యొక్క సహజస్థితి నంత గాఁ బాటింపక ప్రక్రియానిర్వహణమాత్ర తత్పరత్వమున బయి చింతామణికారిక యుత్తరార్థమునకర్షము చేయుటలో సః అను సర్వనామమునకు "ససిద్ధ స్సాధ్యశ్చ ఖండానుస్వారః” అనియిట్లు ఖండానుస్వార పరముగా నర్థముచేసి యవతలను హ్రస్వ పూర్వక ఖండానుస్వారము వికల్పముగాఁ బూర్ణమగునని యొక విపరీతార్థమును జేయవలసి వచ్చెను. కావుననె "మహతస్సోర్డుజనితోభవేత్పుఁసి“ అను సూత్రపువ్యాఖ్యలో "అనుక్త మన్యశబ్దానుశాసన వదితి న్యాయేన సానునాసి కోచ్చారణం జిదితి సూత్రేణసానునాసికత్వే రాముఁడు హ్రస్వాత్ పరత్వాత్ రాముఁడు ఇతిరూపద్వయమ్” అనియిట్లు ప్రక్రియను జూపియుండెను. (అహో ౨౪౪ పుట).
'పాలకోసము ఱొలమోఁత' అనునట్లు పయినీతినిజిత్వంలమును న్యాయసిద్ధముగాఁ గుదుర్చుటకయి సహజస్థితికి విరుద్దముగా నరసున్ననుండి నిండుసున్నను బుట్టించుట యర్హమా? ఉచ్చారణస్వభావమును బట్టిగాని వెనుక నుదాహరించిన యనుస్వార చరిత్రమునుబట్టి గాని పరిశీలించునపుడు నిండుసున్నయే వ్యవహార వశమున నరసున్నగా మాఱెనుగాని యరసున్న నిండు సున్నాగా మారలేదన్న విషయమెవ్వరికేని విశదము కాకమానదుగదా. సుఖముఖోచ్చారణము నపేక్షించు వ్యవహారమున నూఁది పలుకవలసిన దానికిఁ దేల్చి పలికెడి పలుకుబడి సంభవించుట సహజముకాని దేల్చిపలికెడిదాని కూఁది పలికెడి పలుకుబడి కారణాంతరమేదియు లేకయే సంభవించుట సహజముకాదుగదా. సంస్కృత ప్రాకృత భాషలలో సైతము మన యీ యర్ధానుస్వారమువంటి యనునాసిక పాఠమున కిట్టి యనుక్రమమెయగపడుచున్నది. మొదట బింద్వాది రూపముగా నుచ్చరింపఁబడుటయుఁ దర్వాత సాను నాసికముగా బలుకఁ బడుటయు అంతకంతకట్టి యనునాసిక పాఠము భష్టమగుటయు నాభాషల యందుఁ బ్రసిద్ధమయి యుండుటయే గాక వైయాకరణులచే సైతము తన్మార్గమంగీకరింపబడి యున్నది. "హింహిజ్ హిభిసః” అను ప్రాకృత వ్యాకరణ సూత్రము "భిస్" అను తృతీయా బహువచన ప్రత్యయమునకు వ్యవహారదశలో నగపడు ('రామైః = రామైహి) హివర్ణకమును విధించుటలో మొదట బిందు సహితముగను దర్వాత సానునాసికముగను దర్వాత నిరనునాసికముగను విధించుచున్నది. ఇట్టియనుక్రమము సైతము తెనుఁగులోని బిందువుయొక్క యూఁదిపలుకు నుచ్చారణము మొదటిదనియుఁ దేల్చి పలుకునుచ్చారణము తర్వాతిదనియు నిరనునాసికోచ్చారమింకను దర్వాతిదనియు నిట్లుచ్చారణ సహజ స్థితిని దెలుపుటలో మంచి నిదర్శనమైయున్నది.
మఱియు 'సానునాసికోచ్చారం జిత్' అనుసూత్రముచొప్పున జిత్తునకే సానునాసికోచ్చారణము ప్రాకృతవ్యాకరణములోఁ బ్రసిద్ధమైయున్నది. కాని జకారమిత్తుగాఁ గలదానికిఁ బూర్వవర్ణమున కాను నాసిక్యముకలుగుట ప్రసిద్ధమై యుండలేదు. “హిం, హిజ్, హి,భిసః" అను వాల్మీకి సూత్రము చొప్పున వచ్చిన హిజ్ ప్రత్యయమునందలి హకారోత్తర వత్తి౯యగు నికారమునకేగదా యానునాసిక్యము (రామేహి' షడ్భాషాచంద్రిక) వచ్చుట సంప్రదాయమైయున్నది. ఇట్టిస్థితిలో డుజ్ వర్ణకమున కర్ణబిందు పూర్వకత్వము 'జకారేత్త్వఫలమని ప్రాకృతవ్యాకరణ సంప్రదాయము చొప్పున నెట్లు చెప్పనగును? ఇంక నచ్చటఁ గూడ “దీర్ఘాచ్చేకండఏవ సజ్ఞేయః” అను స్థలమునందలి 'సః' అను సర్వనామ శబ్దవిషయమునందువలెనే సంస్కృత వ్యాకరణ ప్రసిద్ధములగు సేవో వింత సమన్వయములననుసరించి బిందుపూర్వకత్వ రూపార్ధవిశేషమును సంపాదించుకొనవలసిందేగదా! అట్టియర్థములు స్వారసికములు కావనుట సాహసము కాదని నా యభిప్రాయము. అరయ నరయ దుజౌది వర్ణకముల జకారెత్వమునకుఁ బ్రయోగాను సారముగాఁ బూర్ణార్థసాధారణమగు బిందుపూర్వకత్వమై ఫలమని వ్యాఖ్యానము చేసికొనుటయె యుక్తమును, సహజస్థితికి విరుద్దమును నగునని గ్రహింపవలయునని తోఁచుచున్నది.
ఇఁక నట్టిచిక్కులు లేకుండ "జిత్తుబిందుపూర్వకంబగు” (తత్స ౧౯ సూ) అని స్పష్టముగా సూత్రించుకొన్న బాలవ్యాకరణ కర్తగారుగూడఁ బైరీతినే "హ్రస్వముమీఁది ఖండ బిందువునకుఁ బూర్ణబిందువు వైకల్పికముగనగును" (బాల. సంజ్ఞా.౧౪) అని యిట్లేల సూత్రింపవలయునని శంకించుకొనవలసి యున్నది. బాగుగా బరిశీలించి చూడఁగాగాఁ ; నారింజ, చేమంతి' మున్నగు కొన్ని సిద్ధబిందుస్టలములందురు బూర్ల బిందువును దేల్చి పలుకువాడుకయే లేకుండుటచేతను (నారిఁజ, చేమఁతి, అను
రూపములు లేవుగదా) 'వనంబు' మున్నగు కొన్ని సాధ్యబిందుస్ధలములందు సైతము వనఁబు' అను మొదలగు సార్థబిందుక రూపములు లేకుండుటచేతను, 'నిద్దంపు' నాల్గింటి' అను మొదలగుచోట్ల 'నిద్దపు, నాల్గింటి' అను