Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవనేక భవార్ణిత ♦ నిశ్చలాస్మ
దీయపదభక్తి సంజాత ♦ దివ్యసుకృత
వాసనావాసితుడవు శ్రీ ♦ వత్సగోత్ర
పావనుడ వెన్న నండూరి ♦ బాపమంత్రి.


ఈతని కవిత్వము చాలవరకు సంస్కృత పదభూయిష్టమై యలగారుచున్నది. తనగ్రంథము ప్రబంధమువలె నుండవలెనని యెంచి సరిసమైన వర్ణనలతో పూరించినాడు. చతుర్విధ కవిత్వము లీకవికీ తెలియును. గ్రంథమంతయు రసవంతముగనున్నది. చాలచోటుల లేఖక ప్రమాదములున్నవి. కొన్ని కొన్ని చోట్ల రసవంతమైన వర్ణనలు గలవు. భాగవతములో దశమస్కంధమున కృష్ణావతార ఘట్టము. కృష్ణుని బాల్యక్రీడ, రుక్మిణి సత్యభామల పరిణియము నీకవి క్లుప్తముగా తన గ్రంథమున నిమిడ్చి యున్నాడు. చక్కని జాతీయోక్తులందందు చూపట్టెడి. చాలవరకు పూర్వకవులపోకడలచే నలరారుచున్నది. ఇట్టి గ్రంధము నాయొద్ద తాళపత్రములపై వ్రాయబడి యున్నది. ఈ గ్రంథము నచ్చు వేయించుట కింకొక ప్రతియైనను కావలయును గదా! కావున పాఠక మహాశయు లెవ్వరి వద్దనైనను నిట్టి గ్రంథమున్నచో సరిచూచుకొనుటకు బంపఁబ్రాంర్థతులు.


శైలి దెలియుటకై కొన్ని పద్యములు

ప్రధమాశ్వాసము

చ౹౹⁠

 సురవర మస్తకాంచితవి ♦ శుద్ధ సువర్ణకిరీట భాగవి
స్ఫురదురుపద్మరాగమణి ♦ పుంజమరీచివిరాజమానసుం
దంతర పాదపద్మ వసు ♦ ధాధర రాజకుమారిగౌరి శాం
కరి కరివక్త్రుతల్లికుతు ♦ కంబున మాకొసగు౯ శుభో[న్నతుల్

⁠


సీ౹౹⁠

 వేదాంతవీధుల ♦ విహరించు పరతత్వ
మాభీర గృహముల ♦ యందుమెలగు
సరసిజభవముఖా ♦ మరులసంగతినుండు
ప్రోడకుఱ్ఱలతోడ ♦ గూడియాడు
యిందిరారమణితో ♦ నెలమి గ్రీడించెడి
బలువేల్పు గొల్లనె ♦ చ్చెలుల గవయు
ఘనతపోధనులైన ♦ గనలేని నిర్గుణ
బ్రహ్మంబు గొల్లలఁ ♦ బాయరు౦డు
గణన యిడరాని బ్రహ్మాండ ♦ గణములాత్మ
కుక్షియంగువ దోంతిగా ♦ కుదురు కొల్పు
దేవదేవుఁడు రేపల్లె ♦ లోవసించు
భువనముల గాచుమేటి ♦ గోవులను గాచు.

⁠


ద్వితీయాశ్వాసము

క౹౹⁠

 హరియొకడేగెనుమమగదే
శ్వరముఖనరపతులు వైద్య ♦ సహాయముకై
బఱతెంతురు చెలికొనునెడ
దురమగునని బలుడుబలము ♦ తో౦జనెవెనుక౯

⁠


సీ౹౹⁠

 పాకశాసనవధూ ♦ ప్రాసాదశిఖర సం
కలితహాటకరత్న ♦ కలశమనగ
యామినీ సతికంఠ ♦ సీమనెంతేనియు
శోభిలు మంగళ ♦ సూత్రమనగ
ప్రాగ్వామలోచనా ♦ ఫాలభాగంబున
దీపించు కాశ్మీర ♦ తిలకమనగ
కదులజాండవ్యాప్య ♦ ఘనతిమోని హృతికై
దేవతలుంచిన ♦ దీపమనగ
తామరలు గ్రుఁగకై రవ ♦ తతిజలింగ
జలధులుప్పొంగ చీకట్లు ♦ కడగొలంగ (యతిలేదు.
జగములలరంగ జక్కవల్ ♦ జతివిడంగ
సోముఁడువయిందె సత్కళా ♦ ధాముఁడగుచు.

⁠


గీ౹౹⁠

 మేనమామను దునిమిన ♦ వానికన్యు
లెంతలక్ష్యంబు జగతిపై ♦ నెంచిజూడ
కొంకకీంచుక లేకయు ♦ గుడియుమ్రింగు
కఠినునకు నందివడియంబు ♦ గాదెనుండు

⁠


౼ పులిపాక వేంకట రామారావు