మున సుధీర్ణులై పట్టప్రధానము బొందనున్న శ్రీయుత శీరిపి యాఁజనేయుల వారిని గూర్చి శ్రీ క్రియాశక్తి యొడెయరు, సమాజ సమ్మానోత్సవ సంఘపక్షమున సన్మానించుచు ఎల్లమరాజు వెంకట నారాయణభట్టుగారు ప్రశంసా పద్యములను హృదయరంజకముగ జదివి వారికి సమర్పించిరి. నడుమ నడుమ వారు శ్రావ్యతర గీతములను సుమనోహ్లదముగ బాడిరి. అగ్రాసనాధిపుల యంత్యోపన్యాసము ముగియగనే సభికులకు తాంబూల పుష్పముల కర్పించుట యయ్యెను. కృతజ్ఞతాభివందనములు సమర్పించినతోడనే సన్మాన సంఘపు ఛాయాపటము శ్రీమరాటి కాశీరావు గారిచే దీయఒడినది. సభ్యుల కరతాళధ్వనులతో సభ ముగిసెను.
స్వాగతము
ఈసన్మానోత్సవ సంఘపక్షమున శీరిపి అచ్చమాంబయను బాలిక యొ సంగిన స్వాగతము. ఈమాయింటి వాకిలి కడ వేలుచున్న యట్టముక్కలో స్వాగతమను మాట వ్రాయబడియున్నది. దానిని జూచియే మహానీయులైన మీఱందరు లోనికివచ్చి మీపాదధూళిచే నీగుడిసెను పవిత్రముచేసినారు. స్వాగతమను మాటకు కుశలప్రశ్న మనియు సుఖముతోవచ్చట యనియు నర్ధము. మీరు సౌఖ్యముగ నిచ్చటకు రావలెనని కోరుటయు, వచ్చిన మిమ్మును గూర్చి కుశలప్రశ్నము గావించుటయు, మాకు ముఖ్య ధర్మమైయున్నది. నేడు మీరందఱును మాకతిధులైయున్నారు. మీతోగూడి కూరుచుండియుండు నామామ గారుకూడ నేటి మాసన్మానమునకు బాత్రులగుచున్నారు. ఈకారణముచేత నేటిపనియంతయును మాపైనిలచి యున్నది. మాకేమియు దెలియదు. కసుగందలమగు మేమేమియుఁ జేయజాలము. అయినను నాకు మాతులసదృశులు మాత్రమేకాక మీదుమిక్కిలి జనకసమానులగు వేంకటనారాయణభట్టుగా రెందులో నెక్కువగ పాల్గొనిరి. మరియు నిందు విశేషభాగము సమాజసభికులకును జెందియున్నది. కనుక మాకును గొంతభారము తరుగుచున్నది. ఉత్సాహము పెరుగుచున్నది. పెక్కుచోట్లు తిరిగి యనేక సభలు చూచి విశేషానుభముబొందిన మహానీయులు నేడిచ్చట చేరియున్నారు. వింతవింతలగు రూపములను జిత్రింపగలశక్తిమంతులునున్నారు. మనోహరములగు కరశిల్ప విద్యలం దారితేరినవారును గలరు. రసభరితమగు తమకవిత్వపు సొంపుచే వినువారికిఁపు గూర్చు ధీమఁతులున్నారు. సెలయేటి ప్రవాహమువలె నొకేతీరున నుహ్యసింపగల మహాత్ములునున్నారు. ఆట్టి యీసభామండలికి లోకానుభవనుమ మాటయే యెఱుఁగని మేమెట్లు స్వాగతము గావింపగలము? ముందు ముందు అట్టి తెలివియు నట్టియోగ్యతయును మాలోపొడమ జేయుటకై మీ పాదరజమును మేము మిక్కిలి కోరుచున్నాము. అందుల కిదితగిన సమయము. అట్టి మేటిశక్తులుచి మాలో సత్వరముగ బయలు దేరుటకై మేముమాఫణములను మీ చరణములపై వ్రాల్చెదము. దీనినే స్వాగతముగ గ్రహించి నేటిమాపనులయందు మీకగపడు లోపములనుసైచి మమ్ము దీవింప వేడుకొనెదము. మిక్కిలి ప్రార్ధింతుము.
ఈ సంఘ సాపకులగు శ్రీ శీరిసి ఆంజనేయులుగారిని సన్మానించుచు శ్రీ వేఁకటనారాయణభట్టుగారు ప్రశంసాపద్యములను జదివినారు. అందుండి ఒక పద్యము నిట బొఁదుపరిచుచున్నాము:-
సీ| విమలతర గ్రంధ సముదయంబు రచించి
అతిధి యభ్యాగత ప్రతుతలయెడఁ బూర్ణ
ఆత్మవత్సర్వ భూతాని యన్పల్కన్వ
నిర్మల వైరాగ్యనియతిఁ బాటించి సా
తే| నిన్నుదనయునిగా భువి గన్నయట్టి
జననిసుకృతఫలమ్ము నేమనగవచ్చు
భరదురాచార తిమిర భాస్కరుఁడ వగుదు
వమలగుణ గేయ! శీరిపియాంజనేయ!