ప్రప్రధమమున ఈ గ్రంథాగారము ౧33 గ్రంధములతో స్థాపించబడి యిప్పటికి ౬౭౧ గ్రంధములతో గొప్పారుచున్నది.
ఈ గ్రంథాలయముమీది యభిమానముచే మా గ్రామస్ధుల జామాతయు, తెనాలి తాలూకా యడ్లపల్లి గ్రామకాపురస్తులగు బ్రహ్మశ్రీ తూటుపల్లి వేంకటసుబ్రహ్మణ్యంగారును తదితరులును విద్యాభివృద్ధికైఁ బాటుపడుచున్నారని చెప్పుటకు సంతసించుచుంటిని. వారిని భగవఁతుఁడుఁ బ్రోచుగాత?
వార్తాపత్రికలు
ఈక్రింది యాంధ్ర వార్తాపత్రికలు ప్రకృతము గ్రంథాగారము నలంకరింపుచున్నవి.
౧. ఆంధ్ర దినపత్రిక ౨. అభినవ సరస్వతి 3. కృష్ణాపత్రిక ౪. సాహితి ౫. గ్రంథాలయ సర్వస్వము
వెనుకటివలెనె (౧) అంధ్రదినపత్రిక (౨) అభినవ సరస్వతి (3) కృష్ణాపత్రిక యీ మూడును బ్రహ్మశ్రీ దంటు లక్ష్మీకాంతం గారి చేతిను (౪) సాహితి గుంటూరు కాపురస్తులకు బ్రహ్మశ్రీ అనుమల సత్యనారాయణ గారి చేతను, యీ గ్రంథాగారమున కుచితముగ నొసంగు చున్నందులకు వారికి వందనము అర్పించుచున్నారము
౫. గ్రంథాలయ సర్వస్వము. ఇది యీ గ్రంథాగౌర కార్యనిర్వాహక సభ్యులచే గ్రంథాగారము పేరట గ్రంథాగారపు సొమ్మునుంచి తెప్పించబడు చున్నది.
సభలు
కార్యనిర్వాహక సభలు:- ఈ గ్రంథా గార కార్యముల నిర్వహించుటకు యీ సం|| శ్రీ కార్యనిర్వాహక సభలు మాత్రమే జరుపబడినవి. ఈ లోపమును రాబోవు సంవత్సరము తీర్చుకొనగలరని కార్యనిర్వాహక సభ్యులను ప్రార్థించుచున్నారము.
బహిరంగ సభలు:- ఈ సంవత్సరమున గ్రంథాగార పక్షమున ఆంధ్ర భాషలో 3 బహిరంగసభలు మాత్రమే జరుపబడెను. రాబోవు సంవత్సరము యింతకంటె నెక్కువ సభలు కావింపవలెనని కుతూహలము గలదు.
ఈ వత్సరమున యీ గ్రంథాగారము శ్రీ చందా దాక్లను గలిగి ౬ంం ఆంధ్రగ్రంధములతోను ౧౭ సంస్కృత గ్రంథములతోను, ౫౦ ఆంగ్లేయ గ్రంథములతోను, 3 నాగరలిపి గ్రంథములతోను, ౬3౦ గ్రంధములతో నొప్పుచూ, ౫ ఆంధ్ర వార్తాపత్రికలచే నలంకబడి యనుదినము ౬ గురు చదువరుల నాకర్షి ఁపుచున్నది.
గృహము:౼ ప్రప్రధమమున నివేదించినట్లు గ్రంథా గారము యీ గ్రామకాపురస్తులురు కీ॥ శే॥ లగు సీతారామయ్య గారిచే నిర్మింపబడిన గృహమునందే యిప్పటికిని నెలకొనియున్నది. సర్వదా అందేయుండి సర్వజమోూపయుక్తము లగునట్లుగ పని చేయుచుండ గలందులకును, రాబోవు తృతీయ వత్సరముకూడ యీ గృహమునందేయుంచి గ్రంథాగారము నిర్విఘ్నముగ సాగించు ప్రయత్నములు చేయుచుండగలందులకును ఆ సర్వేశ్వరుని యనేక విధములుగ ప్రార్ధించుచున్నారము.
బీరువా
ఆర్యులారా! ఈ గ్రంథాగారమున బీరువాలు లేని లోపము యెక్కువగ నున్నది. గోడకు కొయ్య మేకులు కొట్టి వాటిపైన బల్లలు పరచి రకమువారిగా విలియావేసిన పుస్తకములు వుంచి యీ రెండు వత్సరములును యెట్లనో కాలము గడిపితిమి.
నానాటికి పుస్తకముల సంఖ్య వృద్ధి యగుచుండుటను బట్టియు, గొప్ప ఖరీదుగల పుస్తకములు సహా విడిగ యుంచవలసి వచ్చుచున్నది. గాన యీ లోపమును యే మహాశయులైనను, తీర్చగలందులకు కోరుచున్నారము. బీరువాకుగాను యీ వత్సరము వసూలయిన రు ౧-౦-౦ తో నీలోపమెట్లు తీరగలదో మీరే యూహించుకొనగలరు. ఈయనయే
చదువరులు:— సభ్యులు ౪౯౪ సార్లు పుస్తకములలు తీసుకొనివెళ్లిరి. ఇందు బ్రహ్మశ్రీ దంటు రాఘవయ్యగారు ౬౦ పుస్తకములను జదిపిరి. అందరికన్న అధిక పుస్తములం జదివినని తెల్పుటకు సంత సించుచుంటిమి. ఇట్టి చదువరులు ౫, ౬ గురు ఉండిన గ్రంథాగారము లెంతయో విరివికాగలవు.
శ్రీ దుర్మతి సం॥ ఆశ్వయుజ శు ౭ ల నుంచి వరకు శ్రీ దుర్మతి సం॥ ఆశ్వయుజ శు ౭ ల వరకు గ్రంథా గారవృద్ధి క్షయయములను తెలుపు పట్టిక.
ఆదాయ వ్యయములు
శ్రీ రౌద్రినామ సంవత్సర. ఆశ్వయుజ శు౭ లనుంచి శ్రీదుర్మతి సం॥ ఆశ్వయుజ శు౭ ల వరకు ఆదాయ వ్యయములు.