Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దఁటు లక్ష్మీనరసింహం
కార్యదర్శి
సిద్దపల్లి, ౭-౧౦-౨౧

నండూరి బాపయమంత్రి

ఈకవి, సకలజనమనోరంజకఁబగు విఘ్నేశ్వర చరిత్రమను రెండాశ్వాసముల గ్రంధము రచియించి వెంటనే సోమేశ్వరస్వామికి అఁకితము చేసెను.

గద్య

ఇది శ్రీదక్షిణామూర్తి వరప్రసాదలబ్ధకవితా మాధురీ ధురీణ నండూరి బాపయమంత్రి ప్రణితంబయిన సకలజనమనౌరంజనంబగు విఘ్నేశ్వర చరిత్రయను ప్రబంధంబునందు ప్రధమాశ్వాసము —

ఇతఁ డార్వేల నియోగి, శ్రీవత్స గోత్రుఁడు. వెంకమంత్రికి బుచ్చమాంబకు తనయుఁడు. వెంటురి గ్రామ నివాసి, పురాణములందు విఘ్నేశ్వర చరిత్రను, ప్రభంధముగా రచియించెను. కవి శాలివాహన శికము, ౧౭౩౧౦ ఈశ్వరనామ సంవత్సరమున తన గ్రంధము రచియించి నట్లే విధముగ తన గ్రంధమున జెప్పినాడు.


సీ.⁠

ఒప్పుమారగభవి ♦ ష్యత్తరస్కందభా
గపతిపురాణస్థ ♦ గాధలరసి
సకలజనానురం ♦ జనముగా విఘ్నేశ్వ
రచరిత్రయనియెడి ♦ గ్రంధమొకటి
నా నేర్చినట్టులొ ♦ నర్చితి శాలివా
హనశకాబ్దములునం ♦ దాగ్ని శైల
హిమకరి సౌజ్జల ♦ నెసగునీశ్వరవత్స
రంబున, నిందుదో ♦ షంబులున్న
గణనసేయకగుణములే ♦ గైకొనుండు
సాధుఫలముల తృగ్విజనమితివిడిచి (యతిలేదు)
సారముగ్రహించువైఖరి ♦ సంతసమున
రసికులైనట్టికవిబుధ ♦ ప్రవరులార.

⁠

కవి తన స్వప్నమందు శ్రీసోమేశ్వర స్వామివారు సాక్షాత్కరించి తనకీ గ్రంధమంకింతము చేయుమనిజెప్పుచు యీతనివశీఁకులగూర్చి నీ విధముగా బలికినట్లు జెప్పినాడు.

సీ.⁠

 నీతాతతండ్రిలో ♦ కాతీత విశదవి
ఖ్యాతయశస్కుండు ♦ కామరాజు
నీతాతభూసుర ♦ నివహబంధువ్రాత
పరిపోషణుండు ♦ బాపప్రధాని
నీతండ్రి శేతుకా ♦ శీతలమధ్యభూ
విభుసభాపూజ్యుండు ♦ వెంకమంత్రి
నీతల్లి భువనవ ♦ ర్హితదానధర్మప్ర
పూతగుణాలంబ ♦ బుచ్చమాంబ

⁠