దరువాతి యరసున్నలను బయి వైయాకరణులు నియములనుబట్టి సులువుగానే తెలిసికొనవచ్చును. హస్వమునకు దర్వాతనుఁడు సిద్ధపూర్ణానుస్వారస్థలము నిర్బిందుకమై గూడ వ్యవహరింపబడునపు డాస్థలమున నియతముగా సిద్ధఖండాను స్వార మున్నదని గ్రహింపవచ్చునుగదా.
ఇఁకఁ గొఱవడియున్న దీర్ఘమునకుఁ దర్వాతి సిద్ధాస్థానుస్వారము మాత్రమే (సాధ్యము వ్యాకరణ సాధ్యమే యగునుగదా) దుర్గ్రహమయియున్నది. దానిని దెలిసికొనుటకు మాత్రము వెనుక నుదాహరించిన ప్రాచీన తాళపత్ర గ్రంధస్థద్విత్వలేఖన పద్ధతియు, (బాచీనత మహాకవుల యద్ధబిందు ప్రాసస్థలములును,) నాయాయాచ్ఛిక పదములకు మూలభూతములగు నితిర ద్రావిడ భాషల పదములలోను సంస్కృత ప్రాకృత పదములలోచు నుండు ననునాసికాక్షరములును వీనిని బట్టి చాలవరకు గ్రహించి వ్రాసిన కోశాదులలోని యర్ణాను స్వారప్రదర్శనములును మాత్రమె చాలవఱకాధారములై యున్నవని చెప్పకతీరదు.
ఇఁకఁ బయినుదాహరించిన యాధారములను బట్టి గ్రహించిన దీర్ఘపూర్వక స్థలములలోని సిద్ధఖండముల నాంధ్ర పండితులు ధారణ చేసికొనవలసియున్నది. అట్లు ధారణచేయుటకూడ దుష్కరమనితలఁచి కావలయు నిఁకను గొంతవఱకు సులువుపడు
నట్లుగఁ జేయదలఁచి యాంధ్రభాషలో వెచ్చటనైననను స్వాగమాత్రముండినచోఁ బరుష సరళములకు ముందేయుండునని “తృతీయే ప్రధమే వర్ణే, పర్యవహిదృశ్యతే బిందుర్త్య కృతమధ్యేత్ర నాన్యవర్ణే పరేతుసః” అని ఇట్లు ధర్యణుడు దీనిని బట్టి పయిరీతిని దీర్ఘములకుఁ దరువాతి సిదఖండములను ధారణచేయుటగాని యరసున్న యిటఁగలవా లేదాయని వికల్పించుటగాని పరుషసరళములకు ముందటి చోటులందు మాత్రమేయని తేలుచున్నదిగదా. అచ్చాంధ్రములో నిట్లు బిందువుండిన యెడలఁ బరుషసంళములకు ముందుమాత్రమె యుండుట సంభవించుటకు దగినకారణములను గూర్చి వేణోక వ్యాసము వ్రాయఁదలఁచి యుండుటచే నిట నింతతో విరమించుచున్నాను.సూత్రించియున్నాఁడు.
పయిరీతిని నిరాధారస్థలములలో నాకాశసౌధమును నిర్మించి యరసున్న యు౦డు స్థలములను దెలిసి కొనుటకుఁ గొంత యాధారముఁ జూపిన యాంధ్ర వైయాకరణులయెడ నాంధ్ర పండితలోకముకృతజ్ఞమై యుండవలసినదేగాని యల్లుచ్చారణమున
బొత్తిగా నశించిన యీ యరసున్న నిపుడుగూడ నుచ్చారణములో నిర్వివాదముగా వదలుకొనుచు వ్రాతలో మాత్రము చూపక తీరదని యేల పెనఁగులాడవలయుమో? యనాది ప్రవాహరూపమగు భాషలో ననేకవర్ణములు పుట్టుచు గిట్టుచు నుండఁగా నొక్క యీయర్థనుస్వార విషయమున మాత్రమె యింతవఱకేల శ్రమింపవలయుమో? ఇక దామరసాది శబ్దములలో లోపించిన సకారాదులకే లేనిగురుతులు పెట్టి వానిని సైతము చూపుటకేల పెనఁగులాడరైరో? తెలియకున్నది.
ఇట్లు సుజనవిధేయుడు,
వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి
.
ఆంధ్రదేశాభిమాని. సీ॥ దేశీయులెల్లరు దేశీయ విద్యలం బోషింపగా దీక్షఁబూనవలయు ప్రతిగ్రామమందును జూలె దేశీయం పుఁ బాఠశాలలను నేర్పరచవలయు తల్లిదండ్రులు తమపిల్లల దేశంవుఁ బదులకు ముదముతోఁబృపవలయు ఘన సత్రములు గుళ్లు గట్టించు విధముగా విద్యాలయములు స్థాపింపవలయు 0 4) లోపించిన సకారా
గీ|| ప్రజలు చే సెడు దానధర్మంబు లెల్లఁ జదువుల కె వినియోగపర్చంగ వలయు విద్యచే నెల్లవారలు వెలయవలయు ననుచు భాషించు నాంధ్ర దేశాభిమాని॥ || బహుఘోరతరములౌ బాల్యవివాహముల్ మించి తా మొకÚక్క నొందుదుండ విపరీత గతినొప్పు వృద్ధవివాహంబు సీ లేఁచి తా మొకమూల వేచుచుండ