వారి సహాయము గత సం॥రం రు.600 లు మాత్రమె వచ్చినవి. ఒక్క నెల వెచ్చమునకుకూడ జాలదు.
విద్యాలయమునకు రెండు భవనములు మాత్రమున్నవి. ఒకటి విద్యామందిరము, రెండునది భోజనశాల. అధ్యాపకులకు వాసగృహములును విద్యార్థులు చదువుకొనుటకు బ్రత్యేక భవనములును నిర్మింపవలసియున్నది. స్థలము మాత్రము
సంపాదితమైనది. ఈ యిండ్ల కన్నిటికిని సధమ మిరవైయైదువేల రూపాయిలయిన నుండవలెను.
మొన్నటివఱకును సంస్కృత విద్యాశాలలకు నూపగెంటెండెంటుగానున్న శ్రీమత్ తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులు ఎమ్. యె. గారు నెలకు రెండు వందల రూపాయిలు వచ్చు తమ యుద్యోగమును వదలి దీనికి నియంతగానుండి యుచితముగా
బని చేయుచున్నారు. బ్రహ్మశ్రీ పురఘళ్ళ సూర్యనారాయణశాస్త్రిగారు విద్యాలయమునకు చందాలు పోగుచేయు విషయమున ధర్మార్థముగ రాత్రిం బగళ్ళు మిగుల గష్టించి పనిజేయు చున్నారు
అమర గానము.
మధుర సంధ్యల వీధిగుమ్మములనిలచి
అలతిసిగ్గుల వాడిచూపులను 'మెలసి,
మొలకనవ్వుల విశ్వమ్ముఁ గలత పెట్టు
పదిపదా పేండ్ల వయసు పైఁబడని పడుచు
పిల్లలు, తమంతఁదాముగా నల్లుకొనిగ
సంస్కృతములైన నిడువాలు జడల ముడువ
మొగ్గ విడిచిన పరనుల్లెపూవు టర్మ
లనుదొడిగి దివ్యసుమకోమలమ్ము
3
అయిన
యువకుల హృదంతరమ్ముల నవయ నేయు
మన్మధునివిఁటిసడి వినంబడు వసంత
చంది కాస్వాద్ర యమునాప్రశాంతే సలిల
మృదుల భావగీతమ్ముల మేళవించి
ప్రకృతి సర్వమ్ము తన్మయక్వమ్ము నొంద
మురళిమో యింపఁగ లిగిన ముద్దుకృష్ణు
సమర గానమ్ము లీలాశుకాదు లట్టి
ఎఁదఱి కవీశ్వరులనో సృజింపఁగలదు.
-కొడాలి ఆంజనేయులు.